అన్వేషించండి
Bigg Boss 6: 'లైఫ్ లో ఏ మూమెంట్ అయినా బిగ్ బాస్ తరువాతే' - కొత్త ప్రోమో!
ఈరోజు వినాయకచవితి సందర్భంగా బిగ్ బాస్ షోకి సంబంధించిన మరో ప్రోమో వదిలారు.
బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్(Bigg Boss). అన్ని భాషల్లో ఈ షో సూపర్ హిట్ అయింది. తెలుగులో కూడా ఈ షోకి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. అలానే ఈ ఏడాది ఓటీటీ వెర్షన్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలనుకున్నారు. హాట్ స్టార్ లో 24 గంటల కాన్సెప్ట్ తో ఈ షోని నడిపించారు. కానీ ఆశించిన స్థాయిలో ఓటీటీ వెర్షన్ క్లిక్ అవ్వలేదు.
ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ సీజన్ 6(Bigg Boss 6) కోసం సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 4 నుంచి ఈ షో మొదలవుతుందని వెల్లడించారు. ఇప్పటికే ఈ షోకి సంబంధించిన చాలా ప్రోమోలు వచ్చాయి. ఈరోజు వినాయకచవితి సందర్భంగా మరో ప్రోమో వదిలారు. 'లైఫ్ లో ఏ మూమెంట్ అయినా బిగ్ బాస్ తరువాతే' అంటూ నాగార్జున చెప్పే డైలాగ్ తో ఈ ప్రోమో మొదలైంది. కంటెస్టెంట్స్ ని రివీల్ చేయకుండా సస్పెన్స్ లో పెట్టారు.
ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ సీజన్ 6(Bigg Boss 6) కోసం సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 4 నుంచి ఈ షో మొదలవుతుందని వెల్లడించారు. ఇప్పటికే ఈ షోకి సంబంధించిన చాలా ప్రోమోలు వచ్చాయి. ఈరోజు వినాయకచవితి సందర్భంగా మరో ప్రోమో వదిలారు. 'లైఫ్ లో ఏ మూమెంట్ అయినా బిగ్ బాస్ తరువాతే' అంటూ నాగార్జున చెప్పే డైలాగ్ తో ఈ ప్రోమో మొదలైంది. కంటెస్టెంట్స్ ని రివీల్ చేయకుండా సస్పెన్స్ లో పెట్టారు.
సెప్టెంబర్ నుంచి వంద రోజుల పాటు ఈ షో సాగనుంది. షోకి వచ్చే క్రేజ్ ని బట్టి మరో వారం రోజులు పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయి. 17 లేదా 18 మంది కంటెస్టెంట్స్ ఈ షోలో కనిపించనున్నారు. గతంలో కామన్ మ్యాన్ కి ఈ షోలో అవకాశం దక్కింది. కొన్నాళ్లకు ఆ కాన్సెప్ట్ ను పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ షో కామన్ మ్యాన్ కనిపించబోతున్నారు. అలానే బుల్లితెరపై అలరిస్తోన్న కొందరు సెలబ్రిటీలను ఈ షో కోసం తీసుకురాబోతున్నారు.
బిగ్ బాస్6లో అల్లు అర్జున్ ఐటెం గర్ల్:
అభినయ శ్రీ గుర్తుందా..? అదేనండీ.. అల్లు అర్జున్ నటించిన 'ఆర్య' సినిమాలో 'అ అంటే అమలాపురం' సాంగ్ కి స్టెప్పులేసింది కదా.. ఆమెనే. ఈ బ్యూటీని ఇప్పుడు బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అభినయ శ్రీ తన కెరీర్ లో 'ఎవడి గోల వాడిది', 'పైసాలో పరమాత్మ', 'అత్తిలి సత్తిబాబు' వంటి సినిమాల్లో నటించింది. చాలా కాలంగా ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఇప్పుడు తిరిగి కం బ్యాక్ ఇవ్వడానికి రెడీ అయింది. ఇందులో భాగంగా బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా కనిపించడానికి రెడీ అయింది.
ఆర్జీవీ బ్యూటీకి ఛాన్స్:
ఇటీవల రామ్ గోపాల్ వర్మతో ఇంటిమేట్ డాన్స్ చేస్తూ వార్తల్లో నిలిచింది ఇనయ సుల్తానా. ఈమెను కూడా బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ లో కూడా ఆర్జీవీ బ్యూటీస్ కి అవకాశం వచ్చింది. ఆ సమయంలో వర్మ వారికి తన మద్దతు తెలిపారు. మరి ఇనయ సుల్తానాను కూడా సపోర్ట్ చేస్తారేమో చూడాలి. వీరిద్దరితో పాటు 'చంటిగాడు' ఫేమ్ బాలాదిత్య, 'నువ్వు నాకు నచ్చావు' సినిమాలో హీరోయిన్ చెల్లెలిగా కనిపించిన సుదీపా పింకీలను కూడా కంటెస్టెంట్స్ గా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion