Bigg Boss Non Stop Nominations: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’: నామినేషన్లో ఉన్నది వీరే.. వీరిలో ఎవరికి మీ ఓటు?
‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ మొదలైన రెండో రోజే నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. వారియర్స్ టీమ్ సభ్యులను నామినేట్ చేసే అవకాశం ఛాలెంజర్స్‌కు లభించింది.
Bigg Boss Non Stop Nomination | ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’లో నామినేషన్ల ప్రక్రియ ఆదివారమే జరిగింది. ఛాలెంజర్స్ టీమ్ నుంచి ప్రతి ఒక్కరూ.. వారియర్స్ టీమ్ నుంచి ఇద్దరు సభ్యులను ఇంటి నుంచి బయటకు పంపడానికి నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఛాలెంజర్స్ టీమ్ సభ్యులు ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో.. వాళ్లకి కొన్ని ట్యాగ్స్‌ను ఇచ్చి కారణాలు చెప్పి నామినేట్ చేయాలని చెప్పారు బిగ్ బాస్. ఆ తర్వాత వారియర్స్‌కు సైతం ఛాలెంజర్స్ టీమ్ నుంచి ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం లభించింది.
ఎవరు ఎవరిని నామినేట్ చేశారు?:
శివ - సరయుకి అగ్రెసివ్ ట్యాగ్ ఇచ్చిన శివ.. ఆమె సడెన్ గా సీరియస్ అయిపోతుందని కారణం చెప్పాడు. ముమైత్ కి కూడా అదే ట్యాగ్ ఇచ్చి నామినేట్ చేశాడు శివ. ఈ విషయంలో ముమైత్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.
మిత్ర శర్మ - అరియనాతో బాండింగ్ లేదని రీజన్ చెప్పి ఆమెని నామినేట్ చేసింది. ఈ విషయంలో అరియానా సీరియస్ అయింది. బయటకి పంపించేస్తూ.. బాండింగ్ అవ్వట్లేదని చెత్త కారణమని ఫైర్ అయింది. ఆ తరువాత నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేసింది. సరైన కారణాలు చెప్పకపోవడంతో నటరాజ్ మాస్టర్ ఆర్గ్యూ చేశారు.
ఆర్జే చైతు - హమీదని నామినేట్ చేస్తూ.. ఆమె నుంచి నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయని చెప్పింది. దీంతో హమీద చాలాసేపు చైతుతో వాదించింది. తరువాత నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేస్తూ.. బాడీ షేమింగ్ చేశారని రీజన్ చెప్పాడు. దీంతో నటరాజ్ మాస్టర్ సీరియస్ అయ్యారు. ప్లాన్ చేసుకొని తనను నామినేట్ చేస్తున్నారని కామెంట్ చేశారు నటరాజ్ మాస్టర్.
అజయ్ - నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేస్తూ.. టాస్క్ లో అతడి బిహేవియర్ నచ్చలేదని రీజన్ చెప్పాడు. తరువాత సరయుని నామినేట్ చేశాడు.
శ్రీరాపాక - అరియనాను నామినేట్ చేస్తూ.. డ్రామా క్వీన్ అని ట్యాగ్ ఇచ్చింది. దీంతో అరియనా వాదిస్తూ.. తన వెర్షన్ చెప్పింది. తరువాత ముమైత్ ని నామినేట్ చేసింది.
Also Read: 'బిగ్ బాస్ మేళా' ఎవరెవరికి ఏ పనులు కేటాయించారంటే?
అనిల్ రాథోడ్ - నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేస్తూ.. ఆయనతో అసలు బాండింగ్ లేదని కారణం చెప్పాడు. సరయుతో మాట్లాడాలంటే ఆలోచించాల్సి వస్తుందని రీజన్ చెబుతూ.. ఆమెని నామినేట్ చేశాడు. దీంతో సరయు సీరియస్ అయింది. తప్పుగా అర్ధం చేసుకుంటూ.. తనను నామినేట్ చేస్తున్నారని మండిపడింది.
బిందు మాధవి - అఖిల్ కారణంగానే గేమ్ ఆగిందని రీజన్ చెబుతూ అతడిని నామినేట్ చేసింది. స్రవంతి చొక్కారపు - హమీద ఎక్కువగా రియాక్ట్ అవుతుందని కారణం చెబుతూ నామినేట్ చేసింది. తరువాత నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేసింది.
ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీరే: నటరాజ్ మాస్టర్, సరయు, ముమైత్ ఖాన్, హమీద, అరియానా, మిత్ర శర్మ, ఆర్జే చైతూ
Nominations bringing out the True Emotions!!⚔️😱💥💥
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) February 28, 2022
It's 🔥🔥🔥🔥 in the House, ofcourse with Nonstop entertainment!! #Biggboss #BiggBossTelugu #BiggBossNonStop @DisneyPlusHS @EndemolShineIND pic.twitter.com/n8XQVlJMLd