Bigg Boss Season 7 Latest Promo: అహంకారంతో మట్లాడొద్దు - ఆట సందీప్‌కు శివాజీ వార్నింగ్, అమర్ దీప్‌కు శోభా షాక్
బిగ్ బాస్ సీజన్ 7లో నాలుగో పవర్ అస్త్రా కోసం పోటీ మొదలయ్యింది. ఈసారి కంటెస్టెంట్స్ మధ్య మాత్రమే కాదు సంచాలకుల మధ్య కూడా గొడవ జరిగింది.
బిగ్ బాస్ సీజన్ 7లో నాలుగో పవర్ అస్త్రా కోసం పోటీ మొదలయ్యింది. ఇప్పటికే మూడు పవర్ అస్త్రాల కోసం కంటెస్టెంట్స్ అంతా గట్టిగా పోటీపడ్డారు. కానీ ఎంత పోటీపడినా.. చివరిగా ఒక్క పవర్ అస్త్రా ఒక కంటెస్టెంట్‌కు మాత్రమే దక్కుతుంది. ఇప్పటివరకు జరిగిన మూడు పవర్ అస్త్రాల పోటీల్లో శివాజీ, సందీప్, శోభా శెట్టి గెలిచి అస్త్రాలను సంపాదించుకున్నారు. ఇక నాలుగో వారం నామినేషన్స్ తర్వాత పవర్ అస్త్రా కోసం మళ్లీ పోటీ మొదలయ్యింది. మళ్లీ కంటెస్టెంట్స్ మధ్య గొడవలు మొదలయ్యాయి. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. దీనికోసం అమర్‌దీప్, గౌతమ్ కృష్ణ.. ఒక టీమ్‌గా ఆడనున్నారు.
సంచాలకుల మధ్య గొడవ..
నాలుగో పవర్ అస్త్రా కోసం స్మైల్ ప్లీజ్ అనే ఛాలెంజ్‌ను కంటెస్టెంట్స్‌కు ఇచ్చారు బిగ్ బాస్. అందులో అమర్‌దీప్, గౌతమ్.. ఒక టీమ్‌గా ఆడాలని బిగ్ బాస్ ఆదేశించారు. వీరు ఒకవైపు ఉండగా.. మరోవైపు రతిక, టేస్టీ తేజ ఒక టీమ్‌గా ఉన్నారు. ఈ రెండు టీమ్స్.. అవతల టీమ్స్ కెమెరా ముందుకు వెళ్లి స్మైల్ చేస్తూ ఫోటోలు తీసుకోకుండా ఉండేలా ఆపాలి. ముందుగా ఫోటోలు దిగడానికి తేజ, రతిక రంగంలోకి దిగారు. వారిని ఆపడానికి గౌతమ్, అమర్‌దీప్ సిద్ధమయ్యారు. రతికను ఆపడంతో అమర్ సక్సెస్ అయ్యాడు కానీ తేజను ఆపే ప్రయత్నంలో మాత్రం గౌతమ్ సక్సెస్ కాలేకపోయాడు. దీంతో తేజ స్మైల్‌తో ఫోటోలు తీసుకునే అవకాశం వచ్చింది. ఈ టాస్కులో సందీప్, శివాజీ సంచాలకులుగా వ్యవహరించారు. అదే క్రమంలో వారిద్దరి మధ్య కూడా చిన్న వాగ్వాదం చోటుచేసుకున్నట్టు అనిపిస్తోంది. సందీప్ అహంకారంగా మాట్లాడుతున్నాడు అంటూ శివాజీ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
రెండు టీమ్స్ మధ్య పోటీ..
ఆ తర్వాత ఫోటోలు దిగే టర్న్.. అమర్‌దీప్, గౌతమ్‌కు వచ్చింది. రతిక, తేజ.. వారిని ఆపడానికి ప్రయత్నించినా.. అమర్, గౌతమ్ కూడా పూర్తిగా గెలిచే ప్రయత్నాలు చేశాడు. ఈ రెండు టీమ్స్ ఫోటోలు తీసుకున్న తర్వాత అసలు ఎవరు గెలిచారు అనే విషయం నిర్ణయించే అవకాశం శోభా శెట్టి చేతికి వెళ్లింది. ఫోటోలు చూసి, ఏ జంట గెలిచిందో శోభాను నిర్ణయించమన్నాడు బిగ్ బాస్. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అంతా ఆ ఫోటోలను చూశారు. నవ్వుకున్నారు. ఇదే క్రమంలో అమర్‌దీప్, శోభా శెట్టి మధ్య వాగ్వాదం మొదలయ్యింది. యెల్లో బాక్స్‌లో ఉండి ఫోటోలు దిగాలని బిగ్ బాస్ ముందుగానే చెప్పారు. కానీ అమర్ అలా చేయలేదని శోభా పాయింట్ ఔట్ చేయడంతో గొడవ మొదలయ్యింది.
అమర్, శోభాకు మధ్య గొడవ..
స్మైల్ ప్లీజ్ గేమ్‌లో అమర్‌దీప్.. యెల్లో బాక్స్‌లో ఒక చేయి, కాలు పెట్టి ఫోటో దిగాడు. అది కరెక్ట్ కాదని శోభా శెట్టి స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఈ విషయాన్ని అమర్‌దీప్ ఒప్పుకోలేదు. ‘‘యెల్లో బాక్స్‌లో పూర్తిగా ఎవరూ ఉండలేరు. అందులో నేను ఫోటో దిగాను. సగం ఉన్నానా, పూర్తిగా ఉన్నానా అన్నది నా ఇష్టం’’ అని అమర్ అన్నాడు. అమర్ మాటలు విన్న శోభా.. నీకు ఇదే పాయింట్ అయితే చెప్పు బిగ్ బాస్‌కు రాసిచ్చేస్తాను అని చెప్పింది. అయితే అమర్‌కు ఓకే అని రాసివ్వు అని వెటకారం చేశాడు అమర్‌దీప్. స్మైల్ ప్లీజ్ టాస్క్‌లో ఓడిపోయిన జంటలో కూడా ఒకరికి మరోసారి పోటీపడే అవకాశం ఉంటుందని బిగ్ బాస్ ప్రోమోలో తెలిపాడు.
Also Read: ఓ మై గాడ్ - ఐశ్వర్యరాయ్ కూతురి స్కూల్ ఫీజ్ తెలిస్తే షాకే, బచ్చన్ ఫ్యామిలీకి అది జుజుబీ!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial