అన్వేషించండి

Avatar 2: ‘అవతార్‌-2’ మూవీకి అక్షయ్ కుమార్ రివ్యూ: కామెరూన్ ప్రతిభకు తలవంచాల్సిందేనట!

‘అవతార్-2’పై బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ చిత్రం తనను మంత్రముగ్దుడిని చేసిందన్నారు. జేమ్స్ కామెరూన్ ప్రతిభకు తలవంచుతున్నట్లు చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘అవతార్-2’. ఈ మూవీ డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. దాదాపు 52,000 స్క్రీన్‌లపై సినిమా చరిత్రలో ఎన్నడూ లేని భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది. అయితే, ‘అవతార్-2’ మూవీ యూనిట్.. ముందుగానే మన సెలబ్రిటీల కోసం ప్రత్యేక షో వేశారు. ఇందులో బాలీవుడ్ నటీనటులంతా పాల్గొన్నారు. అక్షయ్ కుమార్ సైతం ఈ మూవీని చూశారు. అనంతరం ట్విట్టర్ ద్వారా తన రివ్యూను అభిమానులతో పంచుకున్నారు. 

కామెరూన్ ప్రతిభకు తలవంచుతున్నా- అక్షయ్ కుమార్

“అవతార్-2 సినిమా చాలా అందంగా, అద్భుతంగా ఉంది. ఈ సినిమాకు ఇంప్రెస్ అయ్యాను. నిన్న రాత్రి ‘Avatar The Way Of Water’ సినిమాను చూశాను. మూవీ చూస్తూ మంత్ర ముగ్దుడినైపోయాను. జేమ్స్ కామెరూన్ మేథో సంపత్తికి తలవంచుతున్నా” అంటూ ‘అవతార్-2’ సినిమాపై పొగడ్తలు వర్షం కురిపించారు. ఈ మేరకు అక్షయ్ కుమార్ ఓ ట్వీట్ చేశారు.

అవతార్-2’ కోసం ఎదురుచూస్తున్న సినీ లవర్స్

మూవీ లవర్స్‌ అంతా ఈ విజువల్ వండర్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘అవతార్‌-2’ ట్రైలర్‌ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. హాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ జేమ్స్‌ కామెరాన్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై ఎలాంటి అద్భుతాన్ని చేస్తారో చూడాలి అనుకుంటున్నారు. ‘అవతార్’కు మించి ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.  

అవతార్-2’ ఓపెనింగ్స్ పై ట్రేడ్ వర్గాల భారీ అంచనా

‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ అనే సినిమా.. కామెరాన్  2009లో విడుదల చేసిన బ్లాక్ బస్టర్ ‘అవతార్’కు సీక్వెల్ గా వస్తోంది. ‘అవతార్’ మూవీ ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. ‘అవతార్’ను మొత్తం 5 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే రెండు కంప్లీట్ అయ్యాయి. ‘అవతార్-2’ సినిమా తొలిరోజే $525 మిలియన్లు వసూలు చేసి ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా సాధించే వసూళ్ల మీద ఆధారపడి మిగతా భాగాల రూపకల్పన ఉంటుందని కామెరూన్ తెలిపారు.

Read Also: బాలీవుడ్ సినిమాల పతనానికి కారణం వాళ్లే, దర్శకుడు రాజమౌళి సంచనల వ్యాఖ్యలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి
JC Prabhakar Reddy: అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి బస్‌కు నిప్పు పెట్టింది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలే- జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు
అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి బస్‌కు నిప్పు పెట్టింది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలే- జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు
Today Movies on OTT: ఓటీటీలోకి ఒకేసారి 15 సినిమాలు... ఈరోజు ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ అవుతుందంటే ?
ఓటీటీలోకి ఒకేసారి 15 సినిమాలు... ఈరోజు ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ అవుతుందంటే ?
Telangana News: తెలంగాణలో రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్- సన్నబియ్యం పంపిణీ ఎప్పటి నుంచి అంటే?
తెలంగాణలో రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్- సన్నబియ్యం పంపిణీ ఎప్పటి నుంచి అంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Opted out Sydney test | రోహిత్ ను కాదని బుమ్రాకే బాధ్యతలు | ABP DesamJC Prabhakar reddy Fires on BJP | బస్సు తగులబెట్టినవాళ్లపై బూతులతో విరుచుకుపడిన జేసీ | ABP DesamBhima Koregaon History Vijay Diwas | ఎస్సీ వర్గీకరణ గురించి రేంజర్ల రాజేష్ ఏమన్నారంటే!Private School Bus Accident CCTV Video | ఓ బాలుడు మృతి, 13 మంది పిల్లలకు గాయాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి
JC Prabhakar Reddy: అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి బస్‌కు నిప్పు పెట్టింది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలే- జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు
అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి బస్‌కు నిప్పు పెట్టింది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలే- జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు
Today Movies on OTT: ఓటీటీలోకి ఒకేసారి 15 సినిమాలు... ఈరోజు ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ అవుతుందంటే ?
ఓటీటీలోకి ఒకేసారి 15 సినిమాలు... ఈరోజు ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ అవుతుందంటే ?
Telangana News: తెలంగాణలో రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్- సన్నబియ్యం పంపిణీ ఎప్పటి నుంచి అంటే?
తెలంగాణలో రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్- సన్నబియ్యం పంపిణీ ఎప్పటి నుంచి అంటే?
Blinkit Ambulance: వస్తువులే కాదు, అంబులెన్స్ కూడా 10 నిమిషాల్లో మీ ఇంటి ముందుకు వస్తుంది - బ్లింకిట్‌ కొత్త ఫీచర్‌
వస్తువులే కాదు, అంబులెన్స్ కూడా 10 నిమిషాల్లో మీ ఇంటి ముందుకు వస్తుంది - బ్లింకిట్‌ కొత్త ఫీచర్‌
Woman Life Rs. 5 Lakh: మహిళ ప్రాణం ఖరీదు 5 లక్షల రూపాయలు, ప్రాణాలకు విలువ కట్టిన ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాకం
మహిళ ప్రాణం ఖరీదు 5 లక్షల రూపాయలు, ప్రాణాలకు విలువ కట్టిన ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాకం
Aus Vs Ind 5th Test Live Updates: అదే కథ.. అదే వ్యథ.. మళ్లీ విఫలమైన భారత బ్యాటర్లు.. ఆదుకున్న జడేజా, పంత్
అదే కథ.. అదే వ్యథ.. మళ్లీ విఫలమైన భారత బ్యాటర్లు.. ఆదుకున్న జడేజా, పంత్
Game Changer: గేమ్ ఛేంజర్‌లో ఏపీ రాజకీయాలు- 'సీజ్ ది షిప్' సీన్లు కూడా!
 గేమ్ ఛేంజర్‌లో ఏపీ రాజకీయాలు- 'సీజ్ ది షిప్' సీన్లు కూడా!
Embed widget