By: ABP Desam | Updated at : 26 Feb 2022 10:59 PM (IST)
Image Credit: Disney Plus Hotstar
Bigg Boss Non Stop | ‘బిగ్ బాస్’ నాన్-స్టాప్ షో మొదలైంది. హోస్ట్ నాగార్జున 17 మంది కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపించారు. గత బిగ్ బాస్ సీజన్లలోని బిగ్ బాస్ సభ్యులను వారియర్స్‌గా, కొత్త సభ్యులను ఛాలెంజర్స్‌గా హౌస్‌లోకి పంపించారు. ఈ సారి బిగ్ బాస్ హౌస్, గత సీజన్స్ కంటే కలర్‌ఫుల్‌గా ఉంది. బిగ్ బాస్ కంటెస్టెంట్లు హౌస్‌లోకి వెళ్లగానే.. శనివారం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగిన హైలెట్స్‌ను టెలికాస్ట్ చేశారు. ఆ తర్వాత నాగార్జున.. నాన్ స్టాప్ స్ట్రీమింగ్ మొదలైందని ప్రకటించారు. మరి, మొదటి రోజు హౌస్‌లో ఏం జరిగిందో చూసేద్దామా.
అరియానా ‘డస్ట్ బిన్ కవర్’ డ్రస్‌పై అషూ కామెంట్స్: అరియానా ధరించిన బ్లాక్ కలర్ డ్రస్ చూసి అషురెడ్డి ఆశ్చర్యపోయింది. ఆ డ్రస్ ‘డస్ట్ బిన్’ కవర్‌లా ఉందంటూ ఆట పట్టించింది. అంతేగాక డస్ట్ బిన్ కవర్‌ను ఆమె చేతికి కట్టి.. దానికి ‘రిసైకిల్’ డ్రస్ అంటూ అరియనా పరువు తీసింది.
ముమైత్ ఖాన్.. AAA ఫార్ములా: ముమైత్ ఖాన్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే పార్టనర్‌ను వెతికే పనిలో పడింది. ముమైత్.. ఆర్జే చైతూతో స్మోకింగ్ రూమ్‌లో మాట్లాడుతూ తనకు అఖిల్, అర్జున్ నచ్చారని తెలిపింది. దీంతో చైతూ కూడా ఆమెను కాసేపు ఆటపట్టించాడు. కొద్ది సేపటి తర్వాత మళ్లీ.. ముమైత్ ఖాన్.. AAA ఫార్ములా అమల్లోకి తెచ్చింది. అర్జున్, అఖిల్, అనిల్ నచ్చారని చైతూతో చెప్పింది. గార్డెన్ ఏరియాలో అరియానా, అషురెడ్డిలు యాంకర్ శివను ర్యాగింగ్ చేశారు. కంటెస్టెంట్లు మాట్లాడే మాటలను ‘బిగ్ బాస్’ సెన్సార్ చేయక తప్పలేదు. ముఖ్యంగా సరయు మాట్లాడేప్పుడు.. సెన్సార్‌కు పని చెప్పారు.
Also Read: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’, గత సీజన్స్ కంటే కొత్తగా, భిన్నంగా - ఈ మార్పులు గమనించారా?
అరియానాతో యాంకర్ శివ ‘పులిహోర’: యాంకర్ శివ, అరియానాతో పులిహోర కలుపడానికి చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. వారిద్దరూ ఒక పక్కన కూర్చొని డిన్నర్ చేస్తూ.. ‘‘ప్రపంచమంతా ఒక వైపు మనం ఇద్దరూ ఒక వైపు. నువ్వు చాలా బాగుంటావు హరియానా’’ అంటూ మాటల్లో పడేయడానికి ప్రయత్నించాడు. మనం ఇద్దరూ మాట్లాడుకుంటుంటే.. ఎవరూ చూడకూడదు. లేకపోతే.. మనల్ని విడదీసేస్తారని అన్నాడు. ‘‘ఇంతమంది అమ్మాయిల్లో నాతో పులిహోర కలుపుతావా’’ అని అరియానా ఆశ్చర్యపోయింది. ఇంతకీ నీ ఫీలింగ్ ఏమిటీ అంటే ‘‘ఆకలి’’ అని శివ అన్నాడు. దీంతో అరియానా మరోలా భావించి ఏ ఆకలి అని అడిగింది. దీంతో శివ తన పొట్టను చూపిస్తూ ‘‘ఈ ఆకలి’’ అని సమాధానం ఇచ్చాడు.
Also Read: వారియర్స్ vs ఛాలెంజర్స్ - గెలిచేదెవరు? ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్లు వీరే!
Bigg Boss OTT Winner: బిగ్ ఓటీటీ ఫినాలే - గెలిచేదెవరు?
Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ - టాప్ 7 కంటెస్టెంట్స్ ఎవరెవరంటే?
Bigg Boss OTT Telugu: ఆయన మాటలంటే నీ సంస్కారం ఏమైంది? బిందుని ప్రశ్నించిన నాగ్!
Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ తో అఖిల్ ఫైట్ - రచ్చ మాములుగా లేదు!
Anasuya In Bigg Boss: ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి అనసూయ, పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన నటరాజ్ మాస్టర్!
IPL 2022: ఐపీఎల్ 2022 మెగా ఫైనల్ టైమింగ్‌లో మార్పు! ఈ సారి బాలీవుడ్ తారలతో..
Navjot Singh Sidhu: సిద్ధూకు ఏడాది జైలు శిక్ష- 34 ఏళ్ల క్రితం కేసులో సుప్రీం తీర్పు
TRS ZP Chairman In Congress : కాంగ్రెస్‌లో చేరిన టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ - గుట్టుగా చేర్పించేసిన రేవంత్ !
Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు