అన్వేషించండి

Bigg Boss Season 7 Telugu: ఈ ఆదివారం ‘బిగ్ బాస్’లో అదిరిపోయే ట్విస్ట్, ఆ నలుగురికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ? కంటెస్టెంట్లకు షాక్!

బిగ్ బాస్ సీజన్ 7లో ఆదివారం ఎపిసోడ్‌లో ఎన్నో ఊహించని ట్విస్టులు ఉన్నాయని అర్థమవుతోంది. దీనికోసం ప్రేక్షకులు సిద్ధంగా ఉండాలని నాగార్జున అంటున్నారు.

మామూలుగా బిగ్ బాస్ రియాలిటీ షో అనేది కనీసం 15 మంది కంటెస్టెంట్స్‌తో అయినా ప్రారంభం కావాలి. కానీ బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు మాత్రం కేవలం 14 మంది కంటెస్టెంట్స్‌తోనే ప్రారంభమయ్యింది. అంతే కాకుండా ఇప్పటికీ ఈ సీజన్ ప్రారంభమయ్యి నాలుగు వారాలు పూర్తవ్వగా.. ఈ నాలుగు వారాల్లో నాలుగు ఎలిమినేషన్స్ కూడా జరిగాయి. దీంతో ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో కేవలం 10 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీల కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు నాలుగు వారాల నుంచి నిరాశే మిగులుతోంది. కానీ ఈవారం మాత్రం పక్కా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని నాగార్జున హింట్ ఇస్తున్నట్టుగా అనిపిస్తోంది.

సీజన్ అంతా ఉల్టా పుల్టా..
గతవారం రతిక బిగ్ బాస్ సీజన్ 7 నుంచి ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయింది. తన వెళ్లిపోయిన తర్వాత నాగార్జున ఒక మాట అన్నారు. ‘‘ఈ సీజన్‌లో ఇంకా ఎన్నో ఊహించనివి జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి ఈ సీజన్ ఉల్టా పుల్టా అని’’ చెప్పారు. దీంతో గతవారంలోనే ఏదో ట్విస్ట్ ఉంటుందేమో అని ఎదురుచూశారు ప్రేక్షకులు. కానీ రతిక ఎలిమినేషన్‌తో ఎపిసోడ్ ముగిసింది. అయితే మరోసారి బిగ్ బాస్‌కు సంబంధించి నాగార్జున మాట్లాడిన ఈ మాటలనే ప్రత్యేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది స్టార్ మా. దీంతో పాటు పలువురు కంటెస్టెంట్స్ ఎంట్రీలు కూడా ఈ వీడియోలు ఉన్నాయి. అవి బిగ్ బాస్ సీజన్ 7 లాంచ్ అప్పటి వీడియోలు కావు అని, కొత్తగా ఉన్నాయని ప్రేక్షకులు అనుమానిస్తున్నారు.

ఉల్టా పుల్టా చేయనున్న నాగార్జున..
‘సర్‌ప్రైజ్‌ల యొక్క రోలర్ కోస్టర్ రైడ్‌కు సిద్ధంగా ఉండండి. ఈ ఆదివారం బిగ్ బాస్ హౌజ్‌లోని విషయాలను నాగార్జున ఉల్టా పుల్టా చేయనున్నారు. మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తే ఊహించని ట్విస్ట్ కోసం సిద్ధంగా ఉండండి’ అంటూ స్టార్ మా పోస్ట్ చేసింది. అసలు ఆ ట్విస్టులు ఏంటో తెలుసుకోవడం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని ఈ వీడియో చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. కానీ దీనిని స్పష్టంగా చూస్తే.. కనీసం నలుగురు అయినా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ సీజన్ 7లోకి ఎంటర్ అవుతారని అనిపిస్తోంది.

వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వారేనా?
ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా సీరియల్ నటుడు అంబటి అర్జున్‌తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణీ కూతురు సుప్రిత కన్ఫర్మ్ అయినట్టు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా విడుదలయిన స్టార్ మా ప్రోమో చూస్తుంటే.. ఈ ఇద్దరు మాత్రమే కాకుండా ఇంకొక ఇద్దరు కూడా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అవ్వనున్నారేమో అని అనుమానాలు వస్తున్నాయి. అయినా ప్రేక్షకుల సందేహాలు అన్నింటికి ఒక క్లారిటీ రావాలంటే ఆదివారం ఎపిసోడ్ వరకు ఎదురుచూడాల్సిందే. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో కంటెస్టెంట్స్ అంతా కెప్టెన్సీ టాస్క్‌లో బిజీగా ఉన్నారు. ఎవరికి వారు బిగ్ బాస్ సీజన్ 7లో మొదటి కెప్టెన్ అవ్వాలనే పట్టుదలతో ఉన్నారు. మరో రెండురోజుల్లో బిగ్ బాస్ సీజన్ 7 మొదటి కెప్టెన్ ఎవరు అనే విషయంపై క్లారిటీ వస్తుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by STAR MAA (@starmaa)

Also Read: వెక్కి వెక్కి ఏడ్చిన ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్స్ - ఈసారి బకెట్లు నింపేస్తారేమో!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Nikhil Vijayendra Simha: డిజిటల్ స్టార్ నిఖిల్ విజయేంద్ర సింహ.. యూట్యూబ్ నుంచి బిగ్ బాస్ రేస్ వరకు.. కెరీర్, రియల్ లైఫ్ ముచ్చట్లు!
డిజిటల్ స్టార్ నిఖిల్ విజయేంద్ర సింహ.. యూట్యూబ్ నుంచి బిగ్ బాస్ రేస్ వరకు.. కెరీర్, రియల్ లైఫ్ ముచ్చట్లు!
Kadali Satyanarayana: బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు!
బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Rocking Rakesh: మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Embed widget