Bigg Boss Telugu Today Promo : భరణి, శ్రీజలో రీఎంట్రీ ఎవరిదో.. ఇన్‌డైరెక్ట్‌గా భరణికి సపోర్ట్ చేసిన దివ్వెల మాధురి, దివ్య అయితే గొడవే పెట్టేసుకుంది
Bigg Boss Telugu 9 Latest Promo : బిగ్‌బాస్‌లో ఎలిమినేట్ అయిన సభ్యులు రీఎంట్రీ కోసం టాస్క్‌లు చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రోమో స్టార్ మా విడుదల చేసింది.

Bigg Boss Bharani, Sreeja Re Entry Promo : బిగ్‌బాస్‌లో సీజన్ 9లో ఎలిమినేట్ అయిన ఎక్స్ కంటెస్టెంట్లు మళ్లీ ఇంట్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. భరణి లేదా శ్రీజలో ఎవరో ఒకరి ఎంట్రీ కచ్చితంగా ఉండనుంది. శ్రీజనే ఇంట్లో కంటెస్టెంట్‌గా వచ్చినట్లు అప్డేట్స్ వినిపిస్తున్నాయి. అయితే మునుపెన్నడూ లేని విధంగా రీఎంట్రీల కోసం టాస్క్‌లు పెట్టి మరీ ఎంటర్టైన్ చేస్తున్నాడు బిగ్‌బాస్. ఈ సీజన్ అన్ని సీజన్స్ కంటే భిన్నంగా ఆకట్టుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
బిగ్‌బాస్ ప్రోమో హైలెట్స్
రీఎంట్రీగా వీరిద్దరిలో ఒకరు ఇంట్లోకి రానున్నారంటూ శ్రీజ, భరణిని ఇంట్లోకి పంపాడు బిగ్‌బాస్. అయితే వీరిలో ఎవరు ఉండాలనుకుంటున్నారనేది వివిధ టాస్క్‌ల ద్వారా తెలుస్తుందని చెప్పాడు. అయితే శ్రీజ, భరణిలు మార్చుకోవాల్సిన విషయాలు ఏంటో అక్కడున్న బోర్డ్‌పై రాసి చూపించాలంటూ చెప్పాడు బిగ్‌బాస్. ముందుగా వచ్చిన ఇమ్మాన్యూయేల్ గొడవ ఉన్నప్పుడు ఆర్గ్యూ చేయి కానీ.. ప్రోలాంగ్ చేయకుంటూ శ్రీజకు చెప్పాడు. తర్వాత వచ్చిన డిమోన్ పవన్.. మూడు సార్లు మిమ్మల్ని నమ్మాను. బట్ మీరు అది కోల్పోయారు అంటూ భరణికి చెప్పాడు.
మాధురికి సరైన జోడి శ్రీజ..
మాధురి వచ్చి శ్రీజకు మైండ్ యువర్ వర్డ్స్ అని రాసి ఇచ్చింది. మాట్లాడేప్పుడు జాగ్రత్తగా మాట్లాడమని చెప్పగా.. మీలా అయితే నేను మాట్లాడలేను అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది శ్రీజ. దానికి మాధురి అవును తెలుస్తుంది అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో వారి మధ్య గొడవ స్టార్ట్అయింది. ఈ పాయింట్‌ని శ్రీజ యాక్సెప్ట్ చేయనంటూ చెప్పింది. అయితే సోషల్ మీడియాలో భరణికి ఇన్‌డైరెక్ట్‌గా సపోర్ట్ చేస్తూ.. శ్రీజకు ఇలా రాసింది మాధురి అంటూ మీమ్స్ వేస్తున్నారు.
గౌరవ్ VS దివ్య నిఖిత
గౌరవ్ భరణికి ఓవర్ కాన్ఫిడెంట్ అంటూ రాసి చూపిస్తాడు. శ్రీజ కూడా షాకై భరణిని చూస్తుంది. అయితే గౌరవ్ తన సైడ్ నుంచి ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్తాడు. భరణి దానిని సున్నితంగా తిరస్కరిస్తాడు. అలాగే మీరు గెలిచారు కాబట్టి ఈ పాయింట్ చెప్పావు అంటాడు. అయితే ఇదిలా ఉండగా దివ్య నిఖిత గౌరవ్‌ని ప్రశ్నిస్తుంది. చూసేవాళ్లకి భరణి కోసం స్టాండ్ తీసుకున్నట్లే కనిపించేలా చేసింది దివ్య. ఎందుకంటే గౌరవ్ భరణి గురించి మాట్లాడగా.. మొత్తం టీమ్ అందరం ఆడాము.. ఒక్కడికే పవర్ ఉన్నట్లు చెప్పడం కరెక్ట్ కాదని క్వశ్చన్ చేస్తుంది. ఈ విషయం తనూజకి కూడా నచ్చక భరణి దగ్గరికి వచ్చి నీకు ఎందుకు తను స్టాండ్ తీసుకోవాలంటూ అడుగుతుంది. వారి మాట విన్న భరణి కూడా ఎందుకు స్టాండ్ తీసుకుంటున్నావ్ అని అడగ్గా ఇది మీకు సంబంధించింది కాదని చెప్పడంతో ప్రోమో ముగిసింది.






















