By: ABP Desam | Updated at : 30 Sep 2023 11:24 PM (IST)
Image Credit: Star Maa, Disney Hotstar
ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ 7లో పవర్ అస్త్రా సాధించుకున్న కంటెస్టెంట్స్‌కు బిగ్ బాస్ ఎన్నో సౌకర్యాలను అందించారు. ఇతర కంటెస్టెంట్స్ పరుపులు లేని మంచంలో పడుకుంటే.. పవర్ అస్త్రా సాధించుకున్న హౌజ్‌మేట్స్‌కు మాత్రం ప్రత్యేకంగా డీలక్స్ రూమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఇది మాత్రమే కాకుండా వారు కొన్నివారాలు పాటు నామినేషన్స్‌లో కూడా ఉండరు. డైరెక్ట్‌గా ఎవరినైనా నామినేట్ చేయడంతో పాటు నామినేషన్స్ నుండి ఎవరినైనా కాపాడే అవకాశం కూడా అప్పుడప్పుడు ఈ హౌజ్‌మేట్స్‌కు ఉంటుంది. అలాంటి పవర్‌ను సాధించుకున్న శివాజీ.. దానిని నిలబెట్టుకోలేక దూరం చేసుకున్నాడు. శివాజీ అనర్హుడు అని కంటెస్టెంట్స్ ముద్ర వేసేసరికి నాగార్జున.. తన పవర్ అస్త్రాను వెనక్కి తీసుకున్నారు.
సంచాలకుడిగా శివాజీ ఫెయిల్..
బిగ్ బాస్ సీజన్ 7లో మొదటి వారంలో పవర్ అస్త్రాను సందీప్ సాధించగా.. రెండోవారంలో అది శివాజీకి దక్కింది. ఈ పవర్ అస్త్రాతో పాటు నాలుగు వారాల ఇమ్యూనిటీని కూడా సాధించుకున్నాడు శివాజీ. దీంతో హౌజ్‌మేట్‌గా తనపై బాధ్యతలు పెరిగాయి. కానీ పవర్ అస్త్రాను సాధించుకున్న మొదట్లోనే తను చేసిన తప్పుల వల్ల బ్యాటరీని గ్రీన్ నుండి ఎల్లోకు తగ్గించుకున్నాడు. దీంతో తనకు ఎల్లో నుండి రెడ్‌కు వెళ్లకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే క్రమంలో నాలుగో పవర్ అస్త్రా కోసం జరిగిన ప్రతీ పోటీలో సందీప్, శోభా శెట్టితో పాటు శివాజీ కూడా సంచాలకుడిగా వ్యవహరించాడు. అంతే కాకుండా నామినేషన్స్ సమయంలో కూడా ఈ ముగ్గురు జడ్జిలుగా ఉన్నారు. వారు తీసుకున్న నిర్ణయాల ప్రకారమే కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. దీంతో అసలు శివాజీ సంచాలకుడిగా ఎలా వ్యవహరించాడు అని నాగార్జున.. సెపరేటుగా ఒక్కొక్క కంటెస్టెంట్‌ను యాక్టివిటీ ఏరియాలోకి పిలిచి అడిగారు.
ముగ్గురు అలా.. ముగ్గురు ఇలా..
కంటెస్టెంట్స్ అందరిలో శుభశ్రీ, యావర్, ప్రశాంత్ తప్పా మిగిలినవారు అంతా శివాజీ అనర్హుడు అని, సంచాలకుడిగా అసలు సరిగా నిర్ణయాలు తీసుకోలేదని ఆరోపణలు చేశారు. చాలావరకు తనకు నచ్చిన కంటెస్టెంట్స్‌కే సపోర్ట్ చేస్తున్నాడని అన్నారు. శుభశ్రీ మాత్రం శివాజీ వల్లే తనకు పవర్ అస్త్రా కంటెండర్‌షిప్ అయ్యే అవకాశం వచ్చింది కాబట్టి తను అర్హుడే అని, సందీపే అనర్హుడు అని ప్రకటించింది. ఇక పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ సపోర్ట్ ముందు నుండి శివాజీకే ఉంటుంది కాబట్టి వారు కూడా సందీప్ అనర్హుడు అని ఓటు వేశారు. అయితే కంటెస్టెంట్స్‌ను యాక్టవిటీ రూమ్‌లోకి పిలిచి ప్రశ్నించగా.. ముగ్గురు కంటెస్టెంట్స్.. శివాజీ అనర్హుడు అని, ముగ్గురు కంటెస్టెంట్స్ సందీప్ అనర్హుడు అని ఓటు వేశారు.
శివాజీ పవర్ అస్త్రా ధ్వంసం..
ఆ తర్వాత అందరి ముందు శివాజీ, సందీప్‌లలో ఎవరు అనర్హుడు అని కంటెస్టెంట్స్ అనుకుంటున్నారో ఓపెన్‌గా ప్రశ్నించారు నాగార్జున. ఆ సమయంలో తేజ మాత్రం ఇద్దరికీ ఓటు వేయకుండా సైలెంట్‌గా కూర్చున్నాడు. సేఫ్ గేమ్ ఆడొద్దు అని నాగార్జున వార్నింగ్ ఇవ్వగా.. శివాజీ అనర్హుడు అని ఓటు వేశాడు. దీంతో కంటెస్టెంట్స్‌లో ఎక్కువశాతం శివాజీనే అనర్హుడు అని ఓటు వేశారు. దీంతో తన పవర్ అస్త్రాను శోభా శెట్టి చేత ధ్వంసం చేయించారు నాగార్జున. దీంతో శివాజీ డీలక్స్ రూమ్‌లో ఉండే అర్హత కోల్పోయాడని, ఇప్పటినుండి తను కూడా సాధారణ కంటెస్టెంట్ అని స్పష్టం చేశారు.
Also Read: తేజకు జైలు శిక్ష - కంటెస్టెంట్స్ అంతా కలిసి నిర్ణయం, నామినేషన్స్ విషయంలో కూడా ఎదురుదెబ్బ
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Bigg Boss 7 Telugu: అమర్‌ను నామినేట్ చేసి షాకిచ్చిన ప్రియాంక, ఓటింగ్ ప్రక్రియను వివరించిన బిగ్ బాస్
Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!
Bigg Boss 7 Telugu: అందరినీ మోసం చేసే గుణం నీది, ఇదే నీ నిజస్వరూపం - అమర్‌పై ప్రశాంత్ ఫైర్
Bigg Boss 7 Telugu: SPY vs SPA - నువ్వేమైనా ఒలింపిక్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చావా? శోభా నామినేషన్‌కు శివాజీ కౌంటర్
Goutham: బయటికి వెళ్లిన తర్వాత ముందుగా శుభశ్రీతో మాట్లాడతా - ఆసక్తికర విషయాలు బయటపెట్టిన గౌతమ్
BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ
Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా
Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం
Cyclone Michaung Updates: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, నిజాంపట్నం వద్ద 10వ నెంబర్ హెచ్చరిక జారీ
/body>