News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Bigg Boss Telugu 7: నువ్వేమైనా పెద్ద పిస్తావా? సందీప్‌కు నాగ్ క్లాస్, ఊహించని పనిష్మెంట్

ఈ వారం కంటెస్టెంట్లు చేసిన తప్పిదాలపై నాగ్ స్పందించారు. ముఖ్యంగా అమర్ దీప్, సందీప్, రతికలను కడిగిపడేశారు.

FOLLOW US: 
Share:

‘బిగ్ బాస్’ సీజన్ 7 (Bigg Boss Telugu Season 7) శనివారం ఎపిసోడ్‌లో ఫస్ట్  హౌస్‌మేట్ సందీప్‌కు హోస్ట్ నాగార్జున ఫుల్ క్లాస్ పీకారు. నువ్వేమైనా పిస్తావా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సంచాలకుడిగా విఫలమయ్యావని అన్నారు. ప్రియాంక, శోభాశెట్టి, ప్రిన్స్ యావర్‌లో వీకెస్ట్ కంటెస్టెంట్‌ను పక్కన పెట్టాలని ‘బిగ్ బాస్’ చెబితే స్ట్రాంగెస్ట్ కంటెస్టెన్‌ను అనర్హుడిగా ప్రకటించడం, ప్రియాంకకు సలహాలు ఇవ్వడంపై నిలదీశారు. అయితే, స్పైసీ చికెన్ టాస్క్‌లో మాత్రం సందీప్ నిర్ణయాన్ని సమర్దించారు. అంతేకాదు, అమర్‌దీప్, ప్రియాంక‌లకు కూడా నాగ్ గట్టిగానే క్లాస్ పీకారు. 

ప్రశాంత్ విన్ అయ్యేవాడేమో

స్పైసీ చికెన్ టాస్క్‌లో శోభాశెట్టికి ఫేవర్‌గా సందీప్ నిర్ణయం తీసుకున్నాడని ప్రేక్షకులు భావిస్తున్నారు. దీనికి నాగార్జున క్లారిటీ ఇచ్చారు. గౌతమ్ ఆ ముక్కను కూడా పూర్తిగా తినాలని అన్నారు. ప్రశాంత్ ఒక ముక్కను వదిలేసి గంట కొట్టాడని, అది కూడా తినేసి ఉంటే.. అతడు అర్హుడై ఉండేవాడని నాగ్ అన్నారు. ఈ టాస్క్‌లో సందీప్ తీసుకున్న నిర్ణయం కరక్టేనని అన్నారు. అయితే, ప్రియాంక, శోభాశెట్టి, ప్రిన్స్ యావర్‌లో వీకెస్ట్ కంటెస్ట్‌ను ఎంపిక చేయాలంటే.. స్ట్రాంగ్‌గా ఉన్న ప్రిన్స్ యావర్‌ను ఆ టాస్క్ నుంచి తొలగించారు. ఇందుకు సంచాలకుడిగా వ్యవహరించిన సందీప్‌.. ప్రియాంకకు బీస్ట్ టాస్క్ అంశాన్ని ప్రస్తావిస్తూ యావర్‌‌ను టాస్క్ నుంచి పక్కకు తప్పించేందుకు సహకరించాడు. ఈ విషయాన్నే నాగ్ ప్రస్తావిస్తూ సందీప్‌కు క్లాస్ పీకారు. అప్పటికి బిగ్ బాస్ తనని సంచాలకుడిగా ప్రకటించలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే, నాగ్.. నిన్ను సంచాలకుడిగా ప్రకటించిన తర్వాతే బీస్ట్ టాస్క్ గురించి ప్రియాంక దగ్గర ప్రస్తావించి ఆమెతో చర్చించావని అన్నారు. నువ్వు ఏమైనా పిస్తా అనుకుని బిగ్ బాస్ పిలిచాడని అనుకుంటున్నారా అని నాగ్ అన్నారు. ఇలా చేసినందుకు సందీప్‌ను జైలుకు పంపాలా? లేదా ఆయన బ్యాటరీ లైఫ్‌ను తగ్గించాలా అని ప్రియాంక, శోభాశెట్టిని అడిగారు. దీంతో వారు జైలుకు పంపాలని చెప్పారు. అయితే నాగ్ మాత్రం సందీప్ బ్యాటరీ డౌన్ చేయాలని ఆదేశించారు. 

ప్రశాంత్‌పై అరిచావు, ప్రియాంకను అడగలేకపోయావు

పవర్ అస్త్ర టాస్క్‌కు అమర్‌దీప్‌ను అనర్హుడని ప్రియాంక చెప్పడంపై నాగ్ ప్రస్తావించారు. నువ్వు ఎందుకు అర్హుడివనే విషయాన్ని ఎందుకు చెప్పలేకపోయావు, నిన్ను నువ్వు ఎందుకు డిఫెండ్ చేయకోలేదని అమర్‌దీప్‌ను అడిగారు. నువ్వు నీ కోసం ఆడతున్నావా? ప్రియాంక కోసం ఆడుతున్నావా? నువ్వు నీ కోసం ఆడు అన్నారు. ఆ రోజు ప్రశాంత్ నిన్ను అనర్హుడు అన్నందుకు అతడిపై అరిచావు, అదే విషయాన్ని ప్రియాంక చెబితే నువ్వు ఎందుకు నిలదీయలేకపోయావని అడిగారు నాగ్. అలాగే, ఈ వారం అస్సలు నువ్వు గేమ్‌లో కనిపించలేదని నాగ్ అన్నారు. అలాగే, శివాజీ పవర్ అస్త్రాను కాజేశావు.. ఆయన హీరో అయితే, నేను విలన్ అని శపథం చేశావు. కానీ, ఏమయ్యావు అని నాగ్ అన్నారు. దీనికి అమర్ సమాధానమిస్తూ.. ఆయన్ను డల్‌గా చూసిన తర్వాత తిరిగి ఇచ్చేయాలని అనిపించిందని అన్నాడు. అయితే, పవర్ అస్త్ర తన వద్ద ఉంటే.. ఏదైనా లాభం జరగవచ్చని తాను భావించానన్నాడు. 

గేమ్ ఛేంజర్‌గా ప్రిన్స్ యావర్, టేస్టీ తేజాకు నాగ్ పనిష్మెంట్ 

ఈ వారం ‘బిగ్ బాస్’ హౌస్‌లో గేమ్ ఛేంజర్, సేఫ్ గేమర్ ఎవరో చెప్పాలని నాగార్జున అడిగారు. ఈ సందర్భంగా ప్రియాంక.. శోభశెట్టి గేమ్ ఛేంజర్ అని చెప్పింది. శుభశ్రీ సేఫ్ గేమర్ అని తెలిపింది. శోభా.. యావర్ గేమ్ ఛేంజర్, టేస్టీ తేజా సేఫ్ ప్లేయర్ అని పేర్కొంది. ప్రశాంత్.. యావర్‌ను గేమ్ ఛేంజర్‌గా ఎన్నుకున్నాడు. తేజ సేఫ్ ప్లేయర్ అన్నాడు. 
గౌతమ్.. ప్రియాంకను గేమ్ ఛేంజర్ అని, తేజా సేఫ్ ప్లేయర్ అన్నాడు. దామిని.. సేఫ్ ప్లేయర్ అమర్ దీప్‌కు ఇచ్చింది. ప్రిన్స్ యావర్‌ సేఫ్ ప్లేయర్ అని పేర్కొంది. టేస్టీ తేజా.. ప్రియాంక గేమ్ ఛేంజార్ అని, అమర్ దీప్ సేఫ్ ఛేంజర్ అని తెలిపాడు. శోభా శెట్టి.. ప్రియాంక గేమ్ ఛేంజర్, సేఫ్ ప్లేయర్ ప్రశాంత్. ప్రిన్స్ మాట్లాడుతూ.. ప్రశాంత్ గేమ్ ఛేంజర్ అని తెలిపాడు. దామిని సేఫ్ ప్లేయర్ అన్నాడు. అమర్ దీప్.. దామిని గేమ్ ఛేంజర్ అని, రతిక సేఫ్ ప్లేయర్ అని అన్నాడు. రతిక.. యావర్ గేమ్ ఛేంజర్ అని, టేస్టీ తేజ సేఫ్ ప్లేయర్ అని పేర్కొంది. 

అయితే, రతిక చేసిన నామినేషన్స్‌పై నాగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరో ఫాలో అవుతున్నట్లుగా నామినేట్ చేశావన్నారు. ఆ రోజు తన ఎక్స్ గుర్తుకొచ్చి డిజపాయింట్ అయ్యానని రతిక పేర్కొంది. దీనిపై నాగ్ స్పందిస్తూ.. ‘‘ఎక్స్ అనేది గతం. యావర్ చూడు.. నువ్వు అతడిని అనర్హుడని తెలిపినా, ఆ తర్వాత నీకు అన్నం తినిపించాడను’’ అని నాగ్ అన్నారు. ఇందుకు యావర్ స్పందిస్తూ.. ‘‘రతిక చేసిన దాన్ని గేమ్‌గా తీసుకున్నా. ఆ తర్వాత మేం ఫ్రెండ్స్ కదా’’ అని అన్నాడు. చివరిగా సేఫ్ ప్లేయర్ అని బ్యాడ్జ్‌లు పొందిన టేస్టీ తేజాకు నాగ్ పనిష్మెంట్ ఇచ్చారు. వారం రోజులపాటు డిష్‌లు వాష్ చేయాలన్నారు.

Also Read: శోభాశెట్టితో సందీప్ కుమ్మక్కు? గౌతమ్‌కు అన్యాయం - ఈ వీడియో చూస్తే అదే అనిపిస్తుంది!

Published at : 23 Sep 2023 11:03 PM (IST) Tags: aata sandeep Nagarjuna Bigg Boss Telugu 7 Bigg Boss Telugu Season 7 Sandeep Amar Deep Bigg Bigg Telugu

ఇవి కూడా చూడండి

Bigg Boss 7 Telugu: మరోసారి ఫౌల్ గేమ్‌తో అమర్‌దీప్ గెలుపు, తనను కొట్టాడంటూ అర్జున్‌తో ప్రశాంత్ లొల్లి!

Bigg Boss 7 Telugu: మరోసారి ఫౌల్ గేమ్‌తో అమర్‌దీప్ గెలుపు, తనను కొట్టాడంటూ అర్జున్‌తో ప్రశాంత్ లొల్లి!

Bigg Boss 7 Telugu: వెధవ కారణాలు చెప్పకు - పల్లవి ప్రశాంత్‌పై అర్జున్ సీరియస్

Bigg Boss 7 Telugu: వెధవ కారణాలు చెప్పకు - పల్లవి ప్రశాంత్‌పై అర్జున్ సీరియస్

Bigg Boss 7 Telugu: ‘బిగ్ బాస్’ శోభా హేటర్స్‌కు గుడ్ న్యూస్ - అదేంటో తెలుసుకోవాలని ఉందా?

Bigg Boss 7 Telugu: ‘బిగ్ బాస్’ శోభా హేటర్స్‌కు గుడ్ న్యూస్ - అదేంటో తెలుసుకోవాలని ఉందా?

Shobha Shetty: శోభా, ఏమిటి మాకీ క్షోభ - ఆమెకు ఎవరు ఓట్లు వేస్తున్నారంటూ చర్చ, ఈ వారమైనా వెళ్తుందా?

Shobha Shetty: శోభా, ఏమిటి మాకీ క్షోభ - ఆమెకు ఎవరు ఓట్లు వేస్తున్నారంటూ చర్చ, ఈ వారమైనా వెళ్తుందా?

Bigg Boss 7 Telugu: ఫలించిన అమర్ శాపం - అర్జున్, యావర్‌లకు బిగ్ బాస్ కేక్ టాస్క్

Bigg Boss 7 Telugu: ఫలించిన అమర్ శాపం - అర్జున్, యావర్‌లకు బిగ్ బాస్ కేక్ టాస్క్

టాప్ స్టోరీస్

Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?

Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?

SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో

SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో

Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు

Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు