అన్వేషించండి

Bigg Boss Telugu 7 Promo : రెచ్చిపోయిన అమర్... పక్కకెళ్లి ఆడుకోమని రతికపై ఫైర్

Bigg Boss Telugu 7 Promo : బిగ్​బాస్ సీజన్ 7.. 60వ రోజుకు మొదటి ప్రోమోను విడుదల చేసింది. దీనిలో ఇరు జట్లు పోటాపోటీగా పాల్గొన్నారు.

Bigg Boss Telugu 7 Promo : బిగ్​బాస్​ హౌజ్​లో గర్జించే పులులు.. వీర సింహాల మధ్య గొడవ ఇంకా జరుగుతూనే ఉంది. నువ్వా-నేనే అనే రేంజ్​లో రెండు టీమ్స్ కొట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో బిగ్​బాస్ సీజన్ 7.. 60వ రోజు ప్రోమో విడుదల చేసింది. దీనిలో భాగంగా కంటెస్టెంట్​లు బ్రేక్ ఫాస్ట్​ అనే టాస్క్ ఆడుతున్నారు. నిన్న జరిగిన టాస్క్​లో పింక్​ టీమ్​ టాస్క్​లో గెలిచి.. కీని దక్కించుకుంది. ఈ పవర్​తో వాళ్లు ఎల్లో టీమ్​లో మంచిగా ఆడుతున్న ప్రశాంత్​ను గేమ్​నుంచి తప్పించారు. దీంతో ప్రశాంత్ చాలా ఏడ్చాడు. దీనిలో భాగంగా తన మెడలో డెడ్ అనే బోర్డ్ వేశారు. ఈ వారం కెప్టెన్సీ కోసం ఆడే ఏ ఆటలోనూ ప్రశాంత్ ఆడలేడు. తర్వాత ఇరు జట్లు టాస్క్​ను కొనసాగించాయి. ఇక ప్రోమో విషయానికి వస్తే.. అమర్, గౌతమ్​లు స్టోర్​ రూమ్​లోని బ్యాగ్స్ తీసుకునేందుకు వెళ్లారు. అమర్ అక్కడున్న ఇరు జట్ల బ్యాగ్స్ తీసుకుని గార్డెన్ ఏరియాకి పరుగెత్తాడు. 

ప్రతి వెధవ పనికి స్ట్రేటజీ అని పేరు..

ఆ బ్యాగ్స్ తీసుకుని బయటకు వచ్చిన అమర్.. పింక్ జట్టు వాళ్ల బ్యాగ్స్ కింద పడేశాడు. ఈ విషయమై రతిక అమర్​ను నిలదీసింది. బ్యాగ్స్ ఎందుకు కిందపడేశావ్​ అనగానే.. నా ఇష్టం నేను పడేస్తాను.. నా స్ట్రేటజీ అంటూ దురుసుగా బదులిచ్చాడు. నీ ఇష్టమేంటి అంటూ రతిక రెచ్చిపోయింది. ప్రతి వెధవ పని చేయడం దానికి స్ట్రేటజీ అని పేరు పెట్టడం అంటూ అమర్​పై ఫైర్ అయింది. ఆ అవును నువ్వు చేసిన వెధవ పనులతో పోల్చొద్దు. బయట ఉమ్ము ఊస్తారు అని అమర్​ అనగా.. మాటాలు జాగ్రత్తగా రానివ్వు అని రతిక బదులిచ్చింది. అమర్​ కూడా అదే రేంజ్​లో నువ్వు కూడా జాగ్రత్తగా మాట్లాడు అంటూ హెచ్చరించాడు. భయపెడితే భయపడతారనుకున్నావా..? పక్కకెళ్లి ఆడుకోమంటూ ఫైర్ అయ్యాడు. ఈ మాటలే తగ్గించుకోమంటూ రతిక బదులిచ్చింది. వచ్చి నా బ్యాగ్​ పట్టకుని లాగేది కాదు. దమ్ముంటే నీ బ్యాగ్ ఎవరు లాగారో వారి దగ్గరికెళ్లి లాగు ఆడుకో అన్నాడు. 

గెలిచిన అమర్​ దీప్​..

నెక్స్ట్ టాస్క్​ కోసం బిగ్​బాస్​ బజర్​ వేశారు. రెండో టాస్క్​లో భాగంగా బ్రేక్​ఫాస్ట్ ఛాలెంజ్ ఇచ్చాడు. దీనిలో భాగంగా ఎల్లో టీమ్​ నుంచి అర్జున్, పింక్ టీమ్​ నుంచి గౌతమ్​ పాల్గొన్నారు. ఇద్దరూ పోటాపోటీగా ఛాలెంజ్​లో పాల్గొన్నారు. అదే టాస్క్​లో ఎల్లో టీమ్​ నుంచి అమర్.. పింక్​ టీమ్​ నుంచి శోభ కూడా పాల్గొన్నారు.  హౌజ్​మేట్స్.. వారి వారి జట్లకు సపోర్ట్ చేశారు. ఈ టాస్క్​లో అమర్​దీప్​ ఫాస్ట్​గా ఆడి బెల్​ కొట్టి ఎల్లో టీమ్​ని గెలిపించినట్లు ప్రోమోలో ఉంది. అమర్​ టాస్క్​ గెలిచి బెల్​ కొట్టి శివాజీని హగ్​ చేసుకుంటారు. ఎల్లో టీమ్​ అంతా ఆనందంలో ఉండగా.. శివాజీ, అర్జున్, అమర్ హగ్​ చేసుకున్న మూమెంట్​తో ప్రోమో ముగిసింది. అయితే ఈసారి రెడ్ టీమ్ లోని వ్యక్తి తొలగించే అవకాశం ఎల్లో టీమ్ సభ్యులకు దక్కినట్టే ఉంది.

Also Read : అమర్ వేస్ట్, ఐటెమ్ రాజా.. పట్టించుకోవద్దు - శిష్యులకు శివాజీ ప్రత్యేక తరగతులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pushpa 2 Ticket Rates: పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
Tiruvannamalai Landslide: ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP DesamUnstoppable With NBK Season 4 Ep 6 Promo |  Sreeleela తో నవీన్ పోలిశెట్టి ఫుల్ కామెడీ | ABP Desamజగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pushpa 2 Ticket Rates: పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
Tiruvannamalai Landslide: ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
Andhra Pradesh News: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Most Expensive Android Smartphones: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?
ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?
AP Liquor Fine: మద్యం ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే భారీ జరిమానా, లైసెన్స్ రద్దు! ఉత్తర్వులు జారీ
మద్యం ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే భారీ జరిమానా, లైసెన్స్ రద్దు! ఉత్తర్వులు జారీ
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
Embed widget