Bigg Boss Telugu Day 68 Promo : ఎట్టకేలకు కెప్టెన్ అయిన తనూజ.. చిన్ననాటి ఫోటోలు పంపిన బిగ్‌బాస్, ఏడ్పించేసిన ఇమ్మూ, కళ్యాణ్
Bigg Boss Telugu Today Promo : బిగ్‌బాస్‌లో తనూజ కెప్టెన్ అయింది. అలాగే చిల్డ్రన్స్ డే స్పెషల్ ప్రోమోను స్టార్ విడుదల చేసింది. ప్రోమో హైలెట్స్ చూసేద్దాం.

Bigg Boss 9 Childrens Day Speical Promo : బిగ్‌బాస్ కెప్టెన్సీ రేసులో ఎట్టకేలకు తనూజ గెలిచింది. దానికి సంబంధించిన ప్రోమోతో పాటు.. చిల్డ్రన్స్ డే స్పెషల్ ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. తనూజ గెలిచిన టాస్క్ ఏంటి? ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ ఏడ్వడానికి రీజన్స్ ఏంటి? ముందు ప్రోమోలో రీతూ, తనూజ ఎందుకు ఏడ్చారు వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో.. కెప్టెన్ తనూజ
బిగ్‌బాస్ సీజనల్ 9 తెలుగులో భాగంగా పదవ వారానికి తనూజ కెప్టెన్ అయింది. రాజు, రాణుల టాస్క్‌లో చివరిగా కమాండో నుంచి రాణిగా తనూజ వచ్చింది. అప్పటికే రాణిగా ఉన్న రీతూ, నిఖిల్‌తో చివరి టాస్క్ ఆడి తనూజ కెప్టెన్ అయింది. తమ ఫోటోలకు ఉన్న కిరీటం పడిపోకుండా.. చేయి వంచకుండా ఖడ్గంతో దానిని పట్టుకోవాలని బిగ్‌బాస్ చెప్పాడు. ఈ సమయంలో రీతూ, తనూజ కూడా ఏడ్చేసినట్లు ప్రోమోలో చూపించారు. కానీ చివరికి తనూజనే కెప్టెన్ అయినట్లు లైవ్‌లో చూపించారు. కెప్టెన్సీ టాస్క్ తర్వాత బిగ్‌బాస్ హోజ్లో చిల్డ్రన్స్ డే స్పెషల్ ఎమోషనల్ ప్రోమో మరొకటి వదిలింది స్టార్ మా.
ఏడ్పించేసిన ఇమ్మూ..
చిల్డ్రన్స్ డే స్పెషల్ హోజ్మేట్స్ ఫోటోలు పంపించాడు బిగ్‌బాస్. అయితే దీనితో పాటు ఓ టాస్క్ ఇచ్చాడు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలని చెప్పాడు బిగ్‌బాస్. దీనిలో భాగంగా ఒక్కొక్కరు తమ ఫోటోలు తీసుకువచ్చి.. తమ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. ముందుగా వచ్చిన తనూజ తన బిగ్గెస్ట్ సపోర్ట్ తన అమ్మనేనని చెప్పింది. సావిత్రి నువ్వు లేకుంటే నేను లేను అంటూ లవ్ యూ చెప్పింది. తర్వాత వచ్చిన ఇమ్మూ.. మా అమ్మ నన్ను కనాలి అనుకోలేదు. ఆ సమయంలో ఆకలికి తట్టుకోలేక మట్టి తినేసేది అంటా. నేను, మా అన్న చేయని పనిలేదు. వాడే నాకు సపోర్ట్. 20 బస్తాలు మోయాల్సి వస్తే నాతో 5 మాత్రమే మోయించి.. వాడు 15 మోసేవాడు. నా తండ్రి తర్వాత తండ్రి అంటూ చెప్పుకొచ్చాడు.
కళ్యాణ్‌ని చూస్తే కంట నీరు ఆగదు..
కళ్యాణ్ తన చిన్ననాటి ఫోటోని చూస్తూ.. అమ్మ, నాన్నలకు దూరంగా పెరిగాను. ఆ దూరం వల్ల ఇప్పటికీ వారికి దగ్గర అవ్వలేకపోతున్నాను. చిన్నప్పుడే హాస్టల్లో వేసేశారు. వారానికోసారి కూడా ఫోన్ వచ్చేది కాదు. నెలకోసారి కాల్ వచ్చేది. మా మధ్య తెలియకుండానే దూరం పెరిగిపోయింది. దానివల్ల ఇప్పటికీ నాకు మీరు కావాలి అని పేరెంట్స్‌తో చెప్పలేకపోతున్నానంటూ బాగా ఎమోషనల్ అయిపోయాడు.























