అన్వేషించండి

Bigg Boss Telugu Season 8: మాటలు మార్చిన విష్ణు, నబిల్‌ను టార్గెట్ చేసిన ఆ నలుగురు - వరస్ట్‌గా ప్రవర్తిస్తున్న హరితేజ

Bigg Boss Telugu Season 8 : బిగ్ బాస్ ఇంట్లో పదో వారానికి గానూ మెగా చీఫ్ కంటెండర్ టాస్కులు కొనసాగుతున్నాయి. మరోవైపు హరితేజ బిహేవియర్ రోజు రోజుకి ఘోరంగా మారిపోతోంది.

Mega Chief Task Hariteja Nikhuil Yashmi Vishnu Targets Nabeel: బిగ్ బాస్ ఇంట్లో పదో వారానికి గానూ మెగా చీఫ్ కంటెండర్ టాస్కులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో యష్మీ, విష్ణుకి ఓ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. అందులో యష్మీ గెలిచింది. అలా చివరకు నబిల్, రోహిణి, పృథ్వీ, ప్రేరణ, యష్మీ మెగా చీప్ కంటెండర్లు అయ్యారు. ఇక గురువారం నాటి ఎపిసోడ‌లో పోహా పెట్టిన మంటలు, కిచెన్ టీంన చిన్న చూపు చూసినట్టుగా విష్ణు మాట్లాడిన మాటలతో ఎపిసోడ్ కాస్త ఇంట్రెస్టింగ్‌గా మారింది. మధ్యలో కంటెస్టెంట్లు చేసిన ఫన్నీ టాస్కు సహన పరీక్షలా మారింది.

స్క్రూని తిప్పు.. కంటెండర్ షిప్‌ను పట్టు అనే టాస్కులో యష్మీ అదరగొట్టేసింది. ఆ టాస్క్ గెలిచి మెగా చీఫ్ కంటెండర్‌‌ను పదిల పర్చుకుంది. కానీ తన బ్రీఫ్ కేసుని కాకుండా విష్ణు బ్రీఫ్ కేసుని తెరుస్తుంది యష్మీ. అందులో కేవలం 75 వేలే ఉంటాయి. అవినాష్, తేజ రాంగ్ గైడెన్స్‌తో అది ఎవరి బ్రీఫ్ కేసో అన్నది చూసుకోకుండా యష్మీ తప్పు చేసింది. అసలు తన బ్రీఫ్ కేసులో లక్షా 80 వేలున్నాయి. కానీ విష్ణు బ్రీఫ్ కేసుని యష్మీ తెరవడంతో బిగ్ బాస్ అదే పరిగణలోకి తీసుకున్నాడు. దీంతో ఇంటి సభ్యులు కాస్త డల్ అయ్యారు.

ఇక పృథ్వీ ప్రవర్తన మారిందని, తనను డంబ్ అన్నాడంటూ విష్ణు బాధపడింది. తనని కూడా అలానే బాధ పెట్టాడని యష్మీ చెప్పుకుంది. సారీ అడుగు అని పృథ్వీని యష్మీ కోరింది. నేను అడగను అని పృథ్వీ అంటాడు. నేను నిన్ను సారీ అడగలేదు అని విష్ణు అంటే..నేను నీకు చెప్పలేదు అని పృథ్వీ కౌంటర్ వేస్తాడు. అలా కాసేపు ఈ ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. టెన్షన్ పడి వేరే వాళ్లని తిడుతుంటాడు.. తరువాత కూల్ అవుతాడు.. అలాంటి వాడు నాకు వద్దు.. నాకు ఇష్టం అయితే గాజు బొమ్మలా చూసుకుంటా.. అని విష్ణు చెప్పుకొచ్చింది.

ఆ తరువాత పృథ్వీ దగ్గరకు విష్ణు వెళ్లడంతో అతను సారీ చెప్పాడు. డంబ్ అని అన్నట్టు గుర్తు లేదని, అలా అన్నందుకు సారీ అని చెప్పాడు. నువ్వు అలా అనేసరికి నా మొహం మీద కొట్టినట్టు అనిపించింది.. అంటూ విష్ణు చెప్పింది. ఆ తరువాత విష్ణు కిచెన్ టీం గురించి చేసిన కామెంట్లపై చర్చలు జరిగాయి. కిచెన్ టీంకి ఏం పని ఉంది.. అదొక్కటే కదా.. ఆ తరువాత ఖాళీగానే ఉంటారు కదా అని ఇలా చెప్పేసింది. అదే మాటల్ని అవినాష్ కిచెన్ టీంకు చెప్పాడు. కానీ విష్ణు దాన్ని పెద్ద సీన్ చేసింది. తాను అస్సలు అనలేదంటూ వారితో ఎంతో నైస్‌గా మాట్లాడింది.

Also Read: బిగ్ బాస్ తెలుగు 8 ఎపిసోడ్ 67 రివ్యూ: విష్ణు ప్రియ బక్రా... యష్మీ తుస్సు... ఇలానే ఉంటే ఇక హరితేజ కష్టమే... బిగ్ బాస్‌లో ఏం జరుగుతోంది?


కానీ ఒక రోజు క్రితం పోహా పెట్టారని పృథ్వీ వద్ద, అవినాష్ వద్ద విష్ణు నానా హంగామా చేసింది. కానీ చివరకు మళ్లీ మాట మార్చేసింది. మరి ఈ ఇష్యూ మీద వీకెండ్‌కి వీడియో వేసి చూపిస్తాడో లేదో చూడాలి. ఇక వైల్డ్ కార్డు కంటెస్టెంట్లు అంటే హరితేజకు నచ్చడం లేదనిపిస్తుంది. రోహిణి, అవినాష్, టేస్టీ తేజ, గౌతమ్ ఈ అందరినీ హరితేజ ద్వేషిస్తూ ఉన్నట్టు కనిపిస్తోంది. మెగా చీఫ్ టాస్కులో రోహిణి, నబిల్‌ను ఎక్కువగా టార్గెట్ చేసినట్టు అనిపించింది. నబిల్ ఆ గ్యాంగులో జాయిన్ అయ్యాడు అని హరితేజ చెప్పడం చాలా విడ్డూరంగా కనిపించింది.

ఆమె ఈ గ్యాంగులో ఉంటే.. నబిల్ ఆ గ్యాంగులో చేరాడు అని సెటైర్ వేస్తోంది. హరితేజ అసలు బిగ్ బాస్ ఇంటికి వచ్చి తప్పు చేసినట్టుగా కనిపిస్తోంది. ఇంత వరకు ఆమెకు ఉన్న పాజిటివ్ ఇమేజ్ ఇప్పుడు మెల్లిమెల్లిగా పోతోంది. మూట ముఖ్యం అనే టాస్కులో అయితే ముందుగా యష్మీ అవుట్ అయింది. ఆ తరువాత హరితేజ, యష్మీ, నిఖిల్, విష్ణు ఇలా అందరూ కలిసి టార్గెట్ చేయడంతో నబిల్ అవుట్ అయ్యాడు. ఇప్పటికే వచ్చిన లీకుల ప్రకారం ప్రేరణ మెగా చీఫ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సీన్ చూడాలంటే శుక్రవారం ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.

Also Readబిగ్ బాస్ తెలుగు 8 ఎపిసోడ్ 66 రివ్యూ: రోహిణి మీద హరితేజ ఏడుపు... హౌస్‌లో కంటెస్టెంట్లకు దిమ్మ తిరిగేట్టు చేసిన బిగ్ బాస్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Embed widget