Bigg Boss Telugu Day 67 Promo : బిగ్‌బాస్ హోజ్లో వారెవ్వా సంజయ్.. వంటతో మెప్పించేందుకు వచ్చి, ఇమ్మూని ఎత్తేశాడుగా
Bigg Boss Telugu Today Promo : బిగ్‌బాస్ ఇంట్లో కెప్టెన్సీ, ఇమ్యూనిటీ కోసం టాస్క్ జరుగుతుంది. అయితే దీనిలో భాగంగా చెఫ్ సంజయ్ హోజ్‌లోకి వచ్చారు.

Bigg Boss 9 Entertainment Recipe with Sanjay Promo : బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు 10వ వారానికి కెప్టెన్సీ, ఇమ్యూనిటీ కోసం టాస్క్‌లు జరుగుతున్నాయి. కింగ్స్, క్వీన్ థీమ్ నడుస్తుంది కాబట్టి.. వారికి లగ్జరీ లైఫ్ ఇచ్చేందుకు చెఫ్స్‌ని లోపలికి పంపించాడు బిగ్‌బాస్. సంజయ్ లోపలికి వచ్చి కంటెస్టెంట్లతో మాట్లాడుతుండగా.. మరో చెఫ్ వారికి వంట చేస్తున్నట్లు ప్రోమోలో చూపించారు. మరి ఈ ప్రోమో హైలెట్స్ ఏంటి? సంజయ్ ఇచ్చిన సూచనలు, హింట్స్ ఏంటో చూసేద్దాం.
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో తెలుగు
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో ఫన్నీగా సాగింది. కోడికూర చిల్లిగారి అనే సాంగ్ వేయగా.. డ్యాన్స్ వేసుకుంటూ సంజయ్ లోపలికి వచ్చారు. దీంతో ఇంట్లోని సభ్యులంతా ఆయనతో కలిసి డ్యాన్స్ వేశారు. నేను ఎంతో హోప్స్తోటి.. ఏంతో ఆనందంగా మీకు నా ఫుడ్ టేస్ట్ చేయించాలనుకున్నాను కానీ.. అనేలోపు రీతూ ఇప్పుడు మీరు మాకు వంట చేయబోతున్నారా అని అడుగుతుంది. హా మరి నీకు వడ్డించడం కోసమే బిగ్‌బాస్ నన్ను లోపలికి పంపాడు అంటే రీతూ వావ్ అంటుంది.
ఇమ్మూ కామెడీ.. మెచ్చుకున్న సంజయ్..
వారెవ్వా అంటూ వంటలు వండుతాడు సంజయ్ అన్నా.. మీరు వెనక్కి వెళ్లండమ్మా అంటూ ఇమ్మూ కామెడీ చేస్తాడు. రీతూ సుమన్ అన్ని చూస్తే మీకు ఏమి గుర్తొస్తుంది అని సంజయ్ అని అడగ్గా.. నాకు సాంబార్లా కనిపిస్తాడని చెప్పాడు. ఇమ్మాన్యుయేల్ అంటే టెడ్డీ అండ్ బెయిర్. టెడ్డీ అంటే పక్కనుంచుకోవాలి. హగ్ చేసుకోవాలి. ఇలా ముద్దుపెట్టుకోవాలి అంటూ తలపై ఉన్న పాగా తీసేస్తాడు. సంజయ్ ఇమ్మూతో అరెయ్ జుట్టు ఏమైంది రా అంటే.. ఇక్కడ టెన్షన్‌కి ఊడిపోయింది అన్న అంటాడు. పొట్ట పోయింది, జుట్టు పోయింది. ఏంట్రా ఇది అంటాడు.
స్పెషల్ డిష్‌లు..
రాజులకు, రాణులకు మంచి భోజనం వడ్డించాలని చెఫ్‌ని తీసుకొచ్చినట్లు చెప్తాడు. అతనిని తీసుకొచ్చాక.. ఇమ్మూ బిగ్‌బాస్‌తో రాజ్యంలో ప్రజలు మీకు నచ్చారా? మేము చెత్తకుప్పులో దొరికామా అంటూ ఫన్నీగా అడుగుతాడు. ఈలోపు ఇమ్మూ చెఫ్ దగ్గరికి వెళ్లి అన్ని కింద టిష్యూలో పెట్టు అన్న మేము తర్వాత తీసుకుంటాము అని చెప్తాడు. కానీ అతను నో అనడంతో బయటకు వచ్చి.. అతను కనీసం వాసన కూడా చూడనివ్వట్లేదు వెళ్లిపోమంటున్నాడని చెప్తాడు. వాళ్లు తినగా మిగిలినవి మీరు తింటారు అంటే.. ఏంటి వాళ్లు తినగా.. కమాండోలు తినగా.. మిగిలింది మాకా? వాళ్లు బోన్స్ కూడా మిగల్చకుండా తినేరకాలు అంటూ కామెడీ చేయడంతో ప్రోమో ముగిసింది.






















