Revanth Mother: నాన్న బతికే ఉన్నాడని అబద్దం చెప్పి పెంచాను: రేవంత్ తల్లి ఎమోషనల్
బిగ్ బాస్ సీజన్ 6 చివరి ఘట్టానికి చేరుకుంది. ఈసారి ఫ్యామిలీ వీక్ లో సింగర్ రేవంత్ తల్లి వచ్చిన విషయం తెలిసిందే. ఆమె ఓ ఇంటర్య్వూ లో మాట్లాడుతూ.. రేవంత్ తండ్రి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘బిగ్ బాస్’ సీజన్-6 ఇక చివరి ఘట్టానికి చేరుకుంది. ఆదివారంతో ఈ సీజన్ ముగిసిపోనుండటంతో విన్నర్ ఎవరనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, రోహిత్, కీర్తి టాప్ 5లో ఉన్నవారు. అయితే ఈ సీజన్ లో విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా రేవంత్ కే ఉన్నట్లు తెలుస్తోంది. ఓటింగ్ విషయంలోనూ రేవంత్ కు మంచి బలం ఉంది. దీంతో అతనే ఈసారి విన్నర్ అని ఫిక్స్ అయిపోతున్నారు ప్రేక్షకులు. అందుకే ఎన్ని సార్లు నామినేషన్ వస్తున్నా అతను మాత్రం సేవ్ అవుతూ వస్తున్నాడు.
ఈసారి ఫ్యామిలీ వీక్ లో రేవంత్ తల్లి సీతా సుబ్బలక్ష్మి కనిపించారు. హౌస్ లో అందర్నీ బాగా పలకరించారామె. ఆమె ఇటీవల ఓ ఇంటర్య్యూ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన కుటుంబానికి సంబంధించిన ఓ విషాద సంఘటన గురించి చెప్పారు. సీతా సుబ్బలక్ష్మి దంపతులకు ఇద్దరు సంతానం ఉన్నారట. వారి చిన్న కొడుకే రేవంత్. అయితే రేవంత్ ఆమె కడుపులో ఉన్నప్పుడే భర్త చనిపోయారట. తండ్రి చనిపోయాడనే విషయం రేవంత్ పుట్టిన తర్వాత చెప్పలేదట. కొడుక్కు ఈ విషయం చెప్తే మనసులో పెట్టుకుని కుంగిపోతాడని చెప్పలేదని చెప్పారామె. తండ్రి విదేశాల్లో ఉన్నాడని అబద్దం చెప్పి పెంచానని, రేవంత్ కు కనీసం తండ్రి ఎలా ఉంటాడో కూడా తెలియదని ఎమోషనల్ అయ్యారామె. తన పుట్టింటి వారి సాయంతో పిల్లల్ని పెంచి పెద్ద చేశానని చెప్పారు. తన బిడ్డలే తనకు వరం అని, రేవంత్ కు కోపం ఎక్కువే కానీ అది పాలపొంగులాంటిదని చెప్పుకొచ్చారు సీతా సుబ్బలక్ష్మి.
ఇక సింగర్ రేవంత్ సెలబ్రెటీ హోదాలో ‘బిగ్ బాస్’ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. స్వతహాగానే రేవంత్ కు సింగర్ గా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. టాస్క్ లలో రేవంత్ కు తిరుగు లేదు. కానీ అతని వ్యక్తిత్వానికే ప్రేక్షకులు నెగిటివ్ మార్కులు వేస్తున్నారు. అతను టాస్క్ లు ఆడే విధానం చూస్తే అలాగే అనిపిస్తుంది. గేమ్‌ను చాలా సీరియస్‌గా ఆడతాడు. తోటి కంటెస్టెంట్స్‌పై కేకలు వేయడం వంటివి మైనస్ పాయింట్లు. దీనికి నాగార్జున కూడా నామమాత్రంగానే అడ్డుకట్టవేయడంతో రేవంత్ అదే పంథాలో వెళ్తున్నాడు. టాస్క్ కంప్లీట్ చేయడంలో అతని గేమ్ బాగున్నా.. ఆడే విధానం బాగోకపోవడంతో రేవంత్ పై నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. అయినా సరే ఈసారి బిగ్ బాస్ విన్నర్ రేవంత్ నే అనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 6 కంటెస్టెంట్స్ ఉండగా మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీసత్యను బయటకు పంపించారు. దీంతో రోహిత్, ఆదిరెడ్డి, రేవంత్, శ్రీహాన్, కీర్తి హౌస్ లో ఉన్నారు. అయితే వీరిలో విన్నర్ ఎవరు అవుతారు అనేది ఉత్కంఠగా మారింది.
Read Also: ‘అవతార్-2’ మూవీకి అక్షయ్ కుమార్ రివ్యూ: కామెరూన్ ప్రతిభకు తలవంచాల్సిందేనట!