Bigg Boss Captaincy Task: కన్నీళ్ళు పెట్టుకున్న యావర్, శోభా శెట్టి- కెప్టెన్సీ టాస్క్ లో అసలు ఏం జరిగింది?
బిగ్ బాస్ ఇంట్లో మొదటి కెప్టెన్సీ టాస్క్ జరిగింది. అది కూడా ఎప్పటిలాగే ఏడుపులు, అరుపులు, అసహనంతో సాగినట్టుగా తెలుస్తోంది.
బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమైన దాదాపు నాలుగు వారాల తర్వాత ఇంటి మొదటి కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ జరిగింది. ఇప్పటి వరకు పవర్ అస్త్ర అంటూ పుల్ల పెట్టిన బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ అంతా గజిబిజి చేసేశాడు. కెప్టెన్సీ కంటెస్టెంట్ గా ఉంటూనే సంచాలకులుగా వ్యవహరించాలని ఫిట్టింగ్ పెట్టాడు. శోభా శెట్టి, యావర్ ని సంచాలకులుగా వ్యవహరించారు. నిన్న జరిగిన ఎపిసోడ్లో శోభా చీటింగ్ గేమ్ అడినట్టు క్లియర్ గా కనిపించింది. కానీ ఈరోజు మాత్రం రివర్స్ లో తనే ఏడుస్తూ కనిపించింది. అందరూ కలిసి యావర్ ని టార్గెట్ చేస్తూ తిట్టిపోశారు. ఎప్పుడు యావర్ కి సపోర్ట్ గా ఉండే శివాజీ కూడ తనని తిట్టడం ఇక్కడ ఊహించని పరిణామం. తాజాగా రిలీజైన ప్రోమోలో ఏముందంటే..
అసలు ఒప్పుకోను..
"ఏ రీజన్ తో వాళ్లిద్దరికీ ఇచ్చారో అర్థం కావడం లేదు ఇది నేను ఎంత మాత్రం ఒప్పుకోలేనని" ప్రియాంక జైన్ అసహనం వ్యక్తం చేసింది. బోర్డు మీద ఉన్న అన్నీ ఫోటోస్ తీసేసి ఇద్దరివి మాత్రమే పెట్టేయండని అరిచింది. కొట్టారా అని యావర్ శుభశ్రీని అడగడం విన్న శివాజీ వాళ్ళ మీద ఫైర్ అయ్యాడు. శివాజీ కూడ యావర్ నిర్ణయాన్ని తప్పు బట్టడంతో ఇది అసలు కరెక్ట్ కాదని యావర్ బాధపడ్డాడు. యావర్ ఆమెకి ఫేవర్ చేయాలని మొత్తం చేశాడు. ఇది ఫేవరిజం అంటే అని అమర్ కూడా ఫ్రస్టేట్ అయ్యాడు. యావర్ తన తప్పు లేదని శివాజీకి నచ్చ జెప్పడానికి ట్రై చేసినా కూడా వినిపించుకోలేదు. శోభా కన్నీళ్ళు పెట్టుకుంటుంటే "డోంట్ వర్రీ.. ఏం ఫాలో అవాలో అది అతనికి అర్థం కాలేదని మాకు అర్థం అయ్యింది దానికి నువ్వేం ఫీల్ అవొద్దని" శివాజీ తనకి ధైర్యం చెప్పాడు.
ప్రశాంత్, అమర్, ప్రియాంక టాస్క్ గురించి మాట్లాడుకుంటూ కనిపించారు. "తెలుగు రాదని నిరూపించుకోవాలి. వాడు చేసిన పనికి వాడే గలీజ్ అయ్యాడు. ఇప్పటి వరకు సంపాదించుకున్న పేరు మొత్తం పోగొట్టుకున్నాడని" ప్రశాంత్ వాళ్ళు మాట్లాడుకున్నారు. అటు యావర్ ఇంట్లో వాళ్ళకి ఎంతగా నచ్చజెప్పాలని చూసినా కూడా ఎవరూ వినిపించుకోలేదని కన్నీళ్ళు పెట్టుకుంటుంటే శివాజీ ఓదారుస్తూ కనిపించాడు.
కెప్టెన్సీ కోసం బిగ్ బాస్.. కంటెస్టెంట్స్‌కు ఇచ్చిన మొదటి టాస్క్.. ‘గెలిపించేది మీ నవ్వే’. ఈ టాస్కులో బోర్డుపై ఒక నవ్వు చిత్రం ఉంటుంది. అందులో కొన్ని పళ్లు మిస్ అయ్యింటాయి. కంటెస్టెంట్స్ అంతా ముందు బురద, తర్వాత నురుగు దాటుకుంటూ వెళ్లి యాక్టివిటీ రూమ్‌లో ఉన్న థర్మాకాల్ బాల్స్‌లో ఉన్న మిస్ అయిన పళ్లను వెతకాలి. ఆ పళ్ల మీద ఉన్న నెంబర్స్ ఆధారంగా వాటిని చిత్రంలో అమర్చాలి. ఇలా అయిదు టీమ్స్‌కు అయిదు చిత్రాలు ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్కులో ముందుగా శివాజీ, పల్లవి ప్రశాంత్ టీమ్ చిత్రంలోని పళ్లను అమర్చి.. ముందుగా గంటను కొట్టారు. ఆ తర్వాత అమర్‌దీప్, సందీప్ ఆట పూర్తి కాకపోయినా గంటను మోగించారు. ఆ తర్వాత మెల్లగా ఆటను పూర్తి చేసుకున్నారు. మూడో స్థానంలో శోభా శెట్టి, ప్రియాంక గంటను మోగించారు. ఆట ముగిసిన తర్వాత ఏ జంట విన్నర్ అనే విషయాన్ని సంచాలకులుగా శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ నిర్ణయించాల్సి ఉంది.
Also Read: బిగ్ బాస్ 7లో మొదటి కెప్టెన్సీ టాస్క్ - శోభాశెట్టి చీటింగ్ గేమ్, శివాజీ ఫ్రస్ట్రేషన్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial