Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 99 రివ్యూ... ఇమ్మూ, డెమోన్ ఎమోషనల్ జర్నీ... కన్నీళ్లు పెట్టిన కంటెస్టెంట్స్, చివరి మలుపులో ఏం జరిగింది?
Bigg Boss 9 Telugu Today Episode - Day 99 Review : బిగ్ బాస్ సీజన్ 9లోని కొన్ని గుర్తుండిపోయే టాస్క్ లను టాప్ 5 కంటెస్టెంట్స్ తో మరోసారి రిపీట్ చేయిస్తూ, గెలిచిన వాళ్ళకు ట్రీట్ ఇచ్చారు బిగ్ బాస్.

"ఇక్కడ నిలబడడానికి మీరు చేసిన పోరాటం చిన్నది కాదు. ఇప్పుడు మీ జర్నీ చివరి మలుపులో ఉంది. బిగ్ బాస్ అంటే మీ దృష్టిలో ఏంటో ఒక్కొక్కరిగా చెప్పాలి అని బిగ్ బాస్ నోటీస్ పంపించారు. "నేను బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ నుంచి పెద్ద ఫ్యాన్ ను. ఈ సీజన్లో ఇక్కడ ఉంటానని ఊహించలేదు. కాల్ వచ్చేటప్పటికి వేరే షోలో టీం లీడర్ గా చేస్తున్నాను. బయట చాలా షోలు చేశాను కాబట్టి ఈజీగా నవ్వించవచ్చు అనుకున్నా. కానీ వచ్చిన మొదటి వారమే హరీష్ గారితో జరిగిన గొడవతో... ఇన్నాళ్ళూ కట్టుకున్న కోట కూలిపోయింది అని బాధ పడ్డా. ఇక్క ఒక్కో రకంగా ఉన్న వాళ్లను ఎలా నవ్వించాలి అని నిద్ర పట్టలేదు. అప్పుడే మా మమ్మి పరిచయం అయ్యింది. ఆమె బూస్ట్ ఇచ్చింది నా కామెడీకి. నాకు ఫ్యామిలీ వాల్యూస్ తెలిసేలా చేసింది బిగ్ బాస్. ఒక పర్సన్ గురించి కదిలిస్తేనే ఏడుస్తా అని ఇప్పుడే తెలిసింది. నన్ను మిస్ చేసుకున్న వాళ్ళు బాధ పడేలా చేశాననే అనుకుంటున్నా. ఇప్పటి వరకూ నేను చేసిన షోలన్నీ ఒక లెక్క. ఇదొక్కటి ఒక లెక్క థ్యాంక్స్ బిగ్ బాస్" అంటూ ఇమ్మాన్యుయేల్ ముందుగా చెప్పాడు.
డెమోన్ ఎమోషనల్ జర్నీ
"బిగ్ బాస్ నుంచి ఫోన్ రాగానే నేను నా కూతురి మొహమే చూశాను. ఫిజికల్ గా ఆడగలనా అంటే... ఇలాంటి డెమోన్ తో ఫిజికల్ టాస్క్ పెడతారు అనుకోలేదు. అలాగే నేను కనీసం 2 వీక్స్ ఉంటానా? ఎవరైనా.నన్ను భరిస్తారా? అని నా భర్తకు అబద్దం చెప్పి వచ్చాను. నా రెస్పెక్ట్ ను రిటర్న్ తెచ్చుకునే షో ఇది. ఇదొక రీలైఫ్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి రీఎంట్రీ. మైండ్ గేమ్ అనేది నా పవర్. దానివల్ల ఇక్కడిదాకా వచ్చాను" అని సంజన చెప్పుకొచ్చింది.
"బిగ్ బాస్ కు వచ్చే 1 మంత్ ముందే మా నాన్నకు టంగ్ క్యాన్సర్ అని తెలిసింది. ఎలాంటి అలవాట్లు లేకపోయినా వచ్చిన ఆ క్యాన్సర్ క్యూరబుల్ అన్నారు. లైఫ్ లో స్ట్రగుల్ అవుతుండడం వల్ల చాలా ఏడ్చాను. బెటర్ అవ్వడానికి నవలలు చదవడం స్టార్ట్ చేశాను. ఇంట్లో అడిగితే స్పోర్ట్స్ బాగా ఆడినా వద్దు అన్నారు. ఏదో ఒకటి అచీవ్ చేసి, ఫ్యామిలీ గర్వపడేలా చేయాలి అనుకున్నా. పార్ట్ టైమ్ జాబ్ లు చేశాను. ఇంట్లో జాబ్ చేయమంటారు. కానీ నాకు కూర్చుని చేసే ఓపిక లేదు. షార్ట్ ఫిలిమ్స్ లో ట్రై చేశాను. ఒక షార్ట్ ఫిల్మ్ కోసం 7 నెలల వెయిట్ చేయించారు. ఒకటి రాసి పెట్టి లేదంటే ఏదో పెద్దదే రాసిపెట్టి ఉంటుందని నమ్ముతా. మా అన్నయ్య బిగ్ బాస్ లో కామనర్స్ కు అవకాశం అన్నారు. అప్లై చేశా, ఫోన్ వచ్చింది. ఇక్కడికి వచ్చాక శ్రీజ, రీతూ బాగా పరిచయం అయ్యారు. ఇది నాకు న్యూ బిగినింగ్" అంటూ డెమోన్ ఎమోషనల్ జర్నీని వివరించాడు.
తనూజ ఫ్రెండ్ కన్నా ఎక్కువ
"8 ఇయర్స్ నుంచి సినిమా పిచ్చి. అప్పుడు అనుకున్నా కళ్యాణ్ పడాల స్క్రీన్ మీద కనిపించాలి అని. ఒకరోజు డ్యూటీ అయిపోయాక బిగ్ బాస్ కి అప్లై చేశా. సెలెక్ట్ అయ్యాను. బిగ్ బాస్ అంటే కావాలనిపించే కష్టం. ఫుడ్, స్లీప్, మనుషులు కరెక్ట్ గా ఉంటాము. అయినా ఇది కావాలి అనిపిస్తుంది. ఈ పర్సన్ తో బాండ్ ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ. లైఫ్ లాంగ్ ఈ పర్సన్ తో ఈ బాండ్ ఇలాగే ఉంటుంది" అంటూ ఓపెన్ అయ్యాడు కళ్యాణ్.
"17 ఏళ్ల నుంచి బిగ్ బాస్ కు వచ్చేవరకు నేను హ్యాపీగా లేని పర్సన్ ను. మా డాడికి ఈ ప్రొఫెషన్ అంటే అస్సలు ఇష్టం లేదు. నా ఫ్యామిలీ కంటే నన్ను ఎక్కువగా ప్రేమించింది నా అభిమానులు. ఉన్నన్ని రోజులు ఉన్నదాంట్లోనే హ్యాపీగా ఉండాలి. మనుషులు అంటే భయపడే నాకు మనుషుల విలువ తెలిసేలా చేశారు" అని తనూజా ఎమోషనల్ అయ్యింది.
మధుర జ్ఞాపకాలను వన్స్ మోర్ వన్ లాస్ట్ టైమ్ అని గుర్తు చేసుకుందాం. ఈ ఛాలెంజ్ లో ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయిన టాస్కులు ఆడాలి అంటూ 'రేస్ ఆఫ్ గ్లోరి' టాస్క్ ఇచ్చారు. కళ్యాణ్ - తనూజా... డెమోన్ ఇమ్మూ పెయిర్ గా... సంజన సంచాలక్ గా ఈ టాస్క్ ఆడారు. ఇందులో ఇమ్ము - డెమోన్ గెలిచారు. స్టార్స్, బర్గర్ ట్రీట్ గా ఇచ్చారు. చివరగా 'నాచోరే నాచోరే' టాస్క్ టాస్క్ లో డెమోన్ విన్ అయ్యి, స్టార్ తో పాటు డెజర్ట్ బ్లాక్ బెర్రీ కేక్ ను ట్రీట్ గా పొందాడు.





















