News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Bigg Boss Season 7 Latest Promo: ‘బిగ్ బాస్’ సీజన్ 7 లేటెస్ట్ ప్రోమో - టేస్టీ తేజాతో ఆడేసుకున్న పెద్దాయన, అక్కడే పడుకోవాలట!

ఈరోజు ఎపిసోడ్‌కు సంబంధించిన రెండో ప్రోమో విడుదలయ్యింది. అది మొదటి ప్రోమో కంటే చాలా భిన్నంగా ఉంది.

FOLLOW US: 
Share:

బిగ్ బాస్ సీజన్ 7లో నామినేషన్స్ సెగ మొదలయ్యింది. ఈ నామినేషన్స్ కారణంగా ఇంకా ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలియని కంటెస్టెంట్స్ మధ్యలో గొడవలు మొదలయ్యాయి. ఇప్పటికే శివాజీ, ప్రియాంక జైన్.. వారి నామినేషన్స్ ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. ఇక మిగిలిన వారంతా నేడు (సెప్టెంబర్ 5న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో నామినేషన్స్‌ను కొనసాగించనున్నారు. ఆ నామినేషన్స్ కారణంగా అయిన గొడవలు ఏ రేంజ్‌కు వెళ్లాయో.. తాజాగా విడుదలయిన ప్రోమోలో చూపించింది బిగ్ బాస్ టీమ్. ఇక ఈరోజు ఎపిసోడ్‌కు సంబంధించిన రెండో ప్రోమో విడుదలయ్యింది. అది మొదటి ప్రోమో కంటే చాలా భిన్నంగా ఉంది.

హారర్ థీమ్‌తో నామినేషన్స్..
బిగ్ బాస్ సీజన్ 7లోని మొదటి నామినేషన్స్‌ను యాక్టివిటీ రూమ్‌లో ఏర్పాటు చేశారు. నామినేషన్స్ కోసం ప్రత్యేకంగా ఈ యాక్టివిటీ రూమ్‌ను పూర్తిగా డార్క్‌గా మార్చేసి, హారర్ థీమ్‌తో డెకరేట్ చేశారు. నామినేషన్స్ కోసం కంటెస్టెంట్స్‌ను ఆ రూమ్‌లోకి పిలవగానే.. కొందరు కంటెస్టెంట్స్.. అక్కడి వాతావరణాన్ని చూసి భయపడ్డారు కూడా. ముందుగా శోభా శెట్టి.. ‘ఏమైనా రెస్పాండ్ అవ్వండి బిగ్ బాస్ భయమేస్తుంది’ అని కనీసం లోపలికి కూడా రాకుండా డోర్ దగ్గరే నిలబడినట్టుగా తాజాగా విడుదలయిన సెకండ్ ప్రోమోలో చూపించారు. దామిని కూడా తనకు ఆ రూమ్ అంత సౌకర్యంగా లేదు అని చెప్పింది. రతిక, కిరణ్ రాథోడ్ రియాక్షన్స్ కూడా ఇంచుమించు ఒకేలా ఉన్నాయి.

తేజతో కలిసి బిగ్ బాస్ కామెడీ..
మామూలుగా బిగ్ బాస్ పేరుతో కంటెస్టెంట్స్‌ను శాసించేవారు ఎప్పుడూ సీరియస్‌గానే మాట్లాడుతూ, కంటెస్టెంట్స్‌తో టాస్కులు ఆడిస్తూ, వారి మధ్య గొడవలు పెట్టి ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయాలని చూస్తారు. కానీ కంటెస్టెంట్స్‌తో బిగ్ బాస్ సరదాగా మాట్లాడడం అనేది ఎప్పుడో ఒకసారి జరిగే వింత. తాజాగా విడుదలయిన బిగ్ బాస్ సెకండ్ ప్రోమోలో టేస్టీ తేజతో చాలా సరదాగా మాట్లాడుతూ ఆడియన్స్‌ను నవ్వించారు బిగ్ బాస్. నామినేషన్స్ కోసం తేజ.. యాక్టివిటీ రూమ్‌లోకి రాగానే.. దగ్గరికి రా అంటూ బిగ్ బాస్ పిలిచారు. దానికి తేజ భయంతో.. నేను రాను అనడం ప్రేక్షకులను నవ్వుల్లో ముంచేస్తోంది. ఆ తర్వాత రతిక.. తనతో షేర్ చేసుకున్న సీక్రెట్ టాస్క్ గురించి బిగ్ బాస్‌కు వివరించాడు తేజ. తేజ చెప్తున్న ప్రతీ విషయానికి ఎదురు సమాధానం చెప్తూ బిగ్ బాస్ కూడా ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసే ప్రయత్నం చేశారు. 

కిరణ్ రాథోడ్‌కు భాష రాదంటూ శోభా శెట్టి చెప్పిన కారణాన్నే టేస్టీ తేజ కూడా చెప్పాడు. ఆ కారణంతోనే కిరణ్ రాథోడ్‌ను నామినేట్ చేశాడు. బిగ్ బాస్‌కు ఆ కారణం నిజంగా నచ్చలేదో.. లేక ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడం కోసం తేజతో కాసేపు కామెడీ పండించాలని అనుకునాడో తెలియదు కానీ.. నామినేషన్‌కు సరైన కారణం చెప్పండి అని మరోసారి తేజను అడిగాడు. ఇంత వివరంగా చెప్పిన తర్వాత మళ్లీ కారణం అంటారేంటి అంటూ తేజ.. ఏం చేయాలో తెలియక తికమక పడుతూ నిలుచున్నాడు. ఆ తర్వాత నామినేషన్‌ను యాక్సెప్ట్ చేసి తేజను బయటికి వెళ్లిపోమనగానే.. తేజ థాంక్యూ బిగ్ బాస్ అంటూ పరుగులు తీశాడు.

Also Read: ‘బిగ్ బాస్’ సీజన్ 7 లేటెస్ట్ ప్రోమో - ఈ‘గోల’ ఏంది, పెద్దాయనా? అందరిలో శోభ శెట్టే హైలెట్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 05 Sep 2023 04:58 PM (IST) Tags: Bigg Boss Nagarjuna Bigg Boss Telugu 7 Bigg Boss Telugu Season 7 Bigg Boss 7 Telugu Bigg Boss Telugu 2023 BB 7 Telugu tasty teja Bigg Boss Season 7 Latest Promo bigg boss season 7 nominations

ఇవి కూడా చూడండి

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్‌లో నాలుగో వారం ఎలిమినేషన్స్ - డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు, ఈసారి కూడా లేడీ కంటెస్టెంట్ ఔట్?

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్‌లో నాలుగో వారం ఎలిమినేషన్స్ - డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు, ఈసారి కూడా లేడీ కంటెస్టెంట్ ఔట్?

Bigg Boss Telugu 7: సిగ్గు లేదా నీకు? ఇంట్లో నిన్ను ఇలాగే పెంచారా? ప్రశాంత్‌‌పై రతిక చెత్త కామెంట్స్

Bigg Boss Telugu 7: సిగ్గు లేదా నీకు? ఇంట్లో నిన్ను ఇలాగే పెంచారా? ప్రశాంత్‌‌పై రతిక చెత్త కామెంట్స్

Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

బెదరగొట్టిన ‘యానిమల్’, రామ్ ‘స్కంద’.. ‘చంద్రముఖి-2’ ఎలా ఉన్నాయ్? ఇవీ ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలు

బెదరగొట్టిన ‘యానిమల్’, రామ్ ‘స్కంద’.. ‘చంద్రముఖి-2’ ఎలా ఉన్నాయ్? ఇవీ ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలు

టాప్ స్టోరీస్

RK Roja: ఆటో డ్రైవర్‌ అవతారంలో మంత్రి రోజా, లోకేశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు - ముందస్తు బెయిల్ ఎందుకు?

RK Roja: ఆటో డ్రైవర్‌ అవతారంలో మంత్రి రోజా, లోకేశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు - ముందస్తు బెయిల్ ఎందుకు?

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం

ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం