Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 47 రివ్యూ... తనూజాకు హెల్త్ ఎమర్జెన్సీ - గుక్కపెట్టి ఏడ్చిన దువ్వాడ మాధురి... అయేషా అవుట్!
Bigg Boss 9 Telugu Today Episode - Day 47 Review : బిగ్ బాస్ సీజన్ 9 డే 47 ఎపిసోడ్ 48లో కెప్టెన్సీ టాస్క్ తో పాటు ఇంట్రెస్టింగ్ విషయాలెన్నో జరిగాయి. అవేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

కంటెండర్ కోసం జరుగుతున్న టాస్కులు రోత పుట్టిస్తున్నాయి. ఇద్దరు గ్యాంగ్ స్టర్స్ కోసం బీబీ హౌస్ లోకి అడుగు పెట్టిన పోలీసులు ఇంద్రజిత్ (అర్జున్ అంబటి), కరణ్ జీత్ (అమర్దీప్) ఒక్కొక్కరిగా ఇంటి సభ్యులను ఇన్వెస్టిగేట్ చేశారు. డైరెక్ట్ కంటెండర్షిప్ ప్రామిస్ చేయడంతో తనూజా సంజనా సైలెన్సర్ ను పట్టించగా, ఆమెను తీసుకెళ్లి జైల్లో వేశారు. తనూజాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు పోలీసులు. దువ్వాడ మాధురిని వాష్ రూంలో కప్ బోర్డులో దాచిపెట్టారు. మాధురి కట్ అవుట్ మీద 'కిల్' అని రాయమంటూ రీతూ చౌదరికి సీక్రెట్ టాస్క్ ఇచ్చి, వచ్చిన పని అయిపోవడంతో ఇంద్రజిత్, కరణ్ జీత్ వెళ్లిపోయారు. తొక్కలో కెప్టెన్ అన్నందుకు హర్ట్ అయ్యానని చెప్పాడు సుమన్ శెట్టి. దీంతో సారీ చెప్పి, తప్పు ఒప్పుకుంది సంజన. ఆ కాసేపటికే సంజనాను జైలు నుంచి రిలీజ్ చేశారు.
అనారోగ్యంతో ఇంటికెళ్లిపోయిన అయేషా
అయేషాకు టైఫాయిడ్, డెంగ్యూ ఉన్నట్టుగా డాక్టర్లు నిర్ధారించారు. కళ్యాణ్ వెళ్ళి "మీ కట్ అవుట్ పై కిల్ అని ఎవరో రాశారు" అని చెప్పాడు. ఇద్దరూ కలిసి రమ్యపై అనుమానపడ్డారు. మరోవైపు తనూజా - ఇమ్మాన్యుయేల్ కాఫీ డేట్ అంటూ కలిసి కాఫీ తాగితే, అయేషా "నేను కోరుకున్నది ఏది నాకు దక్కదు" అంటూ రామూ దగ్గర బాధపడింది. రీతూ, పవన్ లను స్పూఫ్ చేసి కాసేపు ఫన్ క్రియేట్ చేశారు తనూజ - ఇమ్మూ. కానీ దివ్య ఒక్కతే రూమ్ లో కూర్చుని బాధ పడింది. కన్ఫెషన్ రూమ్ లోకి అయేషాను పిలిచి త్వరగా కోలుకోవడానికి, ఇతర హౌస్ మేట్స్ ఆరోగ్య భద్రత కోసం ఆమెను హౌస్ నుంచి బయటకు పంపుతున్నట్టు చెప్పారు బిగ్ బాస్. ఫినాలే వీక్ లో వస్తానని అందరికీ గుడ్ బై చెప్పి వెళ్లిపోయింది అయేషా.
రీతూ చౌదరిని టార్గెట్ చేసిన దువ్వాడ మాధురి
"నన్ను టాస్క్.నుంచి తప్పించావు. డబ్బులు ఉన్నా కంటెండర్ అయ్యేదానివి కదా" అంటూ మొహం మాడ్చుకుంది మాధురి. "ఇది గోల్డెన్ ఛాన్స్ వదులుకోను" అంటూ మొహం మీదే చెప్పేసింది రీతూ. డైరెక్ట్ గా కంటెండర్ అయిన రీతూ, తనూజా తమ డబ్బులను మిగతా వాళ్ళతో పంచుకున్నారు. 4500 నిఖిల్, 4430 డెమోన్, సాయి 4100, సుమన్ 3150, దివ్య 4880, 4630 ఇమ్ము, కళ్యాణ్ 4830 డబ్బులు ఉన్నాయని చెప్పారు. దివ్య, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, నిఖిల్ ఎక్కువ డబ్బు సంపాదించి కంటెండర్లుగా అర్హత సాధించారు.
కంటెండర్ల లిస్ట్ లో డెమోన్ పేరు లేకపోవడంతో అతను హర్ట్ అయ్యాడు. రీతూ -డెమోన్ కలిసి ఇమ్మాన్యుయేల్ దగ్గర పంచాయతీ పెట్టారు. "గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు. టీంకి ఇవ్వాలి గానీ డెమోన్ కి ఎలా ఇస్తావ్? నమ్మొద్దు అన్నా నమ్మాను. ఇంకా నమ్మను. నువ్వు ఇండిపెండెంట్ కాదు పవన్ తో ఆడడానికి వచ్చావ్" అంటూ నోరు జారింది దువ్వాడ మాధురి. ఇద్దరి మధ్య మాటల దాడి మర్యాద దాకా వెళ్ళింది.
"హ్యాట్ తో వేట" అనే కెప్టెన్సీ టాస్క్ లో ఇమ్మాన్యుయేల్ గెలిచాడు. ఇక్కడ కూడా సంజన తీరు వల్ల దివ్య, మాధురితో గొడవ జరిగింది. అంతలోనే తనూజా కళ్ళు తిరిగి పడిపోయింది. దీంతో కళ్యాణ్ గుక్కపెట్టి ఏడ్చాడు. అలాగే మాధురి, ఇమ్మాన్యుయేల్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. తనూజాకి ఫేవరేటిజం చూపిస్తోంది అంటూ రమ్య - మాధురి గొడవ పడ్డారు. అర్థరాత్రి "ఎందుకు ఏడ్చావ్? నీలా నేను ఆలోచించలేను. నా వేలో చెప్పు" అని అడిగింది తనూజ. "ఇప్పుడు బజ్జో... రేపు నీకొకటి చెప్తా" అంటూ తనూజా నిద్రపోయేదకా అక్కడే ఆమె చేతిని పట్టుకుని కూర్చున్నాడు కళ్యాణ్.
Also Read: బిగ్‌బాస్ డే44 రివ్యూ... మాస్ మాధురితో పెట్టుకుంటే మడతడిపోద్ది... హౌస్‌లో కరుడు గట్టిన నేరస్థులు





















