Bigg Boss Telugu Season 9 : తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9ను పిక్‌నిక్‌లా ఎంజాయ్ చేస్తున్న హౌస్‌మేట్స్- సోషల్ మీడియాలో షో చేస్తున్న పీఆర్ టీంలు
Bigg Boss Telugu Season 9 :రియాల్టీ షో కాస్త పీఆర్ ఈవెంట్‌లా మారింది. తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన వారంతా ఎంజాయ్ చేస్తుంటే బయట సోషల్ మీడియాలో పీఆర్ టీంలు షోను నడిపిస్తున్నారు.

Bigg Boss Telugu Season 9 :కంటెంట్ లేనప్పుడే ప్రచారం పీక్స్‌లో ఉండాలి అంటారు. ఇప్పుడు తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9లో సాగుతోంది. ఇప్పుడు ఉన్న వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా విన్నర్ మెటిరియల్ ఉన్న వ్యక్తులు లేరు. వెళ్లిన మొదటి రోజు నుంచి కూడా ఏదో పిక్‌నిక్‌కు వెళ్లినట్టు హ్యాపీగా గడిపేస్తున్నారు. ఒక్కరంటే ఒక్కరికి కూడా సీరియస్‌నెస్ లేదు. వీళ్ల తీరు చూసిన బిగ్‌బాస్ కూడా వారి దారిలోనే వెళ్తున్నారు. ఇచ్చిన టాస్క్‌లు అలానే ఉంటున్నాయి. పూర్తిగా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. వీకెండ్‌లో వచ్చిన నాగార్జున కూడా నాలుగు మాటలు మాట్లాడి నాలుగు జోక్స్ వేసి వెళ్లిపోతున్నారు. కాస్త సీరియస్‌గా ఆడేవాళ్లను కన్ఫ్యూజన్‌లో పడేసి వెళ్లిపోతున్నారు. మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు మా టీవీలో వచ్చే మరో సీరియల్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. కనీసం ఆ సీరియల్స్‌లోనైనా సీరియస్ మ్యూజిక్ వేసి ఆసక్తిని పెంచుతుంటారు. ఇక్కడ అది కూడా లేదు.
హౌస్‌లోకి వెళ్లిన వారంతా హ్యాపీగా బిగ్‌బాస్ పెట్టిన ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. జనాలను ఎంటర్‌టైన్ చేయడం ఎప్పుడో మానేశారు. అయితే వారిని గెలిపించే బాధ్యతను మాత్రం వారు పెట్టుకున్న పీఆర్ టీంలు భుజానకెత్తుకున్నాయి. ఎప్పటి నుంచో తెలుగు బిగ్‌బాస్‌పై ఈ అపవాదు ఉంది. హౌస్‌లోకి వెళ్లే ముందు చాలా మంది పీఆర్ టీంలను పెట్టుకుంటున్నాయి. వారు తమకు తెలిసిన వారికి చెప్పి పోస్టుకు ఇంత డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాలో, బిగ్‌బాస్ కంటెంట్‌పై తాము సపోర్ట్‌చేసే వారికి అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు. వ్యతిరేకించే వారిని తిడుతూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటి వరకు రాజకీయాల్లో, సినిమాల్లో మాత్రమే ఈ జాడ్యం ఉండేది. ఇప్పుడు దీన్ని బిగ్‌బాస్ హౌస్‌లోకి తీసుకొచ్చారు.
ఇప్పుడు హౌస్‌లో ఉన్న వారిలో ఒక్కరు కూడా సీరియస్ టాస్క్‌లు ఆడటం లేదు. ఉన్నది ఉన్నట్టు మొహాలపై చెప్పే వాళ్లు లేరు. సీరియస్‌గా కప్ గెలవాలనే ఆలోచన లేదు. అందుకే చక్కని ఉదాహరణ నామినేషన్లు. ఇన్ని రోజులు కలిసి ఉంటున్నా, ఇన్ని రోజులు టాస్క్‌లు ఆడుతున్నప్పటికి ఒకరిపై ఒకరి ఒక్కటంటే ఒక్క నెగటివ్ పాయింట్స్ లేవంటే వారంతా ఎలాంటి సేఫ్ గేమ్ ఆడుతున్నారో అర్థమైపోతోంది. ఒకప్పుడు నామినేషన్‌ల గురించి చర్చించుకుంటా వారిని సీరియస్‌గా నామినేట్ చేసే బిగ్ బాస్ కూడా ఇప్పుడు చాలా లైట్ తీసుకుంటున్నారు. వాళ్లంతా నేరుగా ఎవరిని ఏ పాయింట్లతో నామినేట్ చేయాలోకూడా చర్చించుకుంటున్నారు. అందుకు సుమన్ శెట్టి బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రతి వారం కూడా ఆయన తన నామినేషన్ పాయింట్లను వేరే హౌస్‌మేట్స్‌ను అడుగుతుంటారు. ఎవర్ని నామినేట్ చేయాలో అర్థం కాక వారు చెప్పి వాడుకొని నామినేట్ చేస్తుంటారు. అలాంటి వ్యక్తిని పీఆర్ టీంలో తెగ ఎత్తుతున్నాయి. సెంటిమెంట్ బీజీలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నాయి.
సోమవారం జరిగిన నామినేషన్ టాస్క్‌లో సీరియస్‌గా వాదులాడుకున్న ఇమాన్యుయెల్, తనూజ కాసేపటికే నవ్వుతూ ఎంచక్క మాట్లాడుకున్నారు. నామినేషన్ పాయింట్ల గురించి పట్టించుకోవద్దని ఒకరిని ఒకరు మోటివేట్ చేస్తుకున్నారు. వేరే వాళ్లను టార్గెట్ చేస్తే మిస్ ఫైర్ అయ్యిందని ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచుకొని కలిసి ఆడదామని డిసైడ్ అయ్యారు. ఇలాంటివి మిగతా హౌస్‌మేట్స్ మాట్లాడితే వారిని టార్గెట్ చేస్తూ వీళ్లిద్దరి పీఆర్ టీంలో రెచ్చిపోతున్నాయి. కావాలని వారిని టార్గెట్ చేస్తూ బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నాయి. తనూజను టార్గెట్ చేసిన శ్రీజను అలానే పంపించేశారు. బాండ్ భరణిని ఇంట్లోకి తీసుకొచ్చారు. ఒకసారి అదే బాండ్స్‌లో బయటకు వెళ్లినప్పటికీ ఆయన మాత్రం ఆట మార్చుకోలేదు. ఇంకా సేఫ్ గేమ్ ఆడుతూనే ఉన్నారు. సోమవారం కూడా దివ్యతో ఇదే విషయంపై చర్చించారు. డైరెక్ట్‌గా నామినేట్ చేసే అవకాశం వస్తే వేరే వాళ్లను చేయకుండా తనూజను ఎందుకు నామినేట్ చేశావని దివ్యను అడుగుతున్నాడు. తనూజ నామినేట్‌లో లేకపోతే నామినేషన్‌లో ఉన్న తనకు ఆమె ఓట్లు పడతాయని, నిఖిల్ లాంటి వాళ్లు ఉంటే తాను సేఫ్ కావచ్చు కదా అనే అర్థం వచ్చేలా మాట్లాడాడు.
తనూజ, భరణి, ఇమాన్యుయెల్, సుమన్ శెట్టి లాంటి వారు టాస్క్‌లో బీభత్సమైన ఫెర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా ఓటింగ్‌లో మాత్రం టాప్‌లో ఉంటున్నారు. దీనికి కేవలం పీఆర్ టీంలు చేస్తున్న ప్రచారమే అనాలి. వీళ్లంతా సోషల్ మీడియాలో మీమ్స్‌పేజీల్లోకి, ఓటింగ్ పేజీల్లోకి వెళ్లి తాము సపోర్ట్ చేయాల్సిన హౌస్‌మేట్‌కు సపోర్ట్‌గా ఓట్లు వేస్తున్నారు. ఈ పీఆర్ టీంలు వేర్వేరు రాష్ట్రాల్లో ఉండి పని చేస్తున్నాయి. తాము సపోర్ట్ చేస్తున్న కంటెస్టెంట్ పేరు కనిపిస్తే చాలు దానికి ఎదురుగా ఓట్లు వేస్తున్నారు. అందులో ఉన్న విషయం ఏంటో కూడా చూడటం లేదు. దీనిపై కూడా సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతోంది. ఇలాంటి వారిలో తనూజ టీం మొదటి స్థానంలో ఉంది. ఆమె పేరు కనిపిస్తే చాలు ఓట్లు వేస్తున్నారు. అసలు ఆ పోల్‌లో ఏం ఉందో కూడా చూడటం లేదు.
ఈ పీఆర్ స్టంట్‌లు ఇప్పుడు కాదు. సీజన్ రెండు నుంచి మొదలైంది. ఇప్పటి వరకు చాలా మంది విజేతలు అలాంటి పీఆర్ స్టంట్‌లతోనే గెలిచి వచ్చారు. వారిలో నెగిటివిటీ ఎంత ఉన్నప్పటికీ కేవలం ఈవెంట్‌లు ఆర్మీలతో పేర్లు పెట్టుకొని విజేతలుగా మారారు. కనీసం నాలుగు వారాలు కూడా ఉండే సత్తా లేని వాళ్లు, గేమ్‌పై అవగాహన లేని వాళ్లు, ఆడకుండా కేవలం సోఫాల్లో, బీన్‌బ్యాగ్స్‌పై కూర్చొని కప్ పట్టుకెళ్లిన వాళ్లు ఉన్నారు. దీనికి కారణం పీఆర్ టీంలే. ఇప్పుడు ఈ సీజన్‌లో పీఆర్ టీంలతోపాటు బాండ్‌లు పెట్టుకుంటే నెట్టుకురావచ్చని ఈ సీజన్‌తో ప్రూవ్ అయ్యింది.





















