Bigg Boss Season 7 Today Episode: నేను అలసిపోయానంటూ బోరున ఏడ్చేసిన ప్రియాంక - ఫుడ్ గురించి వర్రీ అవుతోన్న బీబీ వంటలక్క!
Bigg Boss Season 7 Today Episode: బిగ్ బాస్ సీజన్ 7లో హౌజ్ అంతా ఒకవైపు, ప్రియాంక ఒకవైపు అయిపోయినట్టుగా అనిపిస్తోంది. అందుకే తన కష్టాలను సందీప్, గౌతమ్‌లతో చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంది.
బిగ్ బాస్ సీజన్ 7లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కొత్తగా అయిదుగురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అయినప్పుడు పాత కంటెస్టెంట్స్ అంతా తమను చాలా సంతోషంగా వెల్కమ్ చేశారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన అయిదుగురిలో అర్జున్ అంబటి, పూజా మూర్తి సీరియల్స్ బ్యాచే కాబట్టి అప్పటికే హౌజ్‌లో ఉన్న పాత సీరియల్ బ్యాచ్ అయిన శోభా శెట్టి, అమర్దీప్, ప్రియాంకలతో వెంటనే క్లోజ్ అయిపోయారు. కానీ అలా క్లోజ్ అయిన శోభా, పూజల మధ్య నేటి ఎపిసోడ్లో గొడవ జరిగింది. అంతే కాకుండా ఆ గొడవ కారణంగా ఇద్దరూ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఇక కంటెస్టెంట్స్ అంతా ఒకవైపు, ప్రియాంక ఒకవైపు అయిపోయి కిచెన్‌లో పనుల వల్ల తాను చాలా అలసిపోతున్నానని తను కూడా కన్నీళ్లు పెట్టుకుంది.
శోభా వర్సెస్ పూజా
ఎవరు స్మార్టెస్ట్ అనే టాస్కులో ఆటగాళ్లకు, పోటుగాళ్లకు మధ్య జరిగిన పోటీలో శోభాకు, పూజకు గట్టి వాగ్వాదమే జరిగింది. బిగ్ బాస్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి శివాజీ, పూజా మూర్తి.. ఇద్దరూ ముందుకొచ్చారు. అయితే ఆ ప్రశ్నకు పూజానే సరైన సమాధానం చెప్పింది. ఆ సమయంలో అర్జున్.. పూజాకు సాయం చేశాడంటూ శోభా ఆరోపించడం మొదలుపెట్టింది. ఆ ఆరోపణలను పూజా ఒప్పుకోలేదు. ప్రతీదానికి వాదిస్తావంటూ శోభాపై వ్యాఖ్యలు చేసింది. ప్రతీదానికి కాదు.. నేను చూసిందే చెప్తున్నాను అంటూ శోభా గొడవ మొదలుపెట్టింది. నువ్వు అలా చెప్పకు అంటే అదే చేశావు నువ్వు అంటూ పూజాపై అరవడం మొదలుపెట్టింది శోభా. శోభా ప్రవర్తన చూసి విసిగిపోయిన పూజా.. ‘‘ఒక సామెత ఉంటుంది. నువ్వు చేస్తే నీతులు, నేను చేస్తే బూతులు’’ అని శోభాను ఉద్దేశిస్తూ అర్జున్‌తో చెప్పింది. ఈ మాట శోభా విని గేమ్ అయిపోయాక నయని పావని దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంది.
సిగ్గులేకుండా ఎలా అంటుంది
శోభా.. తన దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్న విషయాన్ని నయని పావని.. పూజాతో చెప్పేసింది. ‘‘ప్రియాంక నాకు ఎంత క్లోజో పూజా కూడా నాకు అంతే క్లోజ్. అంత పెద్ద సామెత నా మీద వాడేసరికి నేను తీసుకోలేకపోతున్నానని ఏడుస్తుంది’’ అంటూ శోభా తనకు చెప్పిన విషయాన్ని, తన ముందు ఏడ్చిన విషయాన్ని పూజాకు చెప్పింది నయని. ‘‘నేను మాట్లాడడానికే వెళ్లాను. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్తే తిప్పుకొని వెళ్లిపోయింది. మరి సిగ్గులేకుండా ఎలా అంటుంది’’ అంటూ తన ప్రవర్తనను సమర్థించుకుంటూ శోభాపై ఘాటు వ్యాఖ్యలు చేసింది పూజా.
కన్నీళ్లు పెట్టుకున్న ప్రియాంక
ఇక బిగ్ బాస్ సీజన్ 7 మొదలయినప్పటి నుండి కిచెన్‌లో కొందరు కంటెస్టెంట్స్ మాత్రమే ఎక్కువ కనిపిస్తున్నారు. ముందుగా దామిని.. అందరి ఫుడ్ బాధ్యతను చూసుకునేది. తను వెళ్లిపోయిన తర్వాత ఆ స్థానాన్ని ప్రియాంక తీసుకుంది. కానీ తను కిచెన్‌లో ఎంత కష్టపడుతున్నా ఎవరూ గుర్తించడం లేదు పైగా ఫుడ్ వేస్ట్ అవుతున్న విషయంలో ఎవరూ తన మాట వినడం లేదు. సందీప్, గౌతమ్‌లతో ఇదే విషయాన్ని చెప్తూ ప్రియాంక కన్నీళ్లు పెట్టుకోవడం రేపటి ప్రోమోలో చూపించారు బిగ్ బాస్. ‘‘నాకు చాలా బాధేస్తుంది. నేను కూడా చాలా అలసిపోయాను. అర్థం చేసుకోవడం లేదు. ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు. మనం బిగ్ బాస్ హౌజ్‌లో ఉంటున్నాం. మా ఇంటికి రండి ఎంత కావాలో అంత చేసి పెడతాను. కానీ ఇక్కడ మనం చేయలేము. నేను అలసిపోయాను. నేను అందరికీ చెప్పుకుంటున్నాను’’ అంటూ ప్రియాంక ఏడ్చింది. ప్రియాంక బాధలో న్యాయం ఉంది అంటూ ఈ ప్రోమో చూసిన ప్రేక్షకులు ఫీలవుతున్నారు.
Also Read: టాస్కుల్లో ఆటగాళ్ల పైచేయి, పూజా చెప్పిన సామెతకు కన్నీళ్లు పెట్టుకున్న శోభా
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial