Bigg Boss 9 Telugu: దమ్ముకి పట్టిన దుమ్ము దులిపేశాడే.. గుండు అంకుల్ ఫేస్ మాడిపోయిందే.. లెక్కలు సరి చేసిన నాగ్
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ ఇంట్లో మొదటి వారం జరిగిన గొడవలన్నింటికీ నాగ్ క్లాస్ పీకారు. మరీ ముఖ్యంగా గుండు అంకుల్ ఇష్యూని లేవదీసి హరీష్ తల అంటేశారు. ఇంకా శనివారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

Bigg Boss 9 Telugu - Day 6 Episode 7 Review: బిగ్ బాస్ ఇంట్లో మొదటి వారం రకరకాల గొడవలు జరిగాయి. ఎన్ని పదాల చుట్టూ గొడవలు జరిగాయో వాటన్నింటినీ నాగార్జున సరి చేశాడు. ఫ్రీ బర్డ్ అనే పదంతో సంజనా, ఫ్లోరా మధ్య గొడవ జరగడంపై నాగ్ క్లాస్ పీకాడు. ఇక పొటాటో ఫ్రై అంటూ తనూజ మీద ఓనర్స్ గ్యాంగ్ చేసిన దాడి గురించి కూడా మాట్లాడాడు. ఆ తరువాత గుండు అంకుల్ ఇష్యూని మాట్లాడాడు. ఇక టెనెంట్స్ నుంచి ఓ కంటెస్టెంట్ పర్మనెంట్ ఓనర్ అయ్యే అవకాశం ఉందని ఊరించాడు నాగ్. అసలు శనివారం నాటి ఎపిసోడ్ ఎలా సాగిందంటే..
ఫ్రీ బర్డ్ పదం చుట్టూ వారం రోజులు జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే. ఆ ఒక్క పదంతో ఫ్లోరా, సంజన మధ్య గ్యాప్ పెరిగింది. అయితే ఆ పదం అనడానికి, ఆ రోజు జరిగిన విషయాన్ని చూపించాడు. రాము, ఫ్లోరా మాట్లాడుకుంటూ ఉంటే.. మధ్యలో నువ్వు వెళ్లి అలా ఫ్రీ బర్డ్ అని అనడం ఎందుకు? అంటూ సంజనాకి క్లాస్ తీసుకున్నాడు నాగ్. ఫ్రీ బర్డ్ అనేది నెగెటివ్ కాదు.. నేను ఆ ఉద్దేశంలో అనలేదు అంటూ సంజనా క్లారిటీ ఇచ్చింది.
Also Read: బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ల రెమ్యూనిరేషన్ లిస్ట్... భరణి టాప్, కామనర్స్‌కి ఎంత ఇస్తున్నారో తెలుసా?
సంజనా బాధల్లో ఉంటే మధ్యలో నువ్వు వెళ్లి నీకు ఇష్టం వచ్చినట్టుగా అనేస్తున్నావ్.. అది తప్పు కదా? అని ఫ్లోరాకి క్లాస్ తీసుకున్నాడు నాగ్. సంజనాకి సారీ చెప్పు అని ఫ్లోరాని ఆదేశించాడు. దీంతో ఫ్లోరా సారీ చెప్పింది. అనాల్సినవన్నీ అనేసి ఇప్పుడు సారీ చెబితే ఎలా సార్.. నేను వల్గర్ పదాలు అనిపించుకోవడానికి ఇక్కడకు వచ్చానా? అని సంజనా ఏడ్చేసింది. చివరకు ఫ్లోరా, సంజనా ఇక్కడితో మ్యాటర్ క్లోజ్ చేయండని చెప్పాడు నాగ్.
ఇక పొటాటో ఫ్రై మ్యాటర్‌ని తీసి శ్రీజ దమ్ముకి పట్టిన దుమ్ముని నాగ్ దులిపేశాడు. పొటాటో ఫ్రై అడిగితే.. పొటాటో కర్రీ ఇచ్చిందని తనూజను ఎంత హింసించావ్ అంటూ శ్రీజను అడిగాడు నాగ్. ఇక ఆ రోజు ఆ కర్రీని పాడు చేసిన వీడియోని చూపించాడు నాగ్. ప్రియ, కళ్యాణ్ కలిసి మళ్లీ కర్రీని వండటంతో అది ఫ్రై లా కాకుండా కర్రీలా మారిపోయింది. ఇక్కడ తనూజ చేసిన తప్పు ఏంటి? కానీ నువ్వు మాత్రం ఆమెను టార్గెట్ చేశావ్.. స్వార్థంగా ఆలోచించారు.. మీరు ఓనర్స్‌లా ప్రవర్తించమంటే.. శాడిస్ట్‌లా, స్వార్థపరుల్లా మారారు అంటూ శ్రీజ బొమ్మని పగలగొట్టేశాడు నాగ్. మరి ఇప్పటికైనా శ్రీజ తన పద్దతి మార్చుకుంటుందా? లేదా? అన్నది చూడాలి.
Also Read: బిగ్ బాస్ షోలో ఫస్ట్ వికెట్ అవుట్ - ఆమెకు నెగెటివిటీ ఈ రేంజ్‌లో ఉందా?
సోల్ ఫ్రెండ్ షిప్ అంటూ రీతూ, తనూజ మ్యాటర్‌ని కూడా లేవనెత్తాడు నాగ్. మీలో మీ భావాల్ని దాచుకుంటే ఎలా అని.. వారిద్దరి మధ్య ఉన్న మనస్పర్థల్ని తగ్గించే ప్రయత్నం చేశాడు నాగ్. ఆ తరువాత గుండు అంకుల్ టాపిక్ తీశాడు నాగ్. ఇమాన్యుయేల్ కావాలని బాడీ షేమింగ్ చేయలేదు.. సరదాగా అన్నాడని హౌస్ మేట్స్ చెబుతున్నారు.. ఆడియెన్స్ కూడా అదే అనుకుంటున్నారు.. సరదాగానే అన్నాడని అంతా చెబుతున్నారు అంటూ ఇమ్ము గురించి హరీష్‌కు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశాడు నాగ్.
ఇక గుండు అంకుల్ కంటే ముందుగా రెడ్ ఫ్లవర్ అనే పదాన్ని వాడావు కదా? అని హరీష్‌ను ఇరికించాడు నాగ్. ఆ పదాన్ని వాడటం తప్పే అని హరీష్ ఒప్పుకున్నాడు. ఆ తరువాత భరణి, ఇమాన్యుయేల్‌ను ఆడోళ్లు అని అన్న వీడియోని ప్లే చేయించి చూపించాడు. హరీష్ మాత్రం తాను అలా అనలేదు అని వాదించే ప్రయత్నం చేశాడు. మళ్లీ ఆ వీడియోని ప్లే చేయించాడు నాగ్. అయినా కూడా హరీష్ తన తప్పుని ఒప్పుకోలేదు. ఇంటి సభ్యులు, బయట ఆడియెన్స్ అంతా కూడా హరీష్‌దే తప్పు అని అన్నారు. లింగ వివక్ష చూపించాడని, భరణి, ఇమ్ములను అలా అనడం తప్పు అని హరీష్‌కు క్లాస్ పీకాడు నాగ్. ఇమాన్యుయేల్ విషయంలో సంచాలక్‌గా తాను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. రాము మాత్రం టాస్కులో అదరగొట్టేశాడు అని నాగ్ మెచ్చుకున్నాడు. టెనెంట్స్‌లోంచి ఒకరు ఓనర్ అయ్యే ఛాన్స్ ఉందని నాగ్ చెప్పాడు. మరి ఓనర్ అయ్యేందుకు పెట్టే టాస్క్ ఏంటో ఆదివారం నాటి ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. శనివారం నాటి ఎపిసోడ్‌లో తనూజ సేఫ్ అయినట్టుగా ప్రకటించాడు నాగ్. ఇప్పటికే ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్‌కు సంబంధించిన లీక్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ విశేషాల్ని ఆదివారం నాటి ఎపిసోడ్‌లో చూడాలి.
Also Read: బిగ్ బాస్ ఎపిసోడ్ 6 రివ్యూ... డ్రింక్ చుట్టూ తిరిగిన కథ, నవ్వు రాని టాస్క్... బోరింగ్ ఎపిసోడ్





















