By: ABP Desam | Updated at : 24 Apr 2022 12:49 PM (IST)
Image Credit: Disney Plus Hotstar/YouTube
Akhil Bindu Madhavi Fight | ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’(Bigg Boss Non Stop)లో శనివారం పెద్ద పంచాయతీనే జరగనుంది. హోస్ట్ నాగార్జున(Nagarjuna) అఖిల్(Akhil), బిందు మాధవి(Bindu Madhvi), మహేష్ విట్టా(Mahesh Vitta)లను కడిగేయడానికి సిద్ధమైపోయారు. ముఖ్యంగా అఖిల్-బిందుల మధ్య నెలకొన్న గొడవులకు ఒక పుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నంలో నాగ్ ఉన్నట్లు తాజాగా ప్రోమోతో తెలుస్తోంది. ఈ ప్రోమో ప్రారంభంలోనే ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’లో బాత్రూమ్ ఘటనపై చర్చ నడిచింది. బిందు, మహేష్ విట్టా, అఖిల్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి మరీ నాగార్జున క్లాస్ పీకారు.
అఖిల్-బిందుకు మధ్య జరుగుతున్న గొడవలకు క్లారిటీ ఇచ్చేందుకు నాగార్జున కొన్ని వీడియోలను సైతం ప్లే చేశారు. ఆ తర్వాత ఎలిమినేషన్‌లో అజయ్ బ్యాక్ పెయిన్ గురించి కూడా చర్చ జరిగింది. అదే ఎలిమినేషన్‌లో బిందు-అఖిల్ మధ్య జరిగిన మరో గొడవ వీడియోను కూడా నాగ్ స్క్రీన్‌పై చూపించారు. దీంతో బిందు తన తప్పును అంగీకరించక తప్పలేదు. మొత్తానికి ఈ వారం నాగ్ కాస్త ఘాటుగానే వారిని హెచ్చరించేలా కనిపిస్తున్నారు.
అజయ్ ఎలిమినేషన్ తప్పదా?: ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే.. ప్రస్తుతం నామినేషన్లలో ఉన్న అజయ్‌కే బయటకు వెళ్లిపోయేందుకు ఎక్కువ ఛాన్సులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వారం అజయ్‌తోపాటు అఖిల్, అనిల్, హమీదా, అషూ రెడ్డి నామినేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో అఖిల్‌కు మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం వల్ల ఫుల్ సేఫ్. అలాగే అషూ కూడా ఇప్పట్లో వెళ్లేలా కనిపించడం లేదు. ఇక మిగిలింది అజయ్, అనిల్, హమీదా మాత్రమే.
ఈ ముగ్గురు కంటెస్టెంట్లలో హమీదా కూడా సేవ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనిల్-అజయ్‌ల మధ్య నువ్వా.. నేనా అన్నట్లుగా ఎలిమినేషన్ ఉండనుంది. అయితే అజయ్ ఎలిమినేట్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో సమాచారం లీకైంది. మరి, ఇది ఎంతవరకు నిజమన్నది. శనివారం సాయంత్రమే తేలిపోనుంది. అప్పటివరకు ఉత్కంఠతో ఎదురు చూడాల్సిందే. అఖిల్ నామినేషన్లలో లేకపోయి ఉంటే.. అజయ్ తప్పకుండా సేవ్ అయ్యేవాడు. అఖిల్ ఫ్యాన్స్.. తన ఫ్రెండ్ అజయ్‌ను తప్పకుండా సేవ్ చేసేవారు.
"Akhil... Original creator is you!"👈Asalu e bathroom vishayam enti? E spine vishayam enti? Ee varam issues ni clarify cheseddam 🤓Don't miss this week's Sunday Funday with Nag from 6PM... Exclusively on @DisneyPlusHS #BiggBoss #BiggBossTelugu #BiggBossNonStop @EndemolShineIND pic.twitter.com/AfraYUKfw9
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) April 24, 2022
బాబా మాస్టర్ రాకతో ఊపు: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’లోకి ‘వైల్డ్’గా ఎంట్రీ ఇచ్చిన బాబా మాస్టర్.. ఇప్పుడు హౌస్‌లో సందడి చేస్తున్నారు. ఇది హౌస్‌మేట్స్‌కు కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఈ వారం ఆయన నామినేషన్లలో లేకపోవడంతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే, నటరాజ్ మాస్టర్ మాత్రం.. బాబాకు ఏయే హౌస్ మేట్స్ ఎలాంటివారో వివరిస్తూ.. తన అభిప్రాయాలను ఆయనపై రుద్దుతున్నాడు. అది బాబాపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది రానున్న రోజుల్లోనే తెలుస్తుంది.
Also Read: చిరంజీవి గారి కంటే నా హీరోనే బెటర్ - రాజమౌళి స్పీచ్ విన్నారా?
Also Read: ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు, అవమానంగా అనిపించింది - మెగాస్టార్ వ్యాఖ్యలు
Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం
Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!
Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?
Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?
Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!
Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!