Bigg Boss Telugu season 8 episode 65 : హరితేజ - ప్రేరణ గొడవకు ఫుల్ స్టాప్... గౌతమ్-యష్మి గౌడ-నిఖిల్ నెవర్ ఎండింగ్ డిస్కషన్... ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్ళే
బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఎపిసోడ్ 65లో నామినేషన్ల ప్రక్రియ గట్టిగానే జరిగింది. ముఖ్యంగా నిఖిల్ గౌతమ్ ను, గౌతమ్ యష్మిని టార్గెట్ చేసుకున్నారు. ఈ ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో చూద్దాం పదండి.

బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఎపిసోడ్ 65లో హరితేజ-ప్రేరణ, యష్మి గౌడ-గౌతమ్, నిఖిల్ ల గొడవ హైలెట్ గా నిలిచింది. గతవారం నయని పావని ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. తాజా ఎపిసోడ్ లో ఎప్పటిలాగే నామినేషన్ల రచ్చ షురూ అయింది. అయితే బిగ్ బాస్ ఎప్పటిలా కాకుండా ఈవారం కేవలం ఒకరిని మాత్రమే నామినేట్ చేయాలంటూ హౌస్ మేట్స్ ని ఆదేశించారు. మెగా చీఫ్ అయిన కారణంగా అవినాష్ ను ఎవరు నామినేట్ చేయడానికి వీలులేదని చెప్పేశారు.
నామినేషన్ల ప్రక్రియని ముందుగా పృథ్వీతో మొదలు పెట్టాడు బిగ్ బాస్. పృథ్వీ రోహిణి పేరు చెప్పి 'ఒకటి బస్తాల టాస్క్ లో నెక్ ఫ్యాంటసి అని వాడడం, తరువాత యెల్లో గేమ్ లో నయని బాగా ఆడలేదని చెప్పడం తనకు నచ్చలేదని చెప్పాడు పృథ్వి. అయితే రోహిణి స్పందిస్తూ 'మీరు ఎక్కువగా హోల్డ్ చేయడానికి నెక్ దగ్గరికి వెళ్తున్నారు. నెక్ ఏరియా సెన్సిటివ్ కాబట్టి ఎంత చెప్పినా అక్కడికి వెళ్తున్నారు అన్నట్టుగా నెక్ ఫ్యాంటసీ అని అన్నాను. ఇక నయనినే కాదు ఎవరు గేమ్ సరిగ్గా ఆడకపోయినా చెప్తా' అనేసింది రోహిణి. దీంతో డిమోటివేషన్ చేయడం నచ్చలేదు, వీడికి నెక్ఫ్యాంటసీ అనడం నచ్చలేదు' అనగానే.. 'నీతో ఎక్కువ మాట్లాడడం కూడా వేస్ట్ అన్పించింది' అంటూ వెళ్ళింది రోహిణి.
తరువాత హరిప్రియ... 'ఆవిడ వివిధ విధానాలు ఏంటో, పద్ధతులు ఏంటో, ఫేక్ అంటారు, ఫ్లిప్పు అంటారు.. అంత హేట్ క్యారీ చేయడం నచ్చలేదు. ప్రతిసారీ ఫేక్ అనడం మీకు చిన్న విషయమేమో, కానీ నాకది చాలా పెద్ద విషయం. మనిద్దరి మధ్య నెగటివ్ ఈ నామినేషన్స్ తో ఎండ్ అవ్వాలి. మీరు ఇవన్నీ మార్చుకోవాలి అంటూ తన నామినేషన్ పాయింట్ చెప్పింది. ప్రేరణ సమాధానం చెప్పగా, ఇద్దరి మధ్య హీటింగ్ డిస్కషన్ జరిగింది. ఇద్దరూ ఒకరికొకరు ధీటుగా సమాధానం చెప్పుకున్నారు.
'ఇక్కడే కాదు ఎక్కడైనా నో అంటే నోనే... ఆమెను బుల్లియింగ్ చేసినట్టుగా అన్పించింది. రూల్స్ బుక్ ను విసిరేయడం డిస్ రెస్పెక్ట్, ఇర్రెస్పాన్సిబల్' అంటూ గౌతమ్ ను నామినేట్ చేస్తూ నిఖిల్ తన రీజన్స్ చెప్పాడు. 'మా ఇద్దరి మధ్య మ్యాటర్ కు నువ్వెందుకు మాట్లాడుతున్నావ్' అంటూ ఇచ్చిపడేశాడు గౌతమ్. ఈ క్రమంలోనే నిఖిల్ 'అశ్వత్థామ 2.0' గురించి తీయగా, 'అశ్వత్థామ 4.0 వచ్చాను. ఎవడన్నా ఏమన్నా చేసుకోండి' అంటూ కౌంటర్ వేశాడు గౌతమ్. 'ఇద్దరం బయటకు వెళ్లి చూసుకుందాం నీ దమ్ము ఎంతో నా దమ్ము ఎంతో' అంటూ ఇద్దరూ గేట్ దగ్గరకి వెళ్ళారు. ఆ తరువాత 'నా మీదున్న కోపం ఆడపిల్లల మీద చూపించావు' అనడంతో నిఖిల్ మళ్లీ ట్రిగ్గర్ అయ్యాడు. దీంతో చివరకు 'ఎవరెవరు రియల్ గా ఏంటి అనేది నాకు అర్థం అయ్యింది' అంటూ గోడవకు ఫుల్ స్టాప్ పెట్టాడు.
ఇక విష్ణు ప్రియ వచ్చి ప్రేరణతో తనకు ముందు నుంచి ఉన్న ప్రాబ్లం అగ్రెసివ్ అంటూ ప్రేరణను నామినేట్ చేసింది. 'నువ్వు మెగా చీఫ్ లాగా ఇక్కడ నిలబడి నన్ను నామినేట్ చేసావ్. ఫేవరిటిజం చూపించావు.. అందుకే చీఫ్ గా ఫెయిల్ అయ్యావు' అంటూ నబిల్ విష్ణు ప్రియను నామినేట్ చేశాడు. ఆ తరువాత ప్రేరణ హరితేజని నామినేట్ చేసింది. తరువాత ఇద్దరూ కలిసి పోయారు. గంగవ్వ గౌతమ్ కి సపోర్ట్ చేస్తూ యష్మీని నామినేట్ చేసింది. రోహిణి తనతో కలవాట్లేదు, ఎమోషనల్ అంటూ యష్మిని నామినేట్ చేసింది. యష్మి 'అక్క అని పిలవడం వెనుక నాకు రెస్పెక్ట్ కన్పించలేదు' అంటూ తిరిగి గౌతమ్ ను నామినేట్ చేయడంతో మళ్లీ డిస్కషన్ పెట్టారు. టేస్టీ తేజ పృథ్వీని నామినేట్ చేశాడు. చివరగా ఈ వారం యష్మి, ప్రేరణ, గౌతమ్, హరితేజ, విష్ణు ప్రియ, రోహిణి, పృథ్వీ నామినేట్ అయ్యారు. మెగా చీఫ్ పవర్ ని ఉపయోగించి అవినాష్ రోహిణిని సేవ్ చేసి, నిఖిల్ ను అగ్రెసివ్ పేరుతో నామినేట్ చేసాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

