Bigg Boss Non-Stop: భారీ ఓటింగ్ - కప్పు కొట్టేసిన లేడీ టైగర్?
ఇప్పటివరకు జరిగిన పోలింగ్ ప్రకారం.. అందరికంటే ఎక్కువ ఓట్లు బిందు మాధవి నమోదు కాగా.. లీస్ట్ ఓట్లు అనిల్ కి వచ్చినట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ నాన్ స్టాప్ షో పన్నెండు వారాలుగా సాగుతోంది. ఈ వారంతో ఓటీటీ వెర్షన్ కి ముగియనుంది. నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ తరువాత హౌస్ లో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు. మిత్రాశర్మ, అనిల్ రాథోడ్, అరియానా గ్లోరి, బాబా భాస్కర్, యాంకర్ శివ, అఖిల్ సార్ధక్, బిందు మాధవి ఈ ఏడుగురు టైటిల్ కోసం పోటీపడుతున్నారు. నిజానికి ప్రతి సీజన్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఉండేవారు. ఈసారి మాత్రం ఏడుగురు ఉన్నారు.
మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని అనుకున్నారు కానీ అలా జరగలేదు. ఇప్పటివరకు జరిగిన పోలింగ్ ప్రకారం.. అందరికంటే ఎక్కువ ఓట్లు బిందు మాధవి నమోదు కాగా.. లీస్ట్ ఓట్లు అనిల్ కి వచ్చినట్లు తెలుస్తోంది. టాప్ 5లో బిందు మాధవి, అఖిల్, శివ, అరియనా, బాబా భాస్కర్ ఉన్నట్లు తెలుస్తోంది. అందరూ ఊహించినట్లుగానే బిందు మాధవి కప్పు కొట్టేసిందని సమాచారం.
అఖిల్, బిందుల మధ్య ఓటింగ్ విషయంలో టఫ్ ఫైట్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే అఖిల్ కంటే బిందుకి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో ఆమెకి ఓట్లు బాగా పడ్డాయట. దీంతో ఆమెనే విన్నర్ గా అనౌన్స్ చేయబోతున్నారు నాగార్జున. మొత్తానికి బిగ్ బాస్ తెలుగు సీజన్లలో ట్రోఫీ అందుకున్న తొలి మహిళా కంటెస్టెంట్ గా బిందు రికార్డు సృష్టించింది.
View this post on Instagram