Bigg Boss Telugu: నాగార్జున గారూ... ప్రమాదకరమైన వివాదం నడుస్తోంది పరిష్కరించండీ!
Bigg Boss Telugu: బిగ్‌బాస్‌లో గత ఏడు సీజన్‌లో ఎప్పుడూ చూడని గ్రూప్‌గేమ్ ఇప్పుడు నడుస్తోంది. ఇప్పటి వరకు సీరియల్ బ్యాచ్, ఇతరులు గ్రూప్‌గా ఉంటే వాళ్లు కానీ ఈసారి మాత్రం వేరే ప్రచారానికి సిద్ధమయ్యారు.
Bigg Boss Telugu: తెలుగు బిగ్‌బాస్ సీజన్ 8 దాదాపు చివరి దశకు వచ్చేసింది. సెప్టెంబర్ 1న మొదలైన ఈ షో గత సీజన్స్ కంటే చాలా పేలవంగా సాగుతోంది. వెళ్లిన కంటెస్టెంట్స్ కూడా అంతగా ఆకట్టుకోవడం లేదు. ఈ పరిస్థితిని ముందే గ్రహించిన బిగ్‌బాస్ టీం మధ్యలో ఈసారి భారీగా వైల్డ్ కార్డు ఎంట్రీలను పంపించారు.
వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ వరకు ఒక లెక్క తర్వాత ఇంకొక లెక్క అన్నట్టు ఉంది తెలుగు బిగ్‌బాస్ హౌస్. అప్పటి హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ ఏదో పిక్నిక్ వెళ్లినట్టు ఎంజాయ్ చేస్తూ వచ్చారు. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ రాకతో పరిస్థితి మారిపోయింది. వారి రాకతో సభలో కూడా ఎంటర్‌టైన్మెంట్ కూడా షురూ అయింది. కానీ ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది.
బిగ్‌బాస్ సీజన్ 8 మొదలైనప్పటి నుంచి ఓ విమర్శ ఉండనే ఉంది. ెక్కువ మంది కన్నడ నటులను హౌస్‌లోకి పంపించడాన్ని నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. అసలు ఇది తెలుగు బిగ్‌బాస్ షోనా లేకుంటా కన్నడా బిగ్‌బాస్ షో అన్నట్టు విమర్శులు చేశారు. అయితే హౌస్‌లోకి వెళ్లిన వారంతా ఫ్లూయెంట్‌గా తెలుగులో మాట్లాడుతుండటంతో ఫర్వాలేదు అనిపించారు. వారి ఆట తీరుతో కూడా ఆకట్టుకున్నారు. అంతే కాకుండా వారికి ఉన్న సీరియల్ ఫాలోవర్స్ కూడా ఓట్లు వేస్తున్నారు. దీంతో వాళ్లను ఓ బ్యాచ్‌గా చూడటం మొదలు పెట్టారు పోటీదారులు. వాళ్ల బిహేవియర్ కూడా అలానే ఉండటంతో కొత్త వివాదానికి దారి తీసింది.
Mahidar BB Reviewer
— BiggBossTelugu8 (@Boss8Telugu) November 3, 2024
Kan*nada Batch Pedda Worst Batch#Prerana #Nikhil #Yashmi #Prithvi Group Game Aduthunnaru✅ Kani Aduthunnattu Evvariki
Teliyaka Kudadu ❌
Kann*ada Batch Too Much Worst Game
Mahidaro Bro Fun 👇
K Batch : First Godava 😡Padi Tharvatha Emotional🥹… pic.twitter.com/xFv9WI8BMr
నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, యష్మి, ఈ నలుగురు ఇటు సీరియల్ బ్యాచ్‌గానే కాకుండా కన్నడ బ్యాచ్‌గా ముద్రపడిపోయారు. ఈ విషయంలో సోషల్ మీడియాలోనే దీనిపై రచ్చ జరిగేదే. కానీ ఇప్పుడు ఈ విభేదాలు హౌస్‌లో కూడా వచ్చినట్టు స్పష్టమైంది. మెగా చీఫ్ కంటెండర్ టాస్క్‌లో నబీల్ గురించి ప్రేరణ డిస్కష్ చేస్తూ ఈ విషయాన్ని ప్రస్తావించింది.
పదోవారంలో నిర్వహిస్తున్న మెగా చీఫ్ కంటెండర్ టాస్క్‌లో ముందు యష్మీ బాక్స్‌లో ఎక్కువ మూటలు ఉన్నందున ఆమెను మొదట తప్పించారు. తర్వాత రౌండ్‌లో నబీల్‌ను తప్పించారు. ఇక్కడ వివాదం మొదలైంది. ప్రేరణ వెళ్లి తనకు సపోర్ట్ చేయాలని రిక్వస్ట్ చేసింది. తన వాళ్లతో మాట్లాడి చెబుతానంటూ అనడాన్ని ప్రేరణ తప్పుపట్టింది.
మావాళ్లు అంటే ఎవరు ఇక్కడా అంటూ నిఖిల్, పృథ్వి, యష్మితో వచ్చి చెప్పింది. అక్కడే ఉన్న హరితేజ ఈ విషయంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. మా వాళ్లు అంటే అవినాష్ రోహిణి, గౌతమ్ అని చెప్పుకొచ్చింది. దీంతో ఆ వివాదం అక్కడ ముగిసినట్టే కనిపించినా వారి మనసులో ఉన్న భావన మాత్రం బయటకు వచ్చిందని ప్రేకక్షలు భావిస్తున్నారు. యష్మి, ప్రథ్వీ, నిఖిల్ ఆట తీరు కూడా తమ నలుగురికి సపోర్ట్‌గానే ఉంటోంది.
దీనిపై ఇప్పటికే సోషల్ మీడియా విపరీతమైన వివాదం నడుస్తోంది. రెండు భాషల మధ్య విభేదాలు సృష్టించే విధానం మంచిదాకనే వాళ్లు ఉన్నారు. మొత్తానికి రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారుతున్న ఈ ఇష్యూకు ఫుల్‌స్టాప్ పెట్టాలంటూ ప్రేకక్షలు కోరుతున్నారు. దీనిపై నాగార్జున స్పందించి పరిష్కరించాలని రిక్వస్ట్ చేస్తున్నారు.
Goutham E Range 🥵 Lo Ninnu Expect Chesam Ra Babu,Final Ga Oka Dariloki Vachhav Ilage Continue Chey 🙌
— BiggBossTelugu8 (@Boss8Telugu) October 24, 2024
And Main Ga Kan*nada Batch Antunnaru Kabatti,Nuvvu E Range Fire 🔥 Chupisthe Nuvvu Telugu Ey Kabatti Niku Win 🏆Chance Vuntadi 💯 #BiggBossTelugu8 pic.twitter.com/Aufiz8vJFr
Also Read: మాటలు మార్చిన విష్ణు, నబిల్‌ను టార్గెట్ చేసిన ఆ నలుగురు - వరస్ట్‌గా ప్రవర్తిస్తున్న హరితేజ