అన్వేషించండి

Bigg Boss Season 7: ఓటింగ్‌లో అదుర్స్ అనిపిస్తోన్న అమర్‌దీప్ - డేంజర్ జోన్‌లో ఆ లేడీ కంటెస్టెంట్!

Bigg Boss Season 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఆరో వారం ఎలిమినేట్ అయ్యేది కూడా ఒక లేడీ కంటెస్టెంటే అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమయ్యి అయిదు వారాలు పూర్తయ్యి.. ఆరో వారం కూడా పూర్తికాబోతోంది. ఇప్పటివరకు ఏ సీజన్‌లో జరగని వింత.. ఈ సీజన్‌లో జరిగింది. ఒకరు తర్వాత ఒకరుగా అందరూ లేడీ కంటెస్టెంట్సే ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారంలో కిరణ్ రాథోడ్, ఆ తర్వాత షకీలా, దామిని, రతిక, శుభశ్రీ.. ఇలా అందరూ బ్యాక్ టు బ్యాక్ లేడీ కంటెస్టెంట్సే ఎలిమినేట్ అయిపోయారు. దీంతో బిగ్ బాస్ హౌజ్.. ఒక బాయ్స్ హాస్టల్‌గా మారిపోయింది. కానీ వెళ్లిపోయిన అమ్మాయిల లోటు తీర్చడానికి మరో ముగ్గురు అమ్మాయిలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్‌లోకి ఎంటర్ అయ్యారు. అయితే ఈ ఆరో వారంలో కూడా ఎలిమినేట్ అయ్యేది ఒక లేడీ కంటెస్టెంటే అని టాక్ వినిపిస్తోంది.

నామినేషన్స్‌లో ఎనిమిది మంది

బిగ్ బాస్ సీజన్ 7లో ఆరో వారం నామినేషన్స్‌లో అమర్‌దీప్, నయని పావని, ప్రిన్స్ యావర్, అశ్విని శ్రీ, శోభా శెట్టి, టేస్టీ తేజ, పూజా మూర్తి ఉన్నారు. సందీప్ కూడా నామినేషన్స్‌లో ఉండగా.. గౌతమ్ వచ్చి బిగ్ బాస్.. తనకు ఇచ్చిన సూపర్ పవర్‌తో సందీప్‌ను సేవ్ చేశాడు. దీంతో ఈ వారంలో నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌లో ఎక్కువగా ఎలిమినేట్ అయ్యే అవకాశం శోభా శెట్టికే ఉందని సమాచారం. అందరూ నేను చెప్పినట్టే వినాలి, నాకు నచ్చిందే చేయాలి అనే యాటిట్యూడ్‌తో కంటెస్టెంట్స్‌ను ఇబ్బందులు పెడుతూ.. వారి మీద అనవసరమైన పెత్తనం చూపిస్తోంది శోభా. దీంతో ప్రేక్షకులకు తనపై మెల్లగా విసుగు రావడం మొదలయ్యింది. చిత్రం ఏమిటంటే.. ఈ వారం బయటకు వెళ్లిపోతానేమోనని ఆందోళనతో ఉన్న అమర్ దీప్‌కు అనూహ్యంగా ఓట్లు పడుతున్నాయట. అమర్ ఏ మాస్క్ లేకుండా జెన్యూన్‌గా ఉంటున్నాడనే భావన, అమాయకత్వం వంటివి ఈ ఓటింగ్‌కు కారణమని తెలుస్తోంది.

శోభా శెట్టి, అశ్వినిలపై నెగిటివ్ అభిప్రాయాలు

ముఖ్యంగా నామినేషన్స్ సమయంలో అశ్వినితో శోభా శెట్టికి జరిగిన వాగ్వాదం వల్ల కూడా తను నామినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అసలైతే ఈ వాగ్వాదం వల్ల అశ్వినిపై కూడా ప్రేక్షకుల్లో నెగిటివ్ అభిప్రాయమే ఏర్పడింది. నామినేషన్స్ సమయంలోనే తను ఏడవడం, నన్ను నామినేట్ చేయండి నేను వెళ్లిపోతాను అంటూ నెగిటివ్‌గా మాట్లాడడం.. ఇవి చాలామంది ప్రేక్షకులకు నచ్చలేదు. పైగా బిగ్ బాస్ హౌజ్‌లో శోభా శెట్టి ప్రవర్తన మాత్రమే తప్పుగా ఉన్నట్టుగా అశ్విని తన వెనుక మాట్లాడడం మొదలుపెట్టింది. అందరితో శోభా అందరినీ ఏమారుస్తుంది అని చెప్పుకొని తిరగడం ప్రారంభించింది అశ్విని.

తక్కువ ఓట్లు గెలుచుకుంది వీరే

ఇక ఆరో వారం ఎలిమినేషన్ విషయానికొస్తే.. శోభా శెట్టి, అశ్విని శ్రీ.. ఈ ఇద్దరిపై ప్రేక్షకుల్లో అంతగా మంచి అభిప్రాయాలు లేవు. అందుకే ఓటింగ్ విషయంలో కూడా వీరిద్దరికే తక్కువ ఓట్లు ఉన్నాయి. వీరిద్దరి తర్వాత అంత తక్కువ ఓట్లు గెలుచుకున్న కంటెస్టెంట్‌గా పూజా మూర్తి నిలిచింది. మొత్తంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్‌లో ఇప్పటికే పూజా మూర్తి, అశ్విని శ్రీలపై ప్రేక్షకుల్లో నెగిటివ్ అభిప్రాయాలు ఏర్పడ్డాయి. అర్జున్ బాగా ఆడుతున్నాడు అనుకునేలోపే తను కూడా పల్లవి ప్రశాంత్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తనపై ప్రేక్షకుల్లో ఉన్న మంచి అభిప్రాయాన్ని పోగొట్టుకున్నాడు.

Also Read: హీరోగా అకీరా? కొడుకు సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Aishwarya Sindogi: బిగ్ బాస్ బ్యూటీకి వేధింపులు... కంప్లైంట్‌తో ఎఫ్ఐఆర్ నమోదు
బిగ్ బాస్ బ్యూటీకి వేధింపులు... కంప్లైంట్‌తో ఎఫ్ఐఆర్ నమోదు
Bigg Boss Sanjana Serial : బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
Actress Krishi Thapanda: బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట్లో డెడ్ బాడీ... అసలు ఏం జరిగిందంటే?
బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట్లో డెడ్ బాడీ... అసలు ఏం జరిగిందంటే?

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
PM Modi On Paper Leak: పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
హైరైడర్ హైబ్రిడ్‌ & డస్టర్ టర్బో DCT కంపారిజన్‌ - లాంగ్‌టర్మ్‌లో ఎక్కువ లాభం ఇచ్చేది ఏ కారు?
సిటీలోఎక్కువ డ్రైవ్‌ చేసేవాళ్లకు ఏ SUV బెస్ట్‌? టయోటా హైరైడర్ హైబ్రిడ్‌ Vs రెనాల్ట్ డస్టర్‌ - ఏది కొనాలి?
Embed widget