(Source: ECI/ABP News/ABP Majha)
Bigg Boss Telugu 8 Day 32 Promo 2: అన్ ఎక్స్పెక్టెడ్ ఎవిక్షన్... డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురూ - బయటకు వెళ్ళేది ఎవరంటే?
Bigg Boss 8 Telugu Promo Today: బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు డే 32కు సంబంధించిన రెండో ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది. ఇందులోని విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
ఈ వారం బిగ్ బాస్ సీజన్ 8లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ లోనే రివీల్ చేసిన సంగతి తెలిసిందే. కానీ కంటెస్టెంట్స్ కు మాత్రం ఈ విషయాన్ని చెప్పలేదు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి కంటెస్టెంట్స్ కి చెప్పి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవ్వడమే కాకుండా ఏడుపు అందుకున్నారు. మరి ఈ తాజా ప్రోమోలో ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి.
మిడ్ వీక్ ఎలిమినేషన్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్
తాజా ప్రోమోలో కంటెస్టెంట్స్ అందరూ పనిలో బిజీ ఉండగా బిగ్ బాస్ మాట్లాడుతూ 'ప్రతిరోజు లాగానే మొదలైన ఈ రోజు మీలో ఎవరో ఒకరికి పీడకల కాబోతోంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ నుంచి ఒకరు ఈ రాత్రికి బిగ్ బాస్ ఇంటిని వదిలి వెళ్ళబోతున్నారు. మీ బ్యాగులు సర్దుకొని, ఇంటి సభ్యులు అందరికీ వీడ్కోలు చెప్పి సిద్ధంగా ఉండండి" అంటూ అనౌన్స్ చేశారు. ఉన్నట్టుండి మిడ్ వీక్ ఎలిమినేషన్ అనడంతో హౌస్ మేట్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక కిరాక్ సీత, విష్ణు ప్రియ, నైనిక అయితే బాగా కనెక్ట్ కావడంతో తమ ముగ్గురిలో ఒక్కరు బయటకు వెళ్లినా తట్టుకోలేము అంటూ ఏడవడం మొదలుపెట్టారు. ముఖ్యంగా నైనికా 'నాకు వెళ్లాలని లేదు' అంటూ ఏడుస్తూనే ఉంది. మరోవైపు కిరాక్ సీత 'గర్ల్స్ నేను తెలియకుండా ఎవరినైనా హార్ట్ చేసి ఉంటే సారీ' అంటూ వెక్కివెక్కి ఏడ్చింది.
Read Also : డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా ? బిగ్ బాస్ హౌస్ లో ఐదో వారం నామినేట్ అయిన కంటెస్టెంట్లు వీరే
Twist Time in the Bigg Boss house! 🚨 Someone is leaving tonight, and no one saw this coming. Who will face the sudden exit? 😳😳#BiggBossTelugu8 #StarMaa @iamnagarjuna @DisneyPlusHSTel pic.twitter.com/ljfZXMOCSY
— Starmaa (@StarMaa) October 3, 2024
డేంజర్ జోన్ లో ఆ ముగ్గురు..
అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ అయినప్పటికీ డేంజర్ జోన్ లో ఉన్నది మాత్రం ముగ్గురే. ఈ లిస్టులో విష్ణు ప్రియ, నైనిక, ఆదిత్య ఓం ఉన్నట్టుగా ప్రోమోని చూస్తే అర్థమవుతుంది. ఆ ముగ్గురుని డేంజర్ జోన్ లో నిలబెట్టి, 'మీ లెక్క ప్రకారం ఇంట్లో నుండి ఈ వారం ఎవరు బయటకు వెళ్లాలి అనుకుంటున్నారో వారిని ఒక అడుగు ముందుకు తీసుకొచ్చి, సరైన కారణాలు చెప్పండి' అంటూ బిగ్ బాస్ ఆదేశించారు. ముందుగా కిరాక్ సీత మాట్లాడుతూ విష్ణు ప్రియ, నైనిక, తనకు క్లోజ్ కాబట్టి వాళ్లకు సపోర్ట్ చేస్తుంది. అలాగే నిఖిల్ కూడా వీళ్ళిద్దరికే సపోర్ట్ చేస్తూ, ఆదిత్య ఓం వెనుకబడి పోయారు అంటూ ఆయనను ఒక అడుగు ముందుకు వేయించారు.
ఎలిమినేషన్ అధికారం కంటెస్టెంట్స్ కే..
ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఈ బిగ్ బాస్ సీజన్ లో మాత్రం ప్రేక్షకుల ఓట్ల పరంగా కాకుండా డేంజర్ జోన్ లో ఉన్న చివరి కంటెస్టెంట్స్ లో ఎవరో ఒకరిని బయటకు పంపే అధికారాన్ని ఎక్కువగా హౌస్ మేట్స్ కే ఇస్తుండడం విశేషం. ఈ ప్రోమోలో కూడా అంతే. ఇక నబిల్.. విష్ణుప్రియ వెళ్ళిపోవాలని తనను ఒక అడుగు ముందుకు వేయించాడు. 'అప్పుడప్పుడు నోరు జారుతుంది. బయటకు బ్యాడ్ గా వెళ్తుందేమో' అనుకుంటూ తనను డేంజర్ జోన్ కు దగ్గరగా తీసుకెళ్లడానికి రీజన్స్ చెప్పాడు. ఆ తర్వాత పృథ్వీ, నైనికను ఒక అడుగు ముందుకు తీసుకెళ్లి 'నోరు జారడం వల్ల ఆడియన్స్ ఎలిమినేట్ చేస్తారని నేను అనుకోవడం లేదు. నేను అలా చేసిన సరే నాకు ఛాన్స్ ఇచ్చారు' అని గుర్తు చేసుకుంటూ కనిపించాడు. మరి ఈ ముగ్గురిలో బయటకు వెళ్లబోయేది ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: అటెన్షన్ కోసం ఇండస్ట్రీని టార్గెట్ చేయడం సిగ్గుచేటు - కొండా సురేఖ వ్యాఖ్యలపై చిరంజీవి ట్వీట్!