అన్వేషించండి
Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ తో అఖిల్ ఫైట్ - రచ్చ మాములుగా లేదు!
టాస్క్ లో భాగంగా హౌస్ లో ఓ ఆవును పెట్టి.. సమయానుసారంగా ఆ ఆవునుంచి పాలు వస్తాయని.. వాటిని డబ్బాలలో పట్టుకోవాలని చెప్పారు బిగ్ బాస్.

నటరాజ్ మాస్టర్ తో అఖిల్ ఫైట్
బిగ్ బాస్ హౌస్ లో అఖి, నటరాజ్ మాస్టర్ లకు మంచి బాండింగ్ ఉండేది. అయితే ఇటీవల జరిగిన రోజ్ టాస్క్ లో అఖిల్.. నటరాజ్ మాస్టర్ ని సపోర్ట్ చేయకుండా అనిల్ ని సపోర్ట్ చేశాడు. అప్పటినుంచి నటరాజ్ మాస్టర్.. అఖిల్ పై కోపంగా ఉన్నారు. ఈ విషయంపై హౌస్ లో చాలానే రచ్చ చేశారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో మరోసారి నటరాజ్ మాస్టర్, అఖిల్ గొడవ పడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.
టాస్క్ లో భాగంగా హౌస్ లో ఓ ఆవును పెట్టి.. సమయానుసారంగా ఆ ఆవునుంచి పాలు వస్తాయని.. వాటిని డబ్బాలలో పట్టుకోవాలని చెప్పారు బిగ్ బాస్. ఫిజికల్ టాస్క్ లలో నటరాజ్ మాస్టర్, అఖిల్ ఏ రేంజ్ లో ఆడతారో తెలిసిందే. ఎంతమంది పోటీ పడుతున్నా.. వారందరినీ నెట్టేసి మరీ ఆడుతుంటారు ఈ ఇద్దరూ. బిగ్ బాస్ ఇచ్చిన పాల టాస్క్ ఫిజికల్ టాస్క్ కావడంతో ఇద్దరూ పోటీ పడి మరీ ఆడారు.
నటరాజ్ మాస్టర్ తన చేతిని పక్కకు లాగుతున్నాడని ఫీలైన అఖిల్ తన పాల కేన్ ను గట్టిగా బయటకు లాగాడు. దీంతో పాలు కింద పడిపోయాయి. నటరాజ్ మాస్టర్ పై కోపంతో.. 'ఈయనకి అసలు సంతృప్తి అనేదే ఉండదు' అని అన్నాడు అఖిల్. 'ఎదురువాళ్లని ఓడించాలనే సంతృప్తి నీకు ఉంటుంది నాకు కాదు' అని డైలాగ్ వేశాడు నటరాజ్ మాస్టర్.
'నీకు అత్యాశ ఎక్కువ' అని అఖిల్ అంటే.. 'నీలా నేను మనసులో ఒకటి పెట్టుకుని మాట్లాడను.. నేను కష్టపడి ఆడుతున్నాను' అని నటరాజ్ మాస్టర్ అన్నారు. 'నువ్వొక్కడివే కాదు.. ఇక్కడ అందరూ కష్టపడి ఆడుతున్నారు' అని డైలాగ్ కొట్టాడు అఖిల్. 'చివరి నిమిషంలో చాలా ఇంపార్టెంట్ అనుకున్న టైంలో నా దగ్గర నుంచి లాగేసుకున్నావ్' అని రోజ్ టాస్క్‌లో తనకి సపోర్ట్ చేయకపోవడాన్ని ఎత్తి చూపించారు నటరాజ్. దీంతో అఖిల్.. 'అనిల్ ఫస్ట్ టైం బిగ్ బాస్ కి వచ్చాడు.. వీడికి నీకంటే ఎక్కువ ఇంపార్టెంట్' అని అన్నాడు. 'నన్ను ఎక్కడకొట్టకూడదో సరిగ్గా అక్కడే కొట్టావ్.. కానీ దేవుడు ఉన్నాడు.. మళ్లీ నాకు వచ్చింది.. నా కష్టానికి ఫలితం దక్కింది' అని అన్నారు నటరాజ్ మాస్టర్.
"ANDHARU KASHTA PADTHUNAARU IKKADA!"
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) May 14, 2022
Bigg Boss Non-Stop tasks lo perugutunna gatti poti!
Chudandi ratira 9 PM ki @DisneyPlusHS lo!#BiggBoss #BiggBossTelugu #BiggBossNonStop @EndemolShineIND pic.twitter.com/V5YnYMZX3z
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
తెలంగాణ
పాలిటిక్స్




















