Nagarjuna: నాగార్జున ముందే శోభా, భోలే మాటల యుద్ధం - క్షమాపణలు చెప్పిన ప్రియాంక
శోభా, భోలే మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. చివరికి నాగ్ ముందు కూడా ఇద్దరూ మాటల యుద్ధం కొనసాగించారు.
‘బిగ్ బాస్’ సీజన్-7లో శనివారం (21 - 10 - 2023న) హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లను కడిగి పారేశారు. వారి తప్పులను ఎండగట్టారు. ముందుగా హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ జరిగింది. సందీప్, అర్జున్‌ల మధ్య ఈ టాస్క్ జరిగింది. ఇందులో అర్జున్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ ఎపిసోడ్‌లో కూడా శోభా శెట్టి, భోలే మధ్య మాటల యుద్ధం నడించింది. నాగ్ ముందే వారిద్దరు మాటలు అనుకున్నారు. ఇక కేకు విషయంలో అమర్ దీప్, శోభాశెట్టి, తేజాలకు క్లాస్ పీకారు నాగార్జున. ఆ తర్వాత మరో కేకు తీసుకొచ్చి.. అమర్ దీప్‌ను తినాలన్నారు. అప్పటికే షాక్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అది ప్రాంక్ అని నాగార్జున చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
తప్పు ఒప్పకున్న భోలే
నామినేషన్స్ సందర్భంగా తాను వాడిన పదాలు తప్పేనని భోలే ఒప్పుకున్నారు. ఈ సంద్భంగా నాగ్ మాట్లాడుతూ.. ‘‘ఇంట్లో, మన ఊర్లో ఎన్నో మాటలు, పదాలు వాడుతుంటాం. కానీ, బిగ్ బాస్ హౌస్‌లో డిగ్నిటీ ఉండాలి. క్షమాపణలు అడిగారు. క్షమాపణలు అడిగిన తీరులో నిజాయితీ కనిపించింది. ఆమె సెన్స్‌లెస్ అనడం వల్ల ఎమోషన్‌లో ఎర్రగడ్డ పదాన్ని వాడాను. ‘‘సెన్స్‌లెస్‌కు, మెంటల్‌కు చాలా తేడా ఉంది. మళ్లీ రిపీట్ చేయొద్దు’’ అని హెచ్చరించారు. భోలే చెప్పిన క్షమాపణలు ఏక్సెప్ట్ చేశారా అనే నాగ్ ప్రశ్నకు శోభా స్పందిస్తూ.. ఎక్సెప్ట్ చెయ్యలేదని సమాధానం చెప్పింది. ‘‘ప్రియాంక మీరు తీసుకున్న స్టాండ్ నచ్చింది. నువ్వు రియాక్ట్ అవ్వడం బాగుంది. భోలే వాడినప్పుడు వచ్చినప్పుడు ఆవేశం.. గౌతమ్ అన్నప్పుడు రాలేదా? నువ్వు థూ అనడం బాగాలేదు’’ అని అన్నారు. అలా చెయ్యడం తప్పేనని ప్రియాంక కూడా అంగీకరించింది.
‘ఊరోడు’పై ప్రశాంత్‌కు నాగ్ స్పెషల్ క్లాస్
సందీప్ - ప్రకాశ్ మధ్య గొడవపై స్పందించారు. నీ డ్యాన్స్, మీ ఇంట్లోవారి మీద విపరీతమైన ఒట్లు వేశావు. ఆ మాట మీద నిలబడి ఉన్నావా? అని నాగ్ అడిగారు. ‘‘ప్రశాంత్, నువ్వు ఒట్టు ఎందుకు వేయలేదు?’’ అని అడిగారు. అయితే, కవర్ చేసే ప్రయత్నం చేశాడు ప్రశాంత్. దీంతో కరెక్టుగా ఆ రోజు ప్రశాంత్ ఏమన్నాడని పూజాను అడిగారు నాగార్జున. ‘‘ఆయన మాట మార్చాడు ఇప్పుడు. అప్పుడు అన్న మాట వేరే’’ అని పూజా తెలిపింది. మిగతావారు కూడా అదే చెప్పారు. దీంతో ప్రశాంత్‌ను మాట మార్చవద్దని హెచ్చరించారు నాగ్. ‘‘సందీప్ నిన్ను ఎక్కడా నిన్ను ఊరోడు అనలేదు. మొత్తం ఫూటేజ్ తీసుకుని చూశాం’’ అని తెలిపాడు. ‘‘ఊరోడు అనేది తప్పు కాదు. ఊరు లేకపోతే పట్టణాలు లేవు. నగరాలు లేవు. మా నాన్న ఊరోడు. ఆయన శ్రీరామాపురం నుంచి వచ్చారు. నేను గర్వంగా చెబుతున్నా. అందులో తప్పులేదు. నిన్ను అవమానంగా అని ఉంటే.. దాని మీద పోరాడు’’ అని అన్నారు. ‘‘నువ్వు హే పోరా.. అన్నట్లుగా మాట్లాడుతున్నావు. ప్రశాంత్ మనసులో అవే ఉంటున్నాయి’’ అని తెలిపారు.
శివాజీ రెట్టింపు ఉత్సాహంతో ఆడతారు: నాగ్
శివాజీని కన్ఫెషన్ రూమ్‌లోకి తీసుకెళ్లి ఆరోగ్యం విషయం గురించి మాట్లాడారు. ‘‘నాకు చాలా నొప్పిగా ఉంటుంది. స్నానం చేస్తున్నప్పుడు నరకంలా ఉంటుంది. వీలైతే హౌస్ నుంచి బయటకు వెళ్దాం అనుకుంటున్నా’’ అని శివాజీ అన్నాడు. ‘‘డాక్టర్లు పరిశీలిస్తున్నారు. మీ పరిస్థితి బాగోలేదూ అన్నప్పుడు.. బిగ్ బాసే మిమ్మల్ని బయటకు పిలుస్తారు’’ అని తెలిపారు. ఆ తర్వాత హౌస్‌మేట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘శివాజీ రెట్టింపు ఉత్సాహంతో ఆడతారు. ఆయన పరిస్థితిని డాక్టర్ పరిశీలించి చెబుతారు’’ అని పేర్కొన్నారు.
50 రోజుల ‘బిగ్ బాస్’లో నిచ్చెన, పాము
అశ్వినీ శ్రీ - గౌతమ్ నిచ్చెన, శోభాశెట్టి పాము అని తెలిపింది. ‘‘వచ్చినప్పటి నుంచి గౌతమ్ నాకు సపోర్ట్ చేస్తున్నాడు. కానీ శోభా నేను ఏం మాట్లాడినా తప్పు అర్థాలు తీస్తోంది’’ అని తెలిపింది.
గౌతమ్ - అర్జున్ నిచ్చెన, శివాజీ పాము అని తెలిపాడు. శివాజీ కొన్ని మాటలు వదిలేస్తారు. అలాంటి మాటలు నన్ను హర్ట్ చేస్తున్నాయని గౌతమ్ అన్నాడు.
శివాజీ - యావర్ నిచ్చెన, శివాజీ పాము అని తెలిపాడు. వచ్చినప్పటి నుంచి నెగటివిటీ పెట్టుకున్నాడని అమర్ గురించి చెప్పాడు.
అమర్‌దీప్ - నిచ్చెన అర్జున్, టెస్టీ తేజ పాము అని తెలిపాడు. ‘‘రాగానే అర్జున్ కొన్ని పాయింట్లు చెప్పాడు. దానికి తగినట్లు నేను ఉంటున్నా. తేజా తన అవసరాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటాడు’’ అని తెలిపాడు.
అర్జున్ - గౌతమ్ నిచ్చెన, శివాజీ పాము అని తెలిపాడు. ‘‘శివాజీ వెళ్లిపోతా పంపేయండి అంటారు. నామినేషన్స్ చేస్తున్నప్పుడు వాదిస్తారు’’ అని పేర్కొన్నాడు.
యావర్ - నిచ్చెన శివాజీ, గౌతమ్ పాము అని తెలిపాడు. ‘‘ప్రతి ఆట నాకు తెలుసు అని గౌతమ్ అంటాడు. నాకు అన్నీ తెలుసు అంటాడు’’ అని తెలిపాడు.
పూజా - నిచ్చెన అర్జున్, అశ్వినీ పాము అని తెలిపింది. ‘‘అశ్వినీలో అభద్రతా భావం ఉంది. తనని అవాయిడ్ చేస్తున్నారు అని అంటోంది. మేం మాట్లాడుతున్నాం తనకు అర్థం కావడం లేదు’’ అని పూజా తెలిపింది.
ప్రియాంక - శోభ నిచ్చెన, అశ్వినీ పాము అని తెలిపింది. ‘‘ఎవరూ తనతో మాట్లాడటం లేదని అంటుంది. అంతా మాట్లాడుతున్నాం. ఒక పాయింట్ చాలా గుచ్చుకుంటోంది. నువ్వు ఇన్ని రోజుల నుంచి ఆడుతున్నావు. నేను ఇప్పుడే వచ్చావు అనడం అనేది గుచ్చుకుంటోంది’’ అని తెలిపింది.
భోలే - నిచ్చెన శివాజీ, శోభ పాము అని తెలిపాడు. ‘‘నేను ఎప్పుడు మాట్లాడినా కోపంగా, గర్వంగా స్పందిస్తుంది. వాగ్వాదం తర్వాత సారీ చెప్పినా అలాగే మాట్లాడుతుంది’’ అని శోభ గురించి చెప్పాడు.
శోభాశెట్టి - నిచ్చెన ప్రియాంక, భోలే పాము అని తెలిపింది. ‘‘నామినేషన్స్ టైమ్‌లో నన్ను మోనితా అని అన్నాడు. ఆయనకు గేమ్ అర్థం కావడం లేదు’’ అని శోభా తెలిపింది. భోలే స్పందిస్తూ.. ‘‘హౌస్‌లో ఎలా ఉండాలో నాకు తెలుసు. నువ్వు కూడా హౌస్‌లో ఎలా ఉండాలో తెలుసుకో’’ అని అన్నాడు. దీంతో నాగ్, ఆ ముగ్గురిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు.
సందీప్ - శివాజీ పాము, శోభాశెట్టి నిచ్చెన అని తెలిపాడు. ‘‘ఆ రోజు టాస్క్ గెలిచాం. కానీ, ప్రశాంత్ ఉన్న గేమ్ గెలుస్తుంది అని శివాజీ అంటున్నారు. కెప్టెన్సీ టాస్క్‌లో శోభా చాలా సపోర్ట్ చేసింది’’ అని తెలిపాడు.
టేస్టీ తేజా - నిచ్చెన అమర్ దీప్, యావర్ పాము అని తెలిపాడు. ‘‘అమర్‌దీప్ చాలా స్పోర్టివ్‌గా ఉంటున్నాడు. దాని వల్ల అందరిలో కలిసిపోయే తత్వం ఏర్పడింది’’ అని అన్నాడు. ఇందుకు నాగ్.. ‘‘అంటే.. ఇంట్లో నీకు అమర్ దీపం అయ్యాడన్నామాట’’ అన్నారు. ఈ సందర్భంగా తేజ తన అసలు పేరు చెప్పాడు. ‘‘నా పేరు కూడా తేజ్ దీప్’’ అని అన్నాడు.
పల్లవి ప్రశాంత్ - శివాజీ నిచ్చెన, పూజా పాము అని తెలిపాడు. ‘‘ఆటలో శివాజీ నన్ను ముందుకు తీసుకెళ్తున్నాడు’’ అని తెలిపారు.