News
News
X

Bigg Boss 5: ఆర్జే కాజల్‌కి వంట రాదా? బిగ్ బాస్‌లో ఎందుకలా చెప్పింది? మరి ఈ వీడియోలో వండింది ఎవరబ్బా?

ఆర్జే కాజల్ కు అప్పుడే నెటిజన్ల సెగ మొదలైంది. ఆమె వంట రాదు అని చెప్పినందుకు ఆమె పాత వీడియోలను తవ్వితీస్తున్నారు నెటిజన్లు.

FOLLOW US: 
 
బిగ్ బాస్ ఇంట్లో యాక్టివ్ గా ఉండే కంటెస్టెంట్లలో ఆర్జే కాజల్ కూడా ఒకరు. కానీ ఆ యాక్టివ్ నెస్ కాస్త అతిగా కూడా అనిపిస్తోంది ప్రేక్షకులకు. ముఖ్యంగా ఇంటి పనుల విషయంలో ఆమె మాట్లాడే తీరు కాస్త ఓవర్ గా ఉంది. మూడు రోజుల క్రితం కిచెన్ లో ఒక హౌస్ మేట్ తో మాట్లాడుతూ తనకు కిచెన్ శుభ్రపరిచే పని నచ్చదని, తన ఇంట్లో కూడా శుభ్రం చేయనని, అంట్లు కూడా తోమనని చెప్పింది.  నిజానికి ఆ ఎపిసోడ్ తోనే ఆమెపై నెటిజన్ల ట్రోలింగ్ మొదలవుతుందనుకున్నారు ప్రేక్షకులు. కానీ ఎందుకో కాస్త ఓపిక పట్టారు. కానీ ఈసారి మాత్రం వదల్లేదు. నాకు వంట రాదు అంటూ ఇంట్లో పచ్చి అబద్ధం చెప్పేసింది ఆర్జే కాజల్.  బిగ్ బాస్ అన్ని భాషల్లోని, అన్ని సీజన్లను చూశానని, ఇది తన డ్రీమ్ అని చెప్పుకునే కాజల్ కు, బిగ్ బాస్ హౌస్లో కేవలం నిజం మాత్రమే మాట్లాడాలని, అబద్ధం చెబితే నెటిజన్లు ఆటాడేసుకుంటారని తెలియదా? ఆ అబద్ధంతో అడ్డంగా దొరికేసింది.  ఇంకేముంది ఆమె వంట చేసినా పాత వీడియోలను తవ్వితీస్తున్నారు నెటిజన్లు. 

అసలేమైంది?
తాజా ఎపిసోడ్ లో సిరి ఇంటి మొదటి కెప్టెన్ గా ఎంపికైంది. ఆమె సామరస్యంగా ఇంటి సభ్యుల పనుల బాధ్యతను అప్పజెప్పేందుకు పూనుకుంది. ఇందులో భాగంగా కాజల్ తనకు వంట రాదని,  కిచెన్ డిపార్ట్ మెంట్ వద్దని తెగేసి చెప్పింది.  దీంతో నెటిజన్లు ఆమె వంట చేసిన వీడియోను వెతికి తీసి ట్విట్టర్ లో పోస్టు చేశారు. అందులో కాజల్ చేపల కూర, మిరపకాయ బజ్జీలు చేస్తూ కనిపించింది. నిజానికి కాజల్ కు వంట చేయడం ఆసక్తి ఉండదట. ఈ విషయాన్ని ఆమె అక్క రంజాన్ సందర్భంగా అఖిల్ సార్ధక్, సోహైల్ తో కాజల్ చేసిన వ్లాగ్ లో చెప్పింది. ఆ ఎపిసోడ్ లోనే కాజల్ తన కూతురి పుట్టినరోజుకు బిర్యానీ వండినట్టు కూడా బయటపడింది. దీన్ని బట్టి చూస్తే ఆమెకు వంట వచ్చని అర్థమవుతోంది, కాకపోతే చేసే ఆసక్తి తక్కువ. అనవసరంగా చిన్న అబద్ధమాడి ట్రోల్స్ బారిన పడింది కాజల్. అదే తనకు వంట ఆసక్తి ఉండదని చెబితే... ఈ కష్టాలు వచ్చేవి కాదు. 

News Reels

Published at : 11 Sep 2021 01:11 PM (IST) Tags: RJ Kajal Host Nagarjuna Biggboss5 cooking

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: ఇంట్లో 'బాంబ్' పెట్టేసిన బిగ్ బాస్ - కన్ఫెషన్ రూంలోకి వెళ్లనన్న శ్రీసత్య, రేవంత్ సీరియస్

Bigg Boss 6 Telugu: ఇంట్లో 'బాంబ్' పెట్టేసిన బిగ్ బాస్ - కన్ఫెషన్ రూంలోకి వెళ్లనన్న శ్రీసత్య, రేవంత్ సీరియస్

Bigg Boss 6 Telugu: దెయ్యాల గదిలో ఆదిరెడ్డి, శ్రీహాన్ - వీరు మరీ ఇంత పిరికి వాళ్లా?

Bigg Boss 6 Telugu: దెయ్యాల గదిలో ఆదిరెడ్డి, శ్రీహాన్ - వీరు మరీ ఇంత పిరికి వాళ్లా?

BiggBoss 6 Telugu: రోహిత్ వర్సెస్ ఆదిరెడ్డి, ఇద్దరిలో గెలుపు ఎవరిది - రేవంత్ గొడవలు ఇక ఆపడా?

BiggBoss 6 Telugu: రోహిత్ వర్సెస్ ఆదిరెడ్డి, ఇద్దరిలో గెలుపు ఎవరిది - రేవంత్ గొడవలు ఇక ఆపడా?

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ ఇంట్లో దెయ్యం, అరుపులతో భయపెట్టేసిన ఆ కంటెస్టెంట్

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ ఇంట్లో దెయ్యం, అరుపులతో భయపెట్టేసిన ఆ కంటెస్టెంట్

Bigg Boss 6 Telugu: ఇంటి సభ్యులకు చుక్కలు చూపిస్తున్న బిగ్‌బాస్, విన్నర్ ప్రైజ్ మనీ పెంచేందుకు వింత టాస్కులు

Bigg Boss 6 Telugu: ఇంటి సభ్యులకు చుక్కలు చూపిస్తున్న బిగ్‌బాస్, విన్నర్ ప్రైజ్ మనీ పెంచేందుకు వింత టాస్కులు

టాప్ స్టోరీస్

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

తీవ్ర తుపానుగా మ్యాన్‌డౌస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

తీవ్ర తుపానుగా మ్యాన్‌డౌస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Airport Metro : లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో - శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి !

Airport Metro :  లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో - శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి !