Bigg Boss Telugu: గౌతమ్‌తో ఫైటింగ్ - ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి వెళ్లిపోతానంటూ యావర్ రచ్చ, రతికానే విలన్?
బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో హౌస్ అంతా హీటెక్కింది. తాజాగా విడుదలైన ప్రోమోలో గౌతమ్ కృష్ణ, యవార్ మధ్య ఓ రేంజ్ లో గొడవ జరిగింది.
![Bigg Boss Telugu: గౌతమ్‌తో ఫైటింగ్ - ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి వెళ్లిపోతానంటూ యావర్ రచ్చ, రతికానే విలన్? Bigg Boss Telugu Season 7 Latest Promo Out: Prince Yawar Wants To Quit The Show After Fighting With Goutham Bigg Boss Telugu: గౌతమ్‌తో ఫైటింగ్ - ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి వెళ్లిపోతానంటూ యావర్ రచ్చ, రతికానే విలన్?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/15/1dbb9c1e3d057ad659a0e5b39a9cdd311694754695009239_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
బిగ్ బాస్ సీజన్ 7(Bigg Boss Telugu Season 7)లో అప్పుడే కంటెస్టెంట్స్ మధ్య ఓ రేంజ్ లో గొడవలు మొదలైపోయాయి. గత సీజన్తో పోలిస్తే ఈ సీజన్ లో రెండో వారానికే హౌస్ అంతా హీట్ ఎక్కిపోయింది. హౌస్ మేట్స్ కు బిగ్ బాస్ మొదటి టాస్క్ ఇచ్చారు. పవర్ అస్త్రాన్ని సొంతం చేసుకోవాలంటే ముందుగా మాయాస్త్రం కోసం పోటీ పడాలని చెప్పడంతో కంటెస్టెంట్స్ రణధీర, మహాబలి అంటూ రెండు టీమ్స్ గా విడిపోయారు. ఆ రెండిట్లో రణధీర్ టీం గెలిచింది. అందుకే రణధీర్ టీంలో ఉన్న శివాజీ, షకీలా, ప్రిన్స్, యావర్, అమరదీప్, ప్రియాంక, శోభ శెట్టి లకి మాయస్రాలు దక్కాయి. కానీ ఈ ఆరుగురు నుంచి పవర్ అస్త్రా ఒక్కరికి మాత్రమే దక్కే ఛాన్స్ ఉంది. అది ఎవరికి దక్కలనుకుంటున్నారో మహాబలి టీం నుంచి కంటెస్టెంట్స్ వచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పి బిగ్ బాస్ కు తెలపాలి.
ఇక ఇక్కడే హౌస్ మేట్స్ మధ్య అసలు గొడవ మొదలైంది. ఈ రోజు (సెప్టెంబర్ 15) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో గౌతమ్, ప్రిన్స్ యావర్ మధ్య పెద్ద ఫైటే జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమో ప్రకారం.. యావర్, గౌతమ్ కృష్ణ మధ్య ఓ రేంజ్ లో గొడవ జరిగింది. ఎవరు అన్ డిజర్వింగ్ అనుకుంటున్నావో వాళ్ల దగ్గర నుంచి 'కీ' తీసుకొని డిసర్వింగ్ పర్సన్ కి ఇవ్వాలని ప్రియాంక, గౌతమ్ కృష్ణకి చెబుతుంది. దాంతో గౌతమ్ కృష్ణ ప్రిన్స్ యవార్ దగ్గర 'కీ' తీసుకుంటున్నానని చెప్పడంతో ఎందుకు? అని యావర్ అడగగా, గౌతం కృష్ణ బదులిస్తూ.. "శివాజీ అన్న ఆటని వేరే వాళ్ళందరూ ఎగ్జిక్యూట్ చేసినట్టు అనిపించింది" అని అన్నాడు. దానికి యవార్, ‘‘ఇది రీజన్ కాదు’’ అని కోపంతో పిల్లోని నేలకేసి కొట్టి అసలు రీజన్ ఏంటి? అని కోపంతో అరుస్తూ చెప్పాడు. ఆ తర్వాత ప్రాపర్ రీజన్ ఇవ్వమని గౌతమ్ కృష్ణతో గొడవకి దిగాడు.
దాంతో ఇద్దరి మధ్య గొడవ పీక్స్ కి చేరుకుంది. ఒకరినొకరు ఎదురెదురుగా నిలబడి అరుస్తూ గొడవపడ్డారు. 'చల్ జా' అని కోపంతో గౌతమ్ ని యవార్ అంటే, ‘‘నేను ఇక్కడే ఉంటా’’ అంటూ హిందీలో సమాధానం ఇచ్చాడు. ‘‘నా కటౌట్ చూడు’’ అంటూ తన బాడీని చూపిస్తూ యవార్, గౌతమ్ కృష్ణకి వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత కెమెరా దగ్గరికి వెళ్లి బిగ్ బాస్ ఇది కరెక్ట్ కాదని చెబుతూ, నాకు న్యాయం కావాలని తెలిపాడు. దాంతో అమర్‌దీప్.. యవార్‌ను హగ్ చేసుకొని ఓదారుస్తూ.. ‘‘ఇంతమందిని ఏడిపించి ఏం బాగుపడతారో నాకు అర్థం కాదు’’ అని అన్నాడు. ఆ తర్వాత గౌతమ్ హౌస్ మేట్స్ తో ‘‘వాడొచ్చి నాకు బాడీ చూపిస్తుండు. నేను ఒక డాక్టర్ ని నా దగ్గర ఇలాంటి స్టంట్ లు చేస్తాడా?’’ అని అన్నాడు.
ఆ తర్వాత యవార్ అమర్దీప్ తో ‘‘అది బ్యాడ్ గేమ్’’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. చివరిగా యవార్ కెమేరా దగ్గరికి వచ్చి నేను ‘‘ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాను. డోర్ ఓపెన్ చేయండి. ఇంటికి వెళ్ళాలి అంతే’’ అని చెప్పడం.. హౌస్‌లో ఉన్న కొందరు కండతడి పెట్టినట్టు ప్రోమోలో ఆసక్తికరంగా చూపించారు. అయితే, ఈ గొడవ మొత్తానికి రతకనే కారణమని తెలుస్తోంది. ఆమె తన టీమ్ మాట వినకుండా మొండిగా వ్యవహరించింది. చాలాసేపు టాస్క్‌ను ముందుకు సాగకుండా ఆపేసింది. దీంతో ‘బిగ్ బాస్’ టాస్క్‌ను మరింత క్లిష్టతరం చేశాడు. అది రణధీరా టీమ్‌కు మైనస్‌గా మారింది.
Also Read : గుండె పగిలింది - జాహ్నవి మరణంపై స్పందించిన సమంత
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)