IPL, 2022 | Match 68 | Brabourne Stadium, Mumbai - 20 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
CSK
CSK
IPL, 2022 | Match 69 | Wankhede Stadium, Mumbai - 21 May, 07:30 pm IST
(Match Yet To Begin)
MI
MI
VS
DC
DC

Bigg Boss Non Stop Shree Rapaka: ముమైత్ నా చేయి విరగ్గొట్టింది - ఏడ్చేసిన శ్రీరాపాక

నామినేషన్స్, ఛాలెంజర్స్ వర్సెస్ వారియర్స్ టాస్క్ లతో కంటెస్టెంట్ల మధ్య మనస్పర్థలు పెరిగాయి.

FOLLOW US: 

బుల్లితెరపై ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ మంచి రేటింగ్స్ సాధించింది. ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ ఓటీటీ వెర్షన్ ను మొదలుపెట్టారు. షో మొదలైన రెండో రోజే నామినేషన్స్ పెట్టి షాకిచ్చారు బిగ్ బాస్. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నటరాజ్ మాస్టర్, సరయు, ముమైత్ ఖాన్, హమీద, అరియానా, ఆర్జే చైతు,  మిత్ర శర్మ నామినేట్ అయ్యారు. 

ఇక ఈరోజు ఎపిసోడ్ లో కంటెస్టెంట్లకు ఓ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. బిగ్ బాస్ ఇంట్లో తమకు నచ్చిన, నచ్చని వ్యక్తుల గురించి చెప్పాలని, వారికి థమ్స్ అప్, థమ్స్ డౌన్ బ్యాడ్జీలు పెట్టాలని తెలిపారు. ముందుగా అరియానా తనకు అజయ్‌కు థమ్స్ అప్ ఇచ్చింది. శ్రీ రాపాకకు థమ్స్ డౌన్ ఇచ్చింది. తనని ఓవర్ యాక్షన్ అనడం తట్టుకోలేకపోయానని అరియానా ఫీలయ్యింది. ఆ తర్వాత అఖిల్ కూడా అజయ్‌కు థమ్స్ అప్, శ్రీ రాపాకకు థమ్స్ డౌన్ ఇచ్చాడు.  

నామినేషన్స్, ఛాలెంజర్స్ వర్సెస్ వారియర్స్ టాస్క్ లతో కంటెస్టెంట్ల మధ్య మనస్పర్థలు పెరిగాయి. ఈ క్రమంలో ముమైత్ ఖాన్ వలన హీరోయిన్ శ్రీరాపాక బాగా హర్ట్ అయినట్లు ఉంది. ఆమె తన తోటి కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ.. ముమైత్ తో మూడేళ్లక్రితం జరిగిన సంఘటనను షేర్ చేసుకుంది. అప్పట్లో ముమైత్ తన చేయి విరగ్గొట్టిందని.. అప్పుడు చేయి దారుణంగా వాచిపోయిందని.. దీనికి ఆర్జే చైతునే సాక్ష్యమని చెప్పింది. 

ఆ సమయంలో చైతు-కాజల్ అక్కడే ఉన్నారని.. చేయి విరిగినట్లుగా రిపోర్టులు చూసి తనవైపు నిలబడ్డారని చెప్పుకొచ్చింది. అయినా సరే ఆ విషయాన్ని అక్కడితో వదిలేశానని.. కానీ ముమైత్ ఇంకా దాన్నే మనసులో పెట్టుకుందని.. ఇప్పుడు బిగ్ బాస్ షోకి వచ్చిన తరువాత తనంతో అదోలా మాట్లాడుతుందని చెప్పుకొచ్చింది. నేరుగా వెళ్లి ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా.. ఆమె మాత్రం పట్టించుకోవడం లేదని.. పైగా తనను అబద్దాలకోరు అని కామెంట్ చేసిందని బాధ పడింది. 

తన శరీరానికి గాయం చేసినా.. పట్టించుకోలేదని.. కానీ ఆమె(ముమైత్) మాత్రం అదే విషయాన్ని పట్టుకొని వేలాడుతూ తనను టార్గెట్ చేస్తుందని చెప్పుకొచ్చింది. చీటర్, లయర్ అనే పదాలు తనకు నచ్చవని.. ఆ మాట నేను భరించలేకపోతున్నాను అంటూ ఏడ్చేసింది. మరి ఫ్యూచర్ లో వీరి రిలేషన్ బలపడుతుందో.. లేక గొడవలు పడతారో చూడాలి!

Also Read: తమిళ ‘బిగ్ బాస్’లో భళా అనిపించిన బిందు మాధవి - వామ్మో, గట్టి పోటీయే ఇచ్చింది!

Also Read: నన్ను పెళ్లి చేసుకుంటావా? చైతూకు సరయు ఆఫర్, హమీదాకు వాతలు పెడతానన్న నటరాజ్!

బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీరే:

వారియర్స్: 
1. అషురెడ్డి (సీజన్ 3)
2. మహేష్ విట్టా (సీజన్ 3)
3. ముమైత్ ఖాన్ (సీజన్ 1)
4. అరియనా (సీజన్ 4)
5. నటరాజ్ మాస్టర్ (సీజన్ 5)
6. తేజస్వి మదివాడ (సీజన్ 2)
7. సరయు (సీజన్ 5)
8. హమీద (సీజన్ 5) 
9. అఖిల్ సార్థక్ (సీజన్ 4)
 
ఛాలెంజర్స్:
1. ఆర్జే చైతు (ఆర్జే)
2. అజయ్ కతుర్వర్ (నటుడు)
3. స్రవంతి చొక్కారపు (యాంకర్)
4. శ్రీరాపాక (నటి)
5. అనిల్ రాథోడ్ (మోడల్)
6. మిత్రా శర్మ (నటి, నిర్మాత)
7. యాంకర్ శివ (యూట్యూబ్ యాంకర్)
8. బిందు మాధవి (హీరోయిన్) 

Published at : 28 Feb 2022 05:32 PM (IST) Tags: Bigg Boss OTT Mumaith Khan bigg boss non stop Shree Rapaka

సంబంధిత కథనాలు

Bigg Boss OTT Winner: బిగ్ ఓటీటీ ఫినాలే - గెలిచేదెవరు?

Bigg Boss OTT Winner: బిగ్ ఓటీటీ ఫినాలే - గెలిచేదెవరు?

Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ - టాప్ 7 కంటెస్టెంట్స్ ఎవరెవరంటే?

Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ - టాప్ 7 కంటెస్టెంట్స్ ఎవరెవరంటే?

Bigg Boss OTT Telugu: ఆయన మాటలంటే నీ సంస్కారం ఏమైంది? బిందుని ప్రశ్నించిన నాగ్!

Bigg Boss OTT Telugu: ఆయన మాటలంటే నీ సంస్కారం ఏమైంది? బిందుని ప్రశ్నించిన నాగ్!

Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ తో అఖిల్ ఫైట్ - రచ్చ మాములుగా లేదు!

Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ తో అఖిల్ ఫైట్ - రచ్చ మాములుగా లేదు!

Anasuya In Bigg Boss: ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి అనసూయ, పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన నటరాజ్ మాస్టర్!

Anasuya In Bigg Boss: ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి అనసూయ, పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన నటరాజ్ మాస్టర్!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Nikhat Zareen Profile: ఓవర్‌నైట్ గెలుపు కాదిది - నిఖత్ జరీన్‌ది 12 ఏళ్ల శ్రమ!

Nikhat Zareen Profile: ఓవర్‌నైట్ గెలుపు కాదిది - నిఖత్ జరీన్‌ది 12 ఏళ్ల శ్రమ!

CM Jagan Davos Tour : సీఎం జగన్ దావోస్ పర్యటన, పెట్టుబడులే టార్గెట్!

CM Jagan Davos Tour : సీఎం జగన్ దావోస్ పర్యటన, పెట్టుబడులే టార్గెట్!

Sirivennela HBD: నిన్ను తలుచుకోని నిమిషం, నీ పాట ధైర్యం చెప్పని క్షణముందా సీతారాముడూ!

Sirivennela HBD: నిన్ను తలుచుకోని నిమిషం, నీ పాట ధైర్యం చెప్పని క్షణముందా సీతారాముడూ!

NTR Birthday Special: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు

NTR Birthday Special: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు