అన్వేషించండి

Bigg Boss Sunday Funday Task : టాస్క్​తో ఫిటింగ్ పెట్టేసినా నాగ్.. సోనియా హార్ట్ బ్రేక్ చేసిన పెద్దోడు, యశ్మీకి హార్ట్ ఇచ్చిన చిన్నోడు.. పాపం ఆడపులి

Bigg Boss Sunday Promo : శనివారం కంటెస్టెంట్​లను ఓ రేంజ్​లో రఫ్ఫాడించిన నాగార్జున.. ఈరోజు సండే ఫన్​డే అంటూ వచ్చేశారు. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఇచ్చి నామినేషన్స్​కు రీజన్స్ ఇచ్చేశారు. 

Bigg Boss 8 Telugu Day 21 Sunday Promo : బిగ్​బాస్​ సండే ఫన్​డే మొదలైంది. నాగార్జున వస్తూనే.. కంటెస్టెంట్లకు ఈరోజు సండే ఫన్​డే నిన్నటిలా అసలు ఉండదంటూ స్టార్ట్ చేశారు. ఎందుకంటే శనివారం జరిగిన ఎపిసోడ్​లో నాగార్జున ఓ రేంజ్​లో కంటెస్టెంట్​లను రఫ్ఫాడించారు. ఈ వారం జరిగిన అన్ని విషయాలను ప్రస్తావిస్తూ సీరియస్​ అయ్యారు. ముఖ్యంగా అభయ్ నవీన్​ని ఇంట్లోనుంచి వెళ్లిపోమని రెడ్ కార్డ్ ఇచ్చారు. అలాగే పృథ్వీకి కూడా రెడ్ కార్డ్​ చూపించి.. మరోసారి ఇలా చేస్తే నీకు ఈ కార్డ్ తప్పదంటూ హెచ్చరించారు. 

ఆ వేడిని చల్లార్చుతూ.. కంటెస్టెంట్లను ఆ హీట్​ నుంచి బయటకు తప్పించేందుకు నాగార్జున ట్రై చేశారు. ఈ నేపథ్యంలోనే సండే ఫన్​డే ప్రోమోను బిగ్​బాస్ టీమ్​ రిలీజ్ చేసింది. ఇంతకీ ప్రోమో ఎలా సాగిందంటే.. కొట్టరా కొట్టు తీన్​మారు అనే సాంగ్​తో నాగార్జున ఎనర్జీటిక్​గా డ్యాన్స్​ వేస్తూ వచ్చారు. టు డే సండే.. ఫన్​డే అఫ్​ కోర్స్.. నిన్నటిలా ఉండందంటూ అనే డైలాగ్​తో ప్రోమో ప్రారంభమైంది. నాగార్జున చెప్పిన డైలాగ్​కు కంటెస్టెంట్లు కూడా నవ్వుతూ రిలాక్స్ అయిపోయారు. 

నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్..

పృథ్వీ మంచి హుషారులో ఉన్నాడంటూ నాగార్జున అడగ్గా.. విష్ణుప్రియ సార్ ఇతను ఎనర్జిటిక్​గానే ఉన్నాడు. కానీ ఇతను వేసుకున్న షర్ట్ మాత్రం ఇతనిది కాదంటూ ఫన్ చేసింది. ఎవరిది అని నాగ్​ అడగ్గా.. నైఖిల్ అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చింది. నైఖిలా అంటూ నాగ్​ కూడా ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. అనంతరం ఇప్పుడు ఓ ఫన్నీ టాస్క్ ఇస్తున్నానంటూ.. సెట్ ఆర్ కట్ ఛాలెంజ్ ఇచ్చారు. ఇది ఎంత ఫన్ అవుతుందో తెలీదు కానీ.. కచ్చితంగా నామినేషన్స్​కి బెస్ట్ రీజన్స్​గా మాత్రం అవుతాయి. 

ఫిటింగ్ పెట్టేశాడుగా..

సెట్ అయ్యేవాళ్లకి హార్ట్.. సెట్​ కానీ వాళ్లకి హార్ట్ బ్రేక్ చేసి ఇవ్వాలంటూ చెప్పాడు. అయితే సన్​డే ఫన్​ డే కోసం చేసిన టాస్క్​ల్లోని రీజన్స్​ని చాలామంది నామినేషన్స్​కి తీసుకుంటారు. అయితే ఈ టాస్క్​ కూడా నామినేషన్స్​కి రీజన్స్ ఇచ్చేలానే ఉంది. ఇంతకీ ఎవరు ఎవరికి హార్ట్ ఇచ్చారు? ఎవరి హార్ట్ బ్రేక్ చేశారంటే.. ముందు నిఖిల్​ని టాస్క్​ ఆడాలని నాగ్​ సూచించగా.. నిఖిల్ ఎవరికివ్వాలా అని ఆలోచిస్తుంటే.. నాగ్​.. విష్ణుని పిలిచి విష్ణు నువ్వు ఎవరిని అనుకుంటున్నావ్ అనగా.. సార్ నన్ను ఇన్వాల్వ్ చేయొద్దంటూ కామెడీ చేసింది. 

సోనియా హార్ట్ బ్రేక్ చేసిన పెద్దోడు

పృథ్వీకి నిఖిల్ హార్ట్ ఇచ్చి సోనియాకు హార్ట్​ని బ్రేక్​ చేశాడు. అయితే రీజన్స్ చెప్పమంటూ నాగ్ అడగ్గా.. నేను గుడ్ చెప్పినా.. బ్యాడ్ చెప్పినా వింటాడు అని పృథ్వీ గురించి చెప్పి.. అప్పుడప్పుడు కొన్ని మాటాలతో హర్ట్ చేస్తుందని సోనియా హార్ట్ బ్రేక్ చేసినట్లు తెలిపాడు. తర్వాత మణికంఠ వచ్చి సోనియాకు హార్ట్ ఇచ్చాడు. నిఖిల్​కు హార్ట్ బ్రేక్ ఇచ్చాడు. టాస్క్​లో కాస్త ఫిజికల్ అవుతున్నాడంటూ రీజన్ చెప్పగా.. తన టీమ్​ని గెలిపించుకోవాలిగా అంటూ నిఖిల్​కు నాగ్ సపోర్ట్ చేశారు. 

యశ్మీకి హార్ట్ ఇచ్చేసిన చిన్నోడు

నబీల్ నైనికకు హార్ట్ బ్రేక్​ ఇచ్చాడు. ఈ మధ్య తక్కువ మాట్లాడుతుంది అంటూ చెప్పగా నైనిక సీరియస్​గా చూసింది. నువ్వు అలా చూడకంటూ నబీల్ చెప్పగా.. సరే నువ్వు హార్ట్ బ్రేక్ చేయి.. మొత్తానికి మాట్లాడనంటూ క్యూట్​గా చెప్పేసింది నైనిక. విష్ణుప్రియ సీతకు హార్ట్ ఇచ్చి.. పృథ్వీకి హార్ట్ బ్రేక్ చేసి ఇచ్చింది. నైనిక కూడా సీతకు హార్ట్ ఇచ్చింది. ప్రేరణ అభయ్​కి హార్ట్ ఇచ్చింది. యశ్మీకి హార్ట్ బ్రేక్ చేసి ఇచ్చింది. పృథ్వీ కూడా విష్ణు హార్ట్ బ్రేక్ చేసి.. యశ్మీకి హార్ట్ ఇవ్వగా.. విష్ణు బ్రేక్ అయిన హార్ట్​తో ఫన్నీగా క్లాప్స్ కొట్టడంతో ప్రోమో ముగిసింది. ​

Also Read : హగ్గులు కాదు ఆటలు ఆడు... మణికంఠకు విష్ణు స్వీట్ వార్నింగ్, ప్రేరణ దోశ పంచాయితీ తేల్చిన నాగ్

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Agnipariksha 2026: 'బిగ్ బాస్' అగ్నిపరీక్ష ఫైనల్ కంటెస్టెంట్లు వీళ్ళే... పదిహేను మందిలో ఎవరున్నారంటే?
'బిగ్ బాస్' అగ్నిపరీక్ష ఫైనల్ కంటెస్టెంట్లు వీళ్ళే... పదిహేను మందిలో ఎవరున్నారంటే?
Vindhya Vishaka: ఐపీఎల్ సుందరి వింధ్యా విశాఖ.. న్యూస్ రీడర్ నుంచి స్టార్ యాంకర్ వరకు.. బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ!
ఐపీఎల్ సుందరి వింధ్యా విశాఖ.. న్యూస్ రీడర్ నుంచి స్టార్ యాంకర్ వరకు.. బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ!
Nikhil Vijayendra Simha: డిజిటల్ స్టార్ నిఖిల్ విజయేంద్ర సింహ.. యూట్యూబ్ నుంచి బిగ్ బాస్ రేస్ వరకు.. కెరీర్, రియల్ లైఫ్ ముచ్చట్లు!
డిజిటల్ స్టార్ నిఖిల్ విజయేంద్ర సింహ.. యూట్యూబ్ నుంచి బిగ్ బాస్ రేస్ వరకు.. కెరీర్, రియల్ లైఫ్ ముచ్చట్లు!
Kadali Satyanarayana: బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు!
బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు
పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Embed widget