అన్వేషించండి

కొత్త సినిమాపై అదిరిపోయే అప్​డేట్​ ఇచ్చిన విశాల్ - '#Vishal34' ఫస్ట్ లుక్, టీజర్ లోడింగ్!

కోలీవుడ్ హీరో విశాల్ తన కొత్త సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్​డేట్​ అందించాడు. హరి దర్శకత్వంలో తాను నటిస్తున్న సినిమాకు సంబంధించి రెండో షెడ్యూల్ పూర్తయినట్లు విశాల్ వెల్లడించాడు.

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ చాలా కాలం తర్వాత 'మార్క్ ఆంటోనీ'(Mark Antony) మూవీతో సాలిడ్ కం బ్యాక్ ఇచ్చాడు. టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్​లో రూపొందిన ఈ మూవీని అదిక్ రవిచంద్రన్ తెరకెక్కించగా వినాయక చవితి కానుకగా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. కోలీవుడ్ తో పాటు హిందీలోనూ భారీ కలెక్షన్స్​ని అందుకుంది. ప్రస్తుతం ఓటీటీలోనూ దుమ్ము రేపుతోంది. విశాల్ ఈ సక్సెస్​ని ఫుల్​గా ఆస్వాదిస్తున్నాడు. 'మార్క్ ఆంటోనీ' సక్సెస్​తో ఫుల్ జోష్ మీద ఉన్న ఈ కోలీవుడ్ హీరో ప్రస్తుతం తన 34వ సినిమాతో బిజీగా ఉన్నాడు. '#vishal34' అనే వర్కింగ్ టైటిల్​తో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను కోలీవుడ్ మాస్ డైరెక్టర్ హరి తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ చేయగా, పోస్టర్లో చుట్టూ గన్స్ కత్తుల మధ్యలో స్టెతస్కోప్ ఉన్న లుక్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. పోస్టర్​ని బట్టి సినిమాలో విశాల్ డాక్టర్​గా కనిపిస్తాడని స్పష్టమవుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ ఫాన్స్ లో జోష్ నింపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అదిరిపోయే అప్డేట్ అందించారు హీరో విశాల్. "చివరి షాట్. వర్షం రూపంలో దేవుడి ఆశీస్సులు అందించాడు. హరి సార్ డైరెక్షన్లో కరైకుడిలో సుదీర్ఘమైన రెండో షెడ్యూల్ ని పూర్తి చేశాం. టీజర్, ఫస్ట్ లుక్ త్వరలోనే" అంటూ షూటింగ్ లొకేషన్లో తీసిన స్టిల్ ని విశాల్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు.

ఈ అప్డేట్ తో విశాల్ ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. దీనికంటే ముందు రీసెంట్ గా తమిళనాడులోని తూతుకూడిలో ఈ సినిమాకు సంబంధించి ఇంటెన్స్ క్లైమాక్స్ షూట్ చేస్తున్నట్లు మేకట్స్ అప్డేట్ ఇచ్చారు. స్టంట్ మాస్టర్ కన్నన్ తో విశాల్ దిగిన పిక్ కూడా నెట్టింట వైరల్ అయింది. ఆ తర్వాత డైరెక్టర్ హరి తో పాటు గౌతమ్ మీనన్, సముద్రఖనితో దిగిన ఫోటోను కూడా విశాల్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.." ఒకే ఫోటోలో ముగ్గురు మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్లతో నిలబడడం చాలా అరుదు. ఎప్పటికీ గుర్తుంచుకోవాలి" అంటూ రాస్కొచ్చాడు. దీంతో సినిమాలో గౌతమ్ మీనన్, సముద్రఖని ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నట్లు తెలిసింది.

మాస్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో విశాల్ సరసన ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటిస్తోంది. 'భరణి', 'పూజా' వంటి సినిమాల తర్వాత హరి డైరెక్షన్ లో విశాల్ నటిస్తున్న మూడవ సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్, జి స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు 'తుప్పరివాలన్ 2' అనే సినిమాలోని నటిస్తున్నాడు విశాల్. ఈ మూవీ కూడా షూటింగ్ దశలో ఉంది.

Also Read : ప్రభాస్ 'కల్కి'లో రాజమౌళి పాత్ర అదేనట.. నెట్టింట ఫుల్ వైరల్

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Dacoit Teaser : అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
Nidhhi Agerwal : ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
India vs South Africa 4th T20: లక్నోలో భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దుపై దుమారం! బీసీసీఐపై మండిపడుతున్న అభిమానులు!
లక్నోలో భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దుపై దుమారం! బీసీసీఐపై మండిపడుతున్న అభిమానులు!
Embed widget