Bigg Boss Telugu Season 8: విష్ణు ప్రియ బక్రా... యష్మీ తుస్సు... ఇలానే ఉంటే ఇక హరితేజ కష్టమే... బిగ్ బాస్‌లో ఏం జరుగుతోంది?
Bigg Boss Telugu Season 8 : బిగ్ బాస్ ఇంట్లో పదోవారం మెగా చీఫ్ కంటెండర్ టాస్కులు జరుగుతున్నాయి. ఇక బుధవారం నాటి ఎపిసోడ్‌లో పృథ్వీ తన ప్రత్యర్థిగా విష్ణు ప్రియను ఎంచుకొని ఈజీగా బకరా ని చేసేశాడు.
బిగ్ బాస్ ఇంట్లో పదోవారం మెగా చీఫ్ కంటెండర్ టాస్కులు జరుగుతున్నాయి. ఆల్రెడీ రోహిణి, నబిల్‌లు టాస్కులో గెలిచారు. వారిద్దరూ ప్రేరణ, యష్మీలకు ఆరెంజ్ సూట్ కేసులు ఇచ్చి వారిని కూడా మెగా చీఫ్ కంటెండర్ రేసులోకి తీసుకొచ్చారు. ఇదంతా మంగళవారం నాటి ఎపిసోడ్‌లో జరిగింది. ఇక బుధవారం నాటి ఎపిసోడ్‌లో పృథ్వీ తన ప్రత్యర్థి కంటెస్టెంట్‌గా విష్ణు ప్రియను ఎంచుకున్నాడు. ఇందులో విష్ణు ఓ మోస్తరుగానే ఆడింది.
మూడు కీ లను దొరకపట్టే టాస్కులో మొదటి ప్రయత్నంలో విష్ణు నెగ్గింది. కానీ రెండో కీ కోసం ప్రయత్నించే టైంలో పృథ్వీ ఎత్తుగడ వేసి విష్ణుని బక్రా చేశాడు. ఫస్ట్ రౌండ్‌లో వాడిన కీని రెండో రౌండ్‌కు పట్టుకొచ్చి విష్ణుని డైవర్ట్ చేశాడు. అలా చివరకు ఈ టాస్కులో పృథ్వీ గెలిచాడు. గెలిచిన పృథ్వీ 99 వేలు ప్రైజ్ మనీకి కంట్రిబ్యూట్ చేశాడు. ఓడిన విష్ణుకే ఆరెంజ్ బ్రీఫ్ కేసు ఇచ్చి కంటెండర్‌ను చేశాడు పృథ్వీ. అయితే ఆ సూట్ కేసుని హరితేజకు ఇస్తాడని అనుకున్నట్టుగా తేజ, అవినాష్, రోహిణి ముచ్చట్లు పెట్టున్నారు. నాకు ఈ ఇంట్లో ఎవ్వరూ హెల్ప్ చేయరు అంటూ హరితేజ వాపోయింది. విష్ణుకి ఇస్తాడని ముందే తెలుసు అని హరితేజ చెప్పింది.
ఫస్ట్ రౌండ్ కీని రెండో రౌండ్‌కు పట్టుకు రాకూడదు.. అది రూల్స్‌కు విరుధ్దం.. ఈ పని పృథ్వీ కాకుండా వేరే వాళ్లు చేసుంటే గొడవ పెట్టే దానివా? అని విష్ణుని తేజ అడిగాడు. ఎవరి స్ట్రాటజీ వారిది అని సైడ్ అయిపోయింది విష్ణు. మిగిలిన పోయిన పోహానే మళ్లీ పెట్టింది అంటూ హరితేజ మీద నబిల్, విష్ణు కంప్లైంట్ చేశారు. ఫుడ్ వేస్ట్ అయినా పర్లేదు.. హెల్త్ పాడవ్వకూడదు కదా అని పృథ్వీ అన్నాడు. విష్ణుకి గౌతమ్ మసాజ్ చేస్తుంటే.. రోహిణి కామెడీ చేసింది. నా గౌతమ్‌తో అలా చేయించుకుంటావా? అన్నట్టుగా కామెడీ చేసింది.
ఇక కాసేపు విష్ణు, పృథ్వీలు ప్రేమ పక్షుల్లా, గాలి దూరనంత దగ్గరగా చేతులు వేసుకుని లివింగ్ ఏరియాలో తిరిగారు. కీ అలా పట్టుకు రాకూడదు అని అందరూ చెబుతున్నారు. కానీ నేను పట్టించుకోలేదు.. అంటూ విష్ణు ఏదో చెప్పింది. ఇక విష్ణుని పృథ్వీ పొగిడేశాడు. నీ నుంచి చాలా నేర్చుకుంటున్నా.. నేను మారుతున్నాఅని పృథ్వీ అనడంతో విష్ణు పొంగిపోయింది. ఇక లివింగ్ ఏరియాలో కూర్చున్న టైంలో పృథ్వీ షూ లేస్‌ను కట్టేందుకు విష్ణు ప్రయత్నించింది.
ఆరేంజ్ సూట్ కేసుల ద్వారా కంటెండర్లు అయిన విష్ణు, ప్రేరణ, యష్మీలకు బలమైన సంచి టాస్క్ పెట్టాడు. ఇందులో ప్రేరణ, విష్ణులు అదరగొట్టేశారు. కానీ యష్మీ మాత్రం మినిమం కూడా ప్రయత్నించలేదు. యష్మీ మాటలు కోటలు దాటుతాయి. కానీ ఆటల్లో మాత్రం గడప కూడా దాటదు. మాటలు తప్పా ఇంకేం లేదు అని యష్మీ మరోసారి నిరూపించుకుంది. ఆటల్లో తుస్సు అని అనిపించుకుంది. ఈ టాస్కులో ప్రేరణ గెలిచింది. మిస్టరీ బ్రీఫ్ కేస్‌ను పట్టుకుని రెండు లక్షల 12 వేలు ప్రైజ్ మనీకి అందించింది.
విష్ణు, పృథ్వీలను అన్నాచెల్లెళ్లను చేసింది గంగవ్వ. విష్ణుకి పృథ్వీ అంటే ఇష్టమని హరితేజ కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. కానీ గంగవ్వ మాత్రం వినలేదు. అన్నాచెల్లెళ్లు అనడంతో విష్ణు కాస్త హర్ట్ అయినట్టుగానే కనిపించింది. టేస్టీ తేజ గురించి విష్ణు, పృథ్వీల వద్ద హరితేజ బ్యాడ్‌గా చెప్పే ప్రయత్నం చేసింది. హరితేజ ఇలా బ్యాక్ బిచింగ్ చేస్తూ జనాల్లో ఇంకా దిగజారిపోతోంది. అసలు హరితేజ అంటేనే జనాలకు చిరాకు పుట్టేలా అయిపోయింది. ఆటల్లో ఫైర్ లేదు.. మాటలు, బ్యాక్ బిచింగ్ మాత్రమే చేస్తోంది. ఇక ఆమె ఇలానే ఉంటే.. చివరకు వరకు వస్తుందా? లేదా? అన్నది అనుమానమే.
తేజను బిగ్ బాస్ కన్ ఫెషన్ రూంలోకి పిలిచి ఆట పట్టించాడు. కప్ కేకులను చూపిస్తూ టెంప్ట్ చేశాడు. మనలో మాట నీ క్రష్ ఎవరు? అని తేజని అడిగి నవ్వించేశాడు. ఏదైనా సీక్రెట్, గాసిప్ చెప్పు అని అడగటంలో ఏబీసీ స్టోరీ చెప్పాడు. ఏ గౌతమ్ , బీ యష్మీ, సీ నిఖిల్ అని.. ఏ వచ్చి బీ పై వాలే.. బీ వచ్చీ సీ పై వాలే.. అని అన్నాడు. కానీ ఇప్పుడు యష్మీ, గౌతమ్ మధ్య అక్కాతమ్ముళ్ల బంధం ఉందని, నిఖిల్ యష్మీ మధ్య ఫ్రెండ్ షిప్ ఉందని అన్నాడు.ఆ తరువాత ప్రేరణని కన్ ఫెషన్ రూంలోకి పిలిచి ఏదైనా గాసిప్ చెప్పమని అన్నాడు. నిఖిల్‌కి యష్మీ అంటే ఇష్టం ఉన్నట్టుంది అని చెప్పింది. అలా ప్రేరణకి సైతం ఆ కప్ కేకుని బిగ్ బాస్ ఇచ్చాడు. ఇక ఈ వారంలో మెగా చీఫ్ ఎవరు అవుతారో చూడాలి.