Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 97 రివ్యూ... ట్రస్ట్ టాస్క్ నుంచి పాప్ సింగర్ సడన్ ఎంట్రీ to సుమన్ శెట్టి ఎలిమినేషన్ వరకు... నేటి ఎపిసోడ్ హైలెట్స్
Bigg Boss 9 Telugu Today Episode - Day 97 Review : వీకెండ్ ఎపిసోడ్ లో నాగ్ హౌస్ మేట్స్ ను ఒక్కమాట కూడా అనకుండా అభినందించారు. చివర్లో సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేస్తూ డబుల్ ఎవిక్షన్ ట్విస్ట్ ఇచ్చారు.

డే 97 ఎపిసోడ్లో ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ నాగార్జున "సోమవారం నుంచి గురువారం వరకు ఏం జరిగిందో చూశారు. మరి శుక్రవారం ఏం జరిగిందో చూద్దాం" అని చెప్పారు. అందరినీ కూర్చోబెట్టి ఇమ్యూనిటీ వద్దన్నాను అంటూ రీజన్ చెప్పింది. "14వ వారం అంత కష్టపడి ఆడి గెలుచుకున్నప్పుడు ఎందుకు శాక్రిఫైజ్ చేస్తావ్? ఒకవేళ మేము గెలిస్తే ఇవ్వడానికి నీ దగ్గర 3 లక్షలు లేవా?" అని సీరియస్ అయ్యాడు కళ్యాణ్. దీంతో తనూజ కూడా కన్నీళ్ళు పెట్టుకుంది.
అడ్డంగా దొరికిపోయిన డెమోన్
లీడర్ బోర్డులో టాప్ లో ఉన్న తనూజాను అభినందించారు నాగార్జున. "రీతూ వెళ్లిపోయాక బెటర్ అయ్యావు. నువ్వేం అంటావ్?" అని అడిగారు. "నేను ఈ వీక్ బాగా ఎంజాయ్ చేశాను సార్" అని డెమోన్ చెప్పడంతో... "బయటకు వెళ్ళాక దొరికిపోయావ్" అని నవ్వేశారు నాగార్జున. దీంతో డెమోన్ ను మరింత ఇరికించే ప్రయత్నం చేశారు తనూజా, సంజన. అనంతరం "ఈ హౌస్ లో మీరు ట్రస్ట్ చేసేది ఎవరిని? చేయనిది ఎవరు అనేది రెడ్, గ్రీన్ ఫ్లాగ్స్ పెట్టి చెప్పాలి" అన్నారు నాగ్.
ట్రస్ట్ ఇమ్మాన్యుయేల్, ఈ వారం హార్డ్ గా ఉంది తనూజా అంటూ రెడ్ ఫ్లాగ్ ఇచ్చింది సంజన. భరణి సుమన్ కు గ్రీన్, డెమోన్ కు రెడ్ ఫ్లాగ్ ఇచ్చాడు. ఈ సందర్భంలోనే నాగార్జున భరణి - సుమన్ శెట్టి ఫ్రెండ్షిప్ వీడియోను ప్లే చేశారు. డెమోన్ గ్రీన్ ఇమ్మూ, రెడ్ భరణికి ఇచ్చాడు. కళ్యాణ్ గ్రీన్ తనూజా, పవన్ కు రెడ్ ఇచ్చాడు. సంజనాకు గ్రీన్, భరణికి రెడ్ ఇచ్చాడు ఇమ్మాన్యుయేల్. "రెడ్, గ్రీన్ ఫ్లాగ్స్ పెట్టాలంటే 5 లక్షలు విన్నర్ ప్రైజ్ మనీ కట్ అవుతుంది" అని తనూజాతో అన్నారు నాగ్. "నాకొద్దు. అందరం దానికోసమే కదా కష్టపడ్డాం" అని చెప్పింది తనూజ. గ్రీన్ కళ్యాణ్, రెడ్ సంజనాకు ఇచ్చింది. భరణికి గ్రీన్, ఇమ్మాన్యుయేల్ కి రెడ్ ఇచ్చాడు సుమన్. ఎక్కువ ట్రస్ట్ ఇమ్మూ.. తక్కువ భరణి, డెమోన్ లకు వచ్చాయి.
బిగ్ బాస్ స్టేజ్ పైకి ఊహించని అతిథి
"ఇండియన్ పాప్ స్మితా" అంటూ ఆమెను స్టేజ్ మీదకు పిలిచి సర్ప్రైజ్ ఇచ్చారు నాగ్. ఆమె కొత్త ఆల్బమ్ "ఓజీ క్వీన్ ఆఫ్ పాప్ ఆల్ ఆఫ్ వరల్డ్"తో వరల్డ్ టూర్ చేయబోతున్నట్టు వెల్లడించింది. దానికి సంబంధించిన ప్రోమోను నాగార్జునతో లాంచ్ చేయించారు. అలాగే ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్ నోయెల్ దీనికి ర్యాప్ చేయగా, 'నా సామిరంగా' మూవీ డైరెక్టర్ విజయ్ బిన్నీ మాస్టర్ ఈ వీడియో చేశారు. లైవ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇప్పించారు.
సుమన్ శెట్టి ఎవిక్షన్
"మీకు ఇష్టం లేని వారం చెప్పడానికి రెడీగా ఉన్నారా?" అంటూ రిగ్రెట్ టాస్క్ ఇచ్చారు. "వీక్ 10లో నిఖిల్ ను నామినేట్ చేశాను. ఆయన వెళ్ళిపోవడం బాధగా అన్పించింది అని సుమన్.. 6వ వారంలో భరణి ఎలిమినేట్ అయిపోవడాన్ని తీసుకోలేకపోయాను అని తనూజ, పవన్ 6వ వారం రీతూపై మ్యాన్ హ్యాండ్లింగ్ రిగ్రెట్ గా అన్పించిందని డెమోన్, 7వ వారం.నామినేషన్లో కళ్యాణ్ కు తనూజను నామినేట్ చేయమని స్లిప్ ఇవ్వలేదు అని ఇమ్మాన్యుయేల్, 7వ వారంలో నామినేషన్ లో ఫ్లిప్ అవ్వడం, వీకెండ్ ముందు రోజు తనూజా కళ్ళు తిరిగి పడిపోవడం అని కళ్యాణ్, 5వ వారంలో శ్రీజను బెడ్ పై నుంచి తీసేయడం బిగ్గెస్ట్ రిగ్రెట్ అని భరణి, 11వ వారంలో రీతూతో జరిగిన గొడవ రిగ్రెట్ అని సంజన చెప్పారు. "ఈ వారం డబుల్ ఎలిమినేషన్...ఒకరు ఈరోజు, మరొకరు ఆదివారం ఎలిమినేట్ అవుతారు" అని ప్రకటించారు నాగ్. చివరగా సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యాడు.
Also Read: Akhanda 2 Movie Review - 'అఖండ 2' రివ్యూ: బాలకృష్ణ రుద్రతాండవం - బోయపాటి శ్రీను ఎలా తీశారంటే?





















