Kavya Shree Insta Story : కావ్య శ్రీ ఇన్‌స్టా స్టోరీ నిఖిల్ గురించేనా? బిగ్‌బాస్ హోజ్లో పెద్దోడి ఏడుపు ఫేకేనా? సింపతీ కార్డ్ ప్లే చేస్తున్నాడా?
Nikhil Love Story : బిగ్‌బాస్‌లో నిఖిల్ తన లవ్ స్టోరి గురించి చెప్తూ ఎమోషనల్ అయిన వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. అయితే దానికి కావ్య శ్రీ కూడా గట్టి రిప్లైనే ఇచ్చింది.
Bigg Boss Nikhil Love Story with Kavya Shree : బిగ్‌బాస్‌లోకి వెళ్లడం.. అక్కడ మరొకరితో లవ్ ట్రాక్ నడపడం.. చివర్లో ఇదంతా డ్రామా.. బయట నాకు వేరే ఉన్నారనడం.. చివరకి బ్రేకప్ అయినట్లు సోషల్ మీడియాలో పోస్ట్‌లు రావడం. ఇదంతా ఎక్కడో చూసినట్టుంది కదూ. అప్పట్లో షణ్ముక్ స్టోరినే అందరికీ గుర్తొచ్చి ఉంటుంది. ఇప్పుడు ఈ స్టోరీ బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో రిపీట్ అవుతున్నట్టే కనిపిస్తోంది. నిఖిల్ తన లవ్ స్టోరి షేర్ చేసుకున్న వెంటనే.. కావ్య శ్రీ తన ఇన్‌స్టాలో పెట్టిన స్టోరి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏమి జరుగుతోంది.
బిగ్‌బాస్‌కి వెళ్లకముందు నిఖిల్.. కావ్య శ్రీ కలిసి రిలేషన్షిప్లో ఉన్నారు. ఇద్దరూ కలిసి షోలకు వెళ్లడం, యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం, ఇన్‌స్టాలో కలిసి ఫోటోలు పెట్టడం ఇలా ఎన్నో జరిగాయి. కానీ బిగ్‌బాస్ సీజన్ 8లోకి ఎంట్రీ ఇచ్చేప్పుడు నిఖిల్ నేను సింగిల్ అంటూ నాగ్‌తో చెప్పాడు. దీంతో నిఖిల్, కావ్య మ్యూచువల్ ఫ్యాన్ తెగ ఫీల్ అయిపోయారు. పైగా హోజ్‌లోకి వెళ్లిన తర్వాత సోనియాతో చాలా క్లోజ్‌గా ఉన్నాడు నిఖిల్.
యశ్మీతో లవ్ ట్రాక్
సోనియా హోజ్నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత యశ్మీ, నిఖిల్ లవ్ ట్రాక్ పట్టాలెక్కింది. వారిద్దరూ ఇష్టంగా ఉంటూన్నట్టే.. నిజంగానే లవ్ ఉన్నట్లే బిహేవ్ చేశారు. సీజన్ అయిపోతుంది అనుకునే సమయానికి.. బయట నాకు ఇంకొకరు ఉన్నారంటూ కొత్త క్యారెక్టర్ని తెరపైకి తీసుకువచ్చాడు నిఖిల్. తాజాగా ఫస్ట్ లవ్ గురించి చెప్పమంటే.. కావ్య శ్రీని ఉద్దేశిస్తూ చాలా ఎమోషనల్ అయ్యాడు నిఖిల్. బయటకు వచ్చాక నిన్నే మొదట మీట్ అవుతాను. నువ్వు కొట్టినా, తిట్టినా పడతాను అంటూ ఏడుస్తూ చెప్పాడు.
సింపతీ కార్డ్?
అయితే నిఖిల్ హోజ్‌లోకి వెళ్లినప్పటి నుంచి కావ్య శ్రీ.. నిఖిల్ గురించి ఒక్కపోస్ట్ కూడా పెట్టలేదు. అయితే తాజాగా నిఖిల్ లవ్ స్టోరి చెప్పిన తర్వాత కావ్య శ్రీ తన ఇన్‌స్టాలో ఓ స్టోరి పెట్టింది. Dont be fooled by their masks. fake people eventually show their true colors. just wait until their mask needs cleaning అంటూ కొటేషన్‌ని పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ స్టోరి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నిఖిల్ సీజన్ చివరికి వచ్చేసరికి సింపతీ కార్డ్ ప్లే చేస్తున్నాడంటూ కొందరు పోస్ట్‌లు పెడుతుంటే.. మరికొందరు వీరిద్దరూ మళ్లీ కలవాలంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.
అవే రీజన్సా?
నిఖిల్, కావ్య శ్రీ మ్యూచువల్ ఫ్యాన్స్ మాత్రం.. వారిద్దరూ కచ్చితంగా కలుస్తారంటున్నారు. తాను కూడా తప్పు చేశానని ఒప్పుకున్నాడు. పైగా ఆమెనే తన వైఫ్ అని కూడా ఫిక్స్ అయ్యానని చెప్పాడంటూ పోస్ట్‌లు వేస్తున్నారు. మరికొందరు ఫ్యామిలీ రీజన్స్‌తోనే విడిపోయి ఉంటారని నిఖిల్‌ని సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరు కావ్య శ్రీ మళ్లీ అతనిని యాక్సెప్ట్ చేయదు. ఇంత చేసినా తర్వాత కూడా ఆమె నిఖిల్‌ని కలవదంటూ తెగ ప్రిడిక్ట్ చేసేస్తున్నారు. మరి నిఖిల్ హోజ్నుంచి బయటకు వచ్చాక ఏమి జరుగుతుందో? వేచి చూడాల్సిందే.
Also Read : బిగ్‌బాస్ హోజ్‌లోకి మళ్లీ వెళ్తోన్న శోభా శెట్టి.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తోందట