Bigg Boss Telugu Nominations Promo : రీతూకి సారీ చెప్పిన కళ్యాణ్, కథ మళ్లీ మొదలు.. తనూజ కోసం శ్రీజను తోసేసిన భరణి, ప్రోమో హైలెట్స్ ఇవే
Bigg Boss Telugu 9 Latest Promo : కళ్యాణ్ మళ్లీ రీతూ గూటికి చేరాడు. అలాగే భరణి కూడా తనూజ కోసం రాంగ్ స్టెప్ తీసుకున్నాడు. మళ్లీ వీరికి నెగిటివిటీ రానుందా?

Bigg Boss Telugu 9 Day 29 Latest Promo : బిగ్‌బాస్ సీజన్ 9 డే 29 సోమవారం నామినేషన్స్‌కి సంబంధించిన సెకండ్ ప్రోమో వచ్చేసింది. ఉదయం ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్గా సాగగా.. రెండో ప్రోమో కూడా అదే రేంజ్లో ఉంది. ఎందుకంటే రీతూ చేయి వేస్తేనే తీసేయ్ అంటూ కోపంతో చెప్పిన కళ్యాణ్.. మళ్లీ రీతూ గూటికే చేరాడు. తండ్రీ, కూతుళ్ల బంధం అంటూ హోజ్లో రిలేషన్ ఏర్పాటు చేసుకున్న భరణి మరోసారి తనూజ కోసం శ్రీజకు అన్యాయం చేశాడు. ఇంతకీ సెకండ్ ప్రోమోలో ఏముంది. వారి మధ్య జరిగిన గొడవలు ఏంటో చూసేద్దాం.
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో హైలెట్స్ ఇవే..
బిగ్‌బాస్ సెకండ్ ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఉదయం బిగ్‌బాస్ అందరినీ డైరక్ట్‌గా నామినేట్ చేశాడు. కెప్టెన్ తప్పా అందరూ ఈ నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే దీనిలో భాగంగా ఇమ్యూనిటీకోసం కంటెస్టెంట్లకు టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. గార్డెన్ ఏరియాలో పెద్ద బెడ్ ఏర్పాటు చేసి.. దానిపై చివరివరకు ఉన్నవారికి ఇమ్యూనిటీ వచ్చే అవకాశం ఉందంటూ గేమ్ స్టార్ట్ చేశాడు. ఇప్పటికే ఫ్లోరా రెండు వారాలు నామినేషన్స్‌లో ఉండగా.. మిగిలిన వారందరూ ఈ టాస్క్‌లో పాల్గొన్నారు. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.
రీతూకి సారీ చెప్పిన కళ్యాణ్..
ప్రోమోలో ఇమ్మాన్యూయేల్ పుష్ప స్పూఫ్ చేసి ఫన్ చేసేందుకు ట్రై చేశాడు. తనూజ దగ్గరికి వెళ్లి.. ఫీలింగ్స్ వస్తున్నాయంటూ చెప్పాడు. దూరంగా ఉన్న రీతూ.. నీకు ఎప్పుడూ అదే పని అంటే.. నీ పక్కన జాలిరెడ్డి ఉన్నాడుగా అని ఇమ్మూ అంటాడు. అయితే నువ్వు రా నీపై ఎక్కి చెప్తాను అర్థమవుతుందని కౌంటర్ ఇస్తుంది రీతూ. ఆ సమయంలో పవన్ ఆమెకి తినిపిస్తాడు. తర్వాత తనూజ, కళ్యాణ్, రీతూ ఉన్నప్పుడు కళ్యాణ్ రీతూకి సారి చెప్తాడు. ఎందుకు అని అడిగితే మాట్లాడలేదు కాబట్టి చెప్పానంటూ చెప్తాడు. దీంతో రీతూ ఇంకెప్పుడు మాట్లాడకుండా ఉండకు. ఏదైనా కోపం ఉంటే రూమ్‌లోకి తీసుకెళ్లి తిట్టు అంటూ నార్మల్ అయిపోయింది.
శ్రీజను తోసేసిన భరణి
ప్రోమోలో కళ్యాణ్, భరణి, రీతూ, ఇమ్మూ, తనూజ, శ్రీజ ఉంటారు. అయితే అందరూ కలిసి రీతూని కిందకి దించేస్తారు. అయితే బిగ్‌బాస్ ఇదే చివరి రౌండ్ అని చెప్పగా.. వారి మధ్య ఎవరిని కిందకి దించాలనే డిస్కషన్ నడుస్తుంది. కళ్యాణ్ శ్రీజ పేరు చెప్తాడు. మిగిలిన వాళ్లు మాట్లాడేలోపు.. శ్రీజ డిఫెండ్ చేసుకునే లోపు.. భరణి శ్రీజను కిందకి గట్టిగా తోసేశాడు. దీంతో శ్రీజ సీరియస్ అయింది. తనూజని తోయొచ్చుకదా.. మన నలుగురు అనుకున్నాము కదా.. ఓహ్ అంటే బాండిగ్స్ చెడిపోతాయనా.. మీరు నిజంగానే రేలంగి మావయ్య అనిపించుకుంటున్నారా.. అంటూ సీరియస్ అవుతుంది. దీంతో ప్రోమో ముగిసింది.
అయితే బిగ్‌బాస్ ఇమ్యూనిటీకోసం మిగిలిన నలుగురు అంటే కళ్యాణ్, భరణి, ఇమ్మూ, తనూజకు టాస్క్ పెట్టే అవకాశం ఉంది. ఈ టాస్క్ ఎలా జరిగిందో.. దాని తర్వాత ఏమైందో పూర్తి ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. దీని తర్వాత కెప్టెన్సీ కోసం టాస్క్‌లు మొదలయ్యే అవకాశం ఉంది.






















