ప్రభాస్ 'కల్కి'లో రాజమౌళి పాత్ర అదేనట.. నెట్టింట ఫుల్ వైరల్
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న 'కల్కి' మూవీలో రాజమౌళి ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఇందులో రాజమౌళి ఓ సైంటిస్ట్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా హీరో ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ 'కల్కి 2898AD'లో దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి నటిస్తున్నాడని ఇటీవల ఓ వార్త బయటికి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో కల్కీపై ఉన్న అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి చేరిపోయాయి. అయితే రాజమౌళి 'కల్కి'లో ఎలాంటి రోల్ చేస్తున్నారనే విషయంపై ఆడియన్స్ లో సర్వత్ర ఆసక్తి నెలకొనగా తాజాగా రాజమౌళి రోల్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. డీటెయిల్స్ లోకి వెళితే.. యంగ్ టాలెంటెడ్ ఫిలిం మేకర్ నాగ్ అశ్విన్ ప్రభాస్ తో చేస్తున్న 'కల్కి'ని హాలీవుడ్ లెవెల్ లో రూపొందిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియో చూస్తే అది స్పష్టం అవుతుంది. ఇండియన్ మైథలాజికల్ క్యారెక్టర్స్ ని బేస్ చేసుకుని సిల్వర్ స్క్రీన్ పై విజువల్ వండర్ ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు నాగ అశ్విన్ అండ్ టీమ్. ఇందుకోసం పూర్తిగా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. అమితాబచ్చన్, కమలహాసన్, దీపికా పదుకొనే, దిశాపటాని లాంటి స్టార్ కాస్టింగ్ ఈ నటిస్తుండటం, సినిమాలో ప్రభాస్ శ్రీమహావిష్ణువు చివరి అవతారమైన కల్కిగా కనిపించబోతున్నాడని తెలియడంతో సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. అమితాబచ్చన్ ఇందులో లార్డ్ పరశురామ్ పాత్ర చేస్తున్నారు. అలాగే కమలహాసన్ విలన్ గా కనిపించబోతున్నారు.
కమల్ హాసన్ వేరే హీరో సినిమాలో విలన్ గా కనిపించడం ఇదే తొలిసారి. వీళ్లతో పాటు దర్శక దిగ్గజం రాజమౌళి కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే కదా. ప్రభాస్ తో రాజమౌళికి ఉన్న బాండింగ్, వైజయంతి మూవీస్ తో ఉన్న అనుబంధం కారణంగా కల్కిలో ఇంట్రెస్టింగ్ రోల్ కోసం రాజమౌళిని ఆఫర్ చేశారట. ఆ రోల్ లో నటించడానికి జక్కన్న సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక తాజా సమాచారం ప్రకారం 'కల్కి'లో రాజమౌళి సైంటిస్ట్ పాత్రలో కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. సినిమాలో ప్రయోగాలు చేసే శాస్త్రవేత్తగా రాజమౌళి కనిపిస్తారట. సినిమాకు ఆయన పాత్ర కూడా కీలకం కానుందని అంటున్నారు.
మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియకపోయినా కల్కిలో రాజమౌళి సైంటిస్ట్ గా చేస్తున్నారనే న్యూస్ మాత్రం వైరల్ అవుతుంది. సినిమాలో రాజమౌళి నటించడమే కాకుండా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కు సలహాలుజ్ సూచనలు కూడా ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత అశ్వినీదత్ సుమారు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతమందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కావలసిన ఈ చిత్రం షూటింగ్ ఆలస్యం కారణంగా 2024 వేసవికి విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే మేకర్స్ నుంచి రిలీజ్ డేట్ పై క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది.
Also Read : స్పెయిన్లో మొదలైన 'వార్ 2' షూటింగ్ - సెట్స్ నుంచి లీకైన వీడియో!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial