Bigg Boss Telugu Day 60 Promo : రీతూకి సీక్రెట్ టాస్క్ ఇచ్చిన బిగ్‌బాస్.. ఇమ్మూతో పెద్ద గొడవ, తనూజ ఓవర్ యాక్షన్ ఏంట్రా బాబు
Bigg Boss Telugu Today Promo : బిగ్‌బాస్‌లో రీతూ గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతుంది. జెన్యూన్‌గా టాస్క్‌లు ఆడుతూ.. తనదైన శైలిలో ముందుకు వెళ్తోంది.

Bigg Boss 9 Secret Task Promo : బిగ్‌బాస్‌లో కెప్టెన్సీ కంటెండర్ల కోసం టాస్క్‌లు జరుగుతున్నాయి. వీటిలోనే సీక్రెట్ టాస్క్‌లు ఆడిస్తూ.. అవతలి టీమ్ నుంచి సభ్యులను తీసివేయాంలంటూ బిగ్‌బాస్ సూచిస్తున్నాడు. దీంతో గేమ్స్ మరింతర రసవత్తరంగా సాగుతున్నాయి. నిన్న దివ్య, సుమన్ శెట్టి రెబల్స్‌గా ఉంటూ టాస్క్ బాగా ఆడి చివర్లో దొరికిపోయారు. అయితే ఈరోజు బిగ్‌బాస్ రీతూకే సీక్రెట్ టాస్క్ అప్పగించాడు. ఆమెకు ఇచ్చిన టాస్క్ ఏంటి? తనూజ చేసిన ఓవరాక్షన్ ఏంటి? ప్రోమోలో ఏమి ఇచ్చారో ఇప్పుడు చూసేద్దాం.
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో హైలెట్స్..
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమోలో రీతూ బిగ్‌బాస్‌తో ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తుంది. అయితే రీతూని బిగ్‌బాస్ కొత్త రెబెల్‌గా నియమించారు. దీనిలో భాగంగా ఆమెకు సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. మొదటి టాస్క్‌గా ఎవరో ఒకరితో సీరియస్‌గా గొడవపడాలని చెప్పాడు బిగ్‌బాస్. అయితే ఈ టాస్క్‌ని విజయవంతం చేసేందుకు రీతూ సిద్ధమైంది. ఇమ్మూని టార్గెట్ చేసి గొడవ పడేందుకు సిద్ధమైంది. పవన్‌ని తీయకుండా ఉండాల్సింది. లేకుంటే మేమే గెలిచేవాళ్లమని చెప్తుంది రీతూ.
రీతూ- ఇమ్మూ గొడవ..
ఏమి మాట్లాడుతున్నావు రీతూ. ప్రతిసారి నన్ను అంటున్నారు అంటూ ఇమ్మూ అడుగుతాడు. నువ్వు తీయడం వల్లే ప్రాబ్లమ్ నాకు అంటూ రీతూ చెప్పగా.. నేను తీయడం వల్ల ప్రాబ్లమ్ ఏంటి అని ఇమ్మూ అడుగుతాడు. నువ్వు బయట ఉన్నప్పుడు తీయను అని చెప్పావు అంటే.. గేమ్ అంటే ఇలానే ఉంటుంది. తీయాలి కదా మరి అంటాడు. అంటే వెన్నుపోటు పొడుస్తున్నావా అంటూ సీరియస్ అవుతుంది రీతూ. నేను ఒక్కడినే ఓటు వేయడం వల్ల వాడు వెళ్లలేదు అంటే.. అవును మీ ముగ్గురు ఓట్ వేసి పంపేశారు అని అంటుంది. మీరు మీకే సరిగ్గా ఓటు వేసుకోలేదంటూ ఇమ్మూ కౌంటర్ ఇస్తాడు.
రైజ్ ద ఫ్లాగ్..
రెబల్స్ చేసే ఎలిమినేషన్ నుంచి.. ఇమ్యూనిటీతో కూడిన సేఫ్టీ కార్డ్ దక్కించుకోవడానికి టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. ఈ టాస్క్ పేరు రైజ్ ద ఫ్లాగ్. దీనిలో భాగంగా బకెట్లో నీటిని రిలే విధానంలో గీతకు అటువైపు ఉన్న వ్యక్తి బకెట్లో పోయాలని.. తమకు కేటాయించిన రెండు బకెట్లలో ఆ నీటిని నింపి.. దానిలో ఉన్న బాల్స్ బయటకు తీసి.. వాటిని స్టాండ్స్‌కి ఉన్న నెట్స్‌లో పెట్టి.. ఆ స్టాండ్‌ని పోల్కి హుక్ చేసి.. తమ ఫ్లాగ్ బయటకీ తీసుకురావాలంటూ చెప్పాడు బిగ్‌బాస్.
తనూజ ఓవరాక్షన్
ఆరెంజ్ టీమ్‌లో ఇమ్మాన్యుయేల్, గౌరవ్ టాస్క్ ఆడారు. అయితే అదే టీమ్‌కి చెందిన తనూజ వారు గేమ్స్ ఆడుతుండగా.. చాలా ర్యాష్‌గా వారిని సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. వారి తప్పులు చెప్తూ.. ఓవరాక్షన్ చేసింది. గౌరవ్ ఒక్కదాంట్లో వేయి.. రెండు వాటిలో వేయకు అంటూ అరవడం, ఒన్ ఒన్ ఒన్.. అబ్బా అంటూ అరుస్తూనే ఉంది. గౌరవ్ ఫాస్ట్, గౌరవ్ ఫాస్ట్ అంటూ అరవడంతో ప్రోమో ముగిసింది. మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలిచారో.. ఎపిసోడ్ వరకు చూడాల్సిందే.























