Bigg Boss OTT Telugu: బిగ్ బాస్ ట్విస్ట్ - మిత్రా కోసం మరొకరిని బలి చేస్తున్నారా?
బిగ్ బాస్ నాన్ స్టాప్ షో మొదటివారంలో ముమైత్ ని పంపించేసి షాకిచ్చారు. మూడో వారం ఆర్జే చైతు ఎలిమినేషన్ అసలు ఎవరూ ఊహించలేదు.
![Bigg Boss OTT Telugu: బిగ్ బాస్ ట్విస్ట్ - మిత్రా కోసం మరొకరిని బలి చేస్తున్నారా? Bigg Boss OTT Telugu: Tejaswi might get eliminated this week Bigg Boss OTT Telugu: బిగ్ బాస్ ట్విస్ట్ - మిత్రా కోసం మరొకరిని బలి చేస్తున్నారా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/03/924e7a8d3c94ba8b4ecd8cb5cb43ad1f_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
బిగ్ బాస్ షోలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఆడియన్స్ వేసే ఓట్ల ప్రకారమే హౌస్ లో ఎలిమినేషన్ అనేది జరుగుతుంటుందని బిగ్ బాస్ టీమ్ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటుంది. కానీ ఆ విధంగా ఎలిమినేషన్ ప్రక్రియ జరగదు. బిగ్ బాస్ టీమ్ తో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు ఎలిమినేషన్లు జరుగుతుంటాయి. అందుకే బిగ్ బాస్ లో జరిగే ఎలిమినేషన్లు ఎప్పుడూ కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయి.
ఇప్పుడు ఓటీటీలో వస్తోన్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షో కూడా అదే దారిలో నడుస్తుందనిపిస్తుంది. ఎవరిని ఎప్పుడు ఎలిమినేట్ చేస్తున్నారో అర్ధం కావడం లేదు. మొదటివారంలో ముమైత్ ని పంపించేసి షాకిచ్చారు. మూడో వారం ఆర్జే చైతు ఎలిమినేషన్ అసలు ఎవరూ ఊహించలేదు. అతడి ఎలిమినేషన్ ఇంటి సభ్యులందరికీ షాకిచ్చింది. షో చూసిన జనాలు సైతం ఆశ్చర్యపోయారు.
నాల్గో వారం సరయు ఎలిమినేట్ అవ్వడం అందరూ ముందే ఊహించారు. ఇక ఐదో వారం మాత్రం ఎవరూ ఊహించని కంటెస్టెంట్ బయటకు వెళ్తుందని సమాచారం. మాములుగా అయితే ఈ వారం గేమ్ పరంగా చూస్తే మిత్రాశర్మ బయటకు వెళ్లాలి. ఆమె సీక్రెట్ గా రాసే రాతలు, అబద్ధాలు ఆడడం ఇలాంటి వాటితో ఆమె ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. కాబట్టి ఈ వారం ఆమె ఎలిమినేట్ అవుతుందని అందరూ భావించారు. ఆమెని కాపాడితే గనుక స్రవంతి బయటకు వెళ్తుందని అనుకున్నారు.
కానీ ఈసారి ఎలిమినేషన్ లో బిగ్ బాస్ ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఐదో వారంలో తేజస్వి ఎలిమినేట్ కానుందని సమాచారం. ఈ ఎలిమినేషన్ మాత్రం అందరికీ షాకిస్తుందనే చెప్పాలి. తేజస్వి ఆట తీరు అందరికీ నచ్చుతుంది. గత సీజన్లో చేసిన తప్పులను ఇప్పుడు చేయకుండా జాగ్రత్త పడుతూ ఆడుతోంది. కానీ తేజస్వి ఎలిమినేట్ అయిందనే వార్తలు బయటకు వస్తున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి!
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)