అన్వేషించండి

Bigg Boss Season 7 Telugu: అది చిన్న పిల్లా ఏంది? బర్రె పిల్ల, చంపేస్తా దాన్ని - రతికపై ప్రశాంత్ వ్యాఖ్యలు

బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నంతవరకు రతిక, పల్లవి ప్రశాంత్, శివాజీ.. ఒక గ్యాంగ్‌గా ఉండేవారు. కానీ ఇప్పుడు రతిక ఎలిమినేట్ అయిపోవడంతో ప్రశాంత్, శివాజీ తనను గుర్తుచేసుకున్నారు.

బిగ్ బాస్ రియాలిటీ షోకు బయట ప్రపంచంతో సంబంధం ఉండదు కాబట్టి అందులో ఉండే కంటెస్టెంట్స్ వెంటనే ఫ్రెండ్స్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే ఒక్కొక్కసారి బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్టిన రెండురోజు నుండే గ్రూప్స్ ఫార్మ్ అయిపోతాయి. అలాగే బిగ్ బాస్ సీజన్ 7లో కూడా అలాంటి గ్రూప్స్ ఉన్నాయి. అందులో ఒకటి రతిక, పల్లవి ప్రశాంత్, శివాజీ గ్రూప్. మెల్లగా ఈ గ్రూప్‌లోకి ప్రిన్స్ యావర్ కూడా జాయిన్ అయ్యాడు. అయితే తాజాగా ఈ గ్రూప్ నుంచి రతిక ఎలిమినేట్ అయిపోయింది. దీంతో శివాజీ, పల్లవి ప్రశాంత్ కలిసి రతికను గుర్తుచేసుకున్నారు. అలా తనను గుర్తుచేసుకుంటూ వారు ఏం మాట్లాడుకున్నారు అనే విషయాన్ని రతిక.. తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

పల్లవి ప్రశాంత్‌తో గొడవలు

బిగ్ బాస్ హౌజ్‌లో శివాజీ ఎక్కడ ఉంటే పల్లవి ప్రశాంత్ అక్కడ ఉంటాడు. ఇక వీరిద్దరూ ఎక్కడ ఉంటే రతిక అక్కడ ఉంటుంది. ఈ ముగ్గురు బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభంలోనే ఒక గ్యాంగ్ అయిపోయారు. అయితే పల్లవి ప్రశాంత్‌తో రతికకు మనస్పర్థలు మొదలయ్యాయి. సరిగా మాట్లాడుకోవడం కూడా మానేశారు. కానీ రతిక మాత్రం సంబంధం లేకపోయినా అప్పుడప్పుడు పల్లవి ప్రశాంత్‌తో గొడవలు పెట్టుకోవాలని చూసేది. దీంతో రతికపై ప్రేక్షకుల్లో నెగిటివిటీ పెరిగిపోయింది. ప్రశాంత్, రతిక మాట్లాడుకోకపోయినా.. శివాజీ, రతిక మాత్రం బాగానే ఉండేవారు. రతికను ఎప్పుడూ బిడ్డ అని పిలుస్తూ సపోర్ట్ చేసేవాడు శివాజీ. కానీ ఒక సంఘటన వల్ల వీళ్ల మధ్య బాండింగ్ కూడా తగ్గిపోయింది.

శివాజీతో తగ్గిపోయిన బాండింగ్

పల్లవి ప్రశాంత్ విషయంలో రతికది కూడా తప్పు ఉంది అనే విధంగా శివాజీ వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయం రతికకు నచ్చలేదు. శివాజీని నిలదీసింది. అప్పటినుంచి వీరిద్దరూ కలిసి కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. అలా రతిక.. బిగ్ బాస్ హౌజ్‌లో ఎవరితో అయితే ఫ్రెండ్‌షిప్ చేసిందో.. హౌజ్‌ను వదిలి వెళ్లిపోయే ముందు వారినే దూరం చేసుకుంది. రతిక ఎలిమినేషన్ సమయంలో శివాజీ, ప్రశాంత్ అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ తను వెళ్లిపోయిన తర్వాత మాత్రం తనను గుర్తుచేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రతిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

శివాజీ, ప్రశాంత్ సంభాషణ

ముందుగా ప్రశాంత్.. శివాజీతో ‘‘రతిక గుర్తొస్తుంది. రాత్రి తెగ గుర్తొచ్చింది. నిద్ర పట్టలేదు’’ అంటూ రతిక గురించి డిస్కషన్ మొదలుపెట్టాడు. ‘‘నాకు గుర్తొచ్చింది కానీ ఏం చేస్తాం రా చిన్నపిల్ల’’ అని సమాధానమిస్తాడు శివాజీ. ‘‘అది చిన్న పిల్ల ఏంది బర్రె పిల్ల. చాలా కోపమొస్తుంది’’ అన్నాడు ప్రశాంత్. ‘‘బయటికి వెళ్లాక కలుద్దాంలే. నువ్వు బాధపడకు. నాకు అర్థమయ్యింది నీ బాధ’’ అంటూ ప్రశాంత్‌ను ఓదార్చే ప్రయత్నం చేశాడు శివాజీ. ‘‘రెండు మేకపోతులు తినిపించి చంపేస్తా దాన్ని. నా మీద ఎందుకు కోపం. నేనేం చేశా. నామినేషన్ చేసినా కూడా మన అమ్మాయే కదా అని మాట్లాడినా నన్ను నమ్మలేదు’’ అంటూ తన బాధనంతా బయటపెట్టాడు ప్రశాంత్. అయినా కూడా శివాజీ.. ప్రశాంత్ వ్యాఖ్యలను పట్టించుకోకుండా ‘‘చిన్న పిల్లరా వదిలేయ్’’ అన్నాడు. ‘‘నన్ను కలవదు బయటికి వెళ్లాక’’ అంటూ ప్రశాంత్ బాధపడ్డాడు. ఈ సంభాషణ మొత్తం తన సోషల్ మీడియాలో షేర్ చేసిన రతిక.. ‘సో స్వీట్.. నేను కూడా వారిద్దరినీ మిస్ అవుతున్నా’’ అంటూ చెప్పుకొచ్చింది.


Bigg Boss Season 7 Telugu: అది చిన్న పిల్లా ఏంది? బర్రె పిల్ల, చంపేస్తా దాన్ని - రతికపై ప్రశాంత్ వ్యాఖ్యలు

Also Read: ఈ ఆదివారం ‘బిగ్ బాస్’లో అదిరిపోయే ట్విస్ట్, ఆ నలుగురికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ? కంటెస్టెంట్లకు షాక్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget