Bigg Boss 9 Today Promo: బిగ్ బాస్ హౌస్‌లో కొత్త చాప్టర్ - ఈ వారం డబుల్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు?... వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌తో శ్రీజకు షాక్!
Bigg Boss Telugu 9 Day 35: బిగ్ బాస్ హౌస్‌లో ఈ వారం ఎలిమినేషన్ హీట్ పెరిగింది. డబుల్ ఎలిమినేషన్ అని తెలుస్తుండగా డేంజర్ జోన్‌లో ఉన్న ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తిగా మారింది.

Bigg Boss Telugu 9 Day 35 Promo Review: బిగ్ బాస్ 9లో ఈ వారం ఎలిమినేషన్‌కు సమయం ఆసన్నమైంది. హౌస్ మేట్స్‌కు తనదైన టాస్కులు ఇస్తూ చుక్కలు చూపించారు బిగ్ బాస్. హౌస్‌లో ఆటతో పాటు హీట్ కూడా పెంచేశారు. ఈ వారం డేంజర్ జోన్‌లో రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, దివ్య నిఖిత ఉండగా... ఇమ్యూనిటీ టాస్కులతో సేఫ్ జోన్‌లో ఉన్నారు దివ్య. ఇక అసలు ఎలిమినేషన్ రీతూ, ఫ్లోరా మధ్యనే ఉంది. ఇప్పటికే ఆట తీరును బట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే క్లారిటీ వచ్చేసినప్పటికీ బిగ్ బాస్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అనే దానిపై అందరిలోనూ ఇంట్రెస్ట్ నెలకొంది.
ఎవిక్షన్ జోన్‌లో ఉన్న రీతూ, ఫ్లోరా ఇద్దరినీ యాక్టివిటీ రూంలోకి పంపించిన హోస్ట్ నాగార్జున... ఆ తర్వాత హౌస్ మేట్స్‌ను అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. 'ఇద్దరిలో ఎవరు వెళ్తున్నారు?' అని అడగ్గా... 5 వారాల గేమ్స్, టాస్కుల పెర్ఫార్మెన్స్ బట్టి ఫ్లోరా ఎలిమినేట్ అవుతారని భావిస్తున్నట్లు ఇమ్మాన్యుయెల్ చెప్పాడు. దివ్య నిఖిత, డీమాన్ పవన్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
యాక్టివిటీ రూంలో రీతూ, ఫ్లోరా కన్నీళ్లు
'మీరు ఈ హౌస్‌లో ఎవరిని బాగా మిస్ అవుతున్నారు. వాళ్లకు ఏం చెప్పాలని అనుకుంటున్నారు?' అంటూ యాక్టివిటీ రూంలో రీతూ, ఫ్లోరాలను అడగ్గా... తాను సంజనను మిస్ అవుతానని ఫ్లోరా షైనీ చెప్పారు. తాను బాధలో ఉన్నప్పుడు తనకు చాలా బాగా సపోర్ట్ చేశారని చెప్పారు. ఇక రీతూ చౌదరి... పవన్‌ను చాలా మిస్ అవుతానని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక ఆడియన్స్ పోల్ ప్రకారం ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో నాగ్ అనౌన్స్ చేశారు.
ఫ్లోరా ఎలిమినేట్?
ఈ వారం ఫ్లోరా ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. గత 4 వారాలుగా ఆమె టాస్కులు సరిగ్గా ఆడలేదని... కేవలం లక్కు ద్వారానే సేఫ్‌గా బయటపడ్డారనేది ఆడియన్స్ అభిప్రాయం. అంతే కాకుండా హౌస్ మేట్స్‌లో చాలా మందికి ఆమె మోస్ట్ బోరింగ్, వరస్ట్ ప్లేయర్ అనే అభిప్రాయం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను ఈ వారం హౌస్ నుంచి బయటకు పంపేస్తారని సమాచారం. దాదాపు 5 వారాలు హౌస్‌లో ఉన్న ఆమె మొత్తం రూ.15 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా?
ఈ వారం బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ బాంబ్ పేల్చనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీజ, దివ్య, రీతూ, పవన్, సుమన్ శెట్టి ఉండగా... రెండో ఎలిమినేషన్‌గా శ్రీజను బిగ్ బాస్ బయటకు పంపేస్తారని సమాచారం. అయితే, ఈసారి విచిత్రంగా హౌస్‌లోకి వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్స్‌తో శ్రీజను ఎలిమినేట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకూ హౌస్ నుంచి శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, హరిత హరీష్, ప్రియా శెట్టి ఎలిమినేట్ అయ్యారు.
దీంతో పాటే ఆరుగురు కొత్త కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎంటర్ అయినట్లు సమాచారం. ఇక బిగ్ బాస్ సీజన్ 9లో కొత్త చాప్టర్ మొదలు కాబోతోందని హోస్ట్ నాగ్ అనౌన్స్ చేయడం మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ వారం గేమ్ మరింత జోష్ పెంచేలా ఉండబోతుందని తెలుస్తోంది.





















