By: ABP Desam | Updated at : 24 Sep 2023 02:37 PM (IST)
Photo Credit : StarMaa/Youtube
ఆదివారం వచ్చిందంటే 'బిగ్ బాస్' హౌస్ లో సందడి మొదలవుతుంది. సండే అంటే ఫన్ డే అంటూ నాగార్జున హౌస్ మేట్స్ తో సరదా ఆటలు ఆడించి మంచి వినోదాన్ని పంచుతూ ఉంటారు. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో భాగంగా సండే ఫన్ డే ఎపిసోడ్(సెప్టెంబర్ 24) కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ప్రోమోలో మరోసారి నాగార్జున హౌస్ మేట్స్ తో ఫన్నీ టాస్కులు ఆడించి తనదైన పంచులతో ఆకట్టుకున్నారు. ఇక ప్రోమో ని ఒకసారి గమనిస్తే.. నాగార్జున కంటెస్టెంట్స్ అందర్నీ చూస్తూ ఏ గ్లామరస్ బాయ్, తేజ కుర్తా లో భలే ఉన్నావు అని అంటాడు. ఆ తర్వాత అరె యావర్ నువ్వు కూడా అదిరిపోయావు' అని చెబుతాడు.
ఆ తర్వాత చిట్టి ప్రశ్న అనే ఆటను ఆడబోతున్నామని చెబుతూ అన్న మల్లొచ్చినా రా! అనే డైలాగ్ తో ప్రశాంత్ ని ముందుగా పిలుస్తాడు. ఆ తర్వాత 'ఈ హౌస్ లో కలుపు మొక్క ఎవరని' శివాజీని అడుగుతారు నాగార్జున. దానికి శివాజీ బదిలీస్తూ.." చాలామంది ఉన్నారండి" అని చెబుతున్న సమయంలో తేజ, "సార్ నేను ఆ చివరన కూర్చుంటానండి. వచ్చిన వాళ్ళందరూ నా వైపే చూస్తున్నారు సార్" అని చెప్పగానే శివాజీ, తేజ కలుపు మొక్కా అని చెప్తాడు. దాంతో తేజ షాక్ అయి సరదాగా చూసావ్ అనుకున్నా అన్నా, అని శివాజీ తో తేజ అంటాడు. "తేజ కి డిస్కషన్ ఎక్కువ అని శివాజీ చెప్తే, నిజమేనా అని నాకు ప్రశ్నిస్తారు. దానికి నాకు తెలియదు సార్, ఇప్పుడే తెలిసింది" అని తేజ బదులిస్తాడు.
ఆ తర్వాత ఈ "హౌస్ లో తేనె పూసిన కత్తి ఎవరు? అని నాకు అడగగా.." అది నేనే అనుకుంటున్నాను సార్ అని దామిని" చెబుతుంది. దానికి నాగర్జున, "ఇది సేఫ్ గేమ్ కదమ్మా" అని అంటారు. ఆ తర్వాత రతిక వచ్చి ముళ్ళు తిప్పుతుంది. అప్పుడు"రతిక నీకైతే ఏదో రెండు కలర్స్ మధ్య కన్ఫ్యూజన్ లాగా ఉంది" అని నాగార్జున చెప్పగానే అందరూ నవ్వేశారు." ఇంట్లో ఎవరికీ పని తక్కువ, తిండి ఎక్కువ? అని టేస్టీ తేజని అడిగితే తేజ, రతిగా అని బదిలిస్తాడు. "సాయంత్రం 7:30గం కు మొదలెడితే 10:30గం దాకా ఆపదు సర్ తింటూనే ఉంటుంది" అని అంటాడు.' ఆవిడకి తినిపిస్తున్నారు కాబట్టి తింటుంది' అని నాగార్జున పంచ్ వేస్తారు. అలా ఆ టాస్క్ చాలా సరదాగా సాగింది.
ఆ తర్వాత ఈ వారం సెలబ్రిటీ గెస్ట్ గా రామ్ తన 'స్కంద' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టారు. స్టేజ్ పైకి వచ్చి నాగార్జునని హగ్ చేసుకుని హౌస్ మేట్స్ కి హాయ్ చెబుతూ," శివాజీ గారు మీరు బాగా షార్ప్ గా ఉన్నారు" అని రామ్ చెబుతుండగా, మధ్యలో నాగార్జున కలగజేసుకొని.." ఇప్పటిదాకా నాతో కళ్ళజోడు పెట్టుకుని మాట్లాడావు, అదే ఆడపిల్లలు కనపడగానే కళ్ళజోడు తీసేసావ్" అంటూ రామ్ని ఆట పట్టిస్తాడు. అలా ఈ ప్రోమో చాలా సరదాగా సాగింది. మరోవైపు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో భాగంగా ఈ వారానికి గానూ హౌస్ నుండి సింగర్ దామిని ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : నువ్వేమైనా పెద్ద పిస్తావా? సందీప్‌కు నాగ్ క్లాస్, ఊహించని పనిష్మెంట్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Bigg Boss 7 Telugu: శోభాను కాలితో తన్నిన అమర్దీప్ - ఓట్లపై మోనిత ఓవర్ కాన్ఫిడెన్స్, ప్రియాంకతో వాదన
Bigg Boss 17: ‘బిగ్ బాస్’లో ముద్దులు పెట్టుకున్న కంటెస్టెంట్స్, రాత్రయితే రచ్చే - తిట్టిపోస్తున్న జనం
Bigg Boss 7 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్‌లో తడిచి ముద్దయిన కంటెస్టెంట్స్ - పార్టీయా? పనిష్మెంటా?
Gautham Krishna Remuneration: ఓ మై గాడ్, గౌతమ్ 13 వారాల రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకవ్వుతారు
Bigg Boss 7 Telugu: చేతికి గాజులు వేసుకొని కూర్చున్నాను - బిగ్ బాస్ హౌస్‌లో ‘ఆడోడు’ లొల్లి!
Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు
Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!
Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!
Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!
/body>