Bigg Boss 9 Telugu : బిగ్‌బాస్ డే 100 రివ్యూ... తండ్రిని తలచుకుని తనూజ ఎమోషనల్... టాస్కులలో దుమ్మురేపిన డెమోన్... ప్లేయర్ ఆఫ్ ది డే ట్రీట్ ఏంటంటే?
Bigg Boss 9 Telugu Today Episode - Day 100 Review : బిగ్ బాస్ సీజన్ 9 డే 100 ఎపిసోడ్లో మరో రెండు ఇంట్రెస్టింగ్ టాస్క్ లను రిపీట్ చేశారు. ఒక టాస్క్ లో తనూజ విన్ అయితే, మరో టాస్క్ లో డెమోన్ గెలిచాడు.

99 రోజు రాత్రి 9 గంటలకు "ఈ టాస్క్ గుర్తుంది కదా? ఈసారైనా అర్థం చేసుకుని సరిగ్గా ఆడతారా? లేదంటే తెలివితేటలు ప్రదర్శిస్తారా ?" అంటూ 'సేవ్ ఇట్ టు విన్ ఇట్' టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో ఏ పెయిర్ అయితే 5 నిమిషాలు బాక్స్ లో ఉన్న నీడిల్ మాస్క్ కు తగలకుండా గాల్లో ఉంచుతారో వాళ్ళే విన్నర్. మూడు బెలూన్లు మాత్రమే ఈ టాస్క్ లో వాడొచ్చు. సంచాలక్ ఎవరు? అనగానే... "ఈ రోజు నేను ఆడతాను. నాకు ఓటు అప్పీల్ కూడా రాలేదు. పైగా ఈరోజు మెసేజ్ కూడా వస్తుంది. ఇప్పుడు నన్ను పక్కన కూర్చోబెడితే, రేపన్న రోజు ఏదైనా వస్తే నేను కూర్చోను" అని రిక్వెస్ట్ చేశాడు డెమోన్. కానీ 2 స్టార్స్ వచ్చాయి అంటూ అందరూ కలిసి అతన్ని సంచాలక్ చేశారు.
డెమోన్ కు ఫ్యామిలీ వీడియో
తనూజా టీమ్ ఇందులో విన్ అని ప్రకటించాడు డెమోన్. ఈ టాస్క్ లో విన్ అయిన కళ్యాణ్, తనూజా లకు స్టార్స్ ఇచ్చారు. అలాగే చికెన్ వింగ్స్ ను ట్రీట్ గా పంపారు. 'ప్లేయర్ ఆఫ్ ది డే ఎవరు?' అని బిగ్ బాస్ అడగ్గా... డెమోన్ ను అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా డెమోన్ కు తన అన్నయ్య నుంచి వీడియో మెసేజ్ పంపారు. అది చూసి డెమోన్ ఎమోషనల్ అయ్యాడు. రాత్రిపూట తనకు బిగ్ బాస్ వదిలి వెళ్లాలని లేదని, వేరే వాళ్లు బ్యాడ్ అవుతారేమో అని ఇన్నాళ్లూ గట్టిగా మాట్లాడకపోవడం ఒక్కటే రిగ్రెట్ గా ఉందని ఒక్కడే కూర్చుని బిగ్ బాస్ తో మాట్లాడుకున్నాడు డెమోన్.
తనూజాకు ఫ్యామిలీ ఫోటో
డే 100 రోజు 'పిక్ ది బోన్' అనే టాస్క్ ఇచ్చారు. తాళ్లతో కట్టిన ఇచ్చును, టైర్లను దాటుకుని ఎవరైతే బోన్ ను ఎక్కువసార్లు పట్టుకుంటారో వాళ్ళే విజేతలు. చివరి రౌండ్ కళ్యాణ్ - డెమోన్ మధ్య జరగ్గా... డెమోన్ విన్ అయ్యాడు. దీంతో అతనికి మరో స్టార్ వచ్చింది. "డెమోన్ మీకిది ఎన్నవ ట్రీట్? అన్నీ మీకేనా?" అని అడిగారు బిగ్ బాస్. మూడుసార్లు... అంటూ అందరితో పంచుకోవడానికి మటన్ మండినీ ట్రీట్ గా అడిగాడు డెమోన్. ఫ్రాంకీని పంపి, ఆ టేస్ట్ ను సంజనాతో పంచుకోమన్నారు బిగ్ బాస్.
తరువాత 'విన్ ఇట్ టు గెయిన్ ఇట్' అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో ముగ్గురు మాత్రమే ఆడాలని చెప్పారు. తనూజా, ఇమ్మూ, సంజన ఈ టవర్ గేమ్ ఆడారు. ఇందులో తనూజా విన్ అయ్యింది. 'నేను నుంచున్న ప్రతిసారీ నువ్వే గెలిచావ్' అన్నాడు డెమోన్. కాగా తనూజకు మరో స్టార్ వచ్చింది. ఆమెకు ట్రీట్ గా డ్రై ఫ్రూట్స్ రబ్డి ఇచ్చారు. "ఈ టాస్క్ గుర్తుందా ?" అంటూ ధమాకా కింగ్ టాస్క్ ఇచ్చారు. "ఇందులో ఈసారి 7 స్కోర్ చేసి చూపిస్తా" అని అన్నాడు డెమోన్. వెల్ క్రోపై చెప్పును ఎవరు ఎక్కువ ఎత్తులో కాలితో అతికిస్తే వాళ్ళే విన్నర్. 3 రౌండ్స్ లో ఆడి డెమోన్ ఇందులో గెలిచాడు. దీంతో డెమోన్ కు 4 స్టార్లు వచ్చాయి. అలాగే తందూరి చికెన్ ను ట్రీట్ గా పంపాడు. తనూజకు ప్లేయర్ ఆఫ్ ది డే ఇచ్చారు. దీంతో ఆమెకు తన ఫ్యామిలీ అంతా కలిసి ఉన్న చెల్లి పెళ్లి ఫోటోను పంపారు. ఆ ఫోటోను చూడగానే ఎమోషనల్ అయ్యి ఏడ్చింది తనూజా.





















