Bigg Boss Telugu Season 8 : పృథ్వీ నిష్క్రమణం.. విష్ణు కన్నీటిమయం.. ఎవరు గెలిచినా ఓకే అని చివర్లో ట్విస్ట్ ఇచ్చాడే!
Bigg Boss Telugu Season 8 : బిగ్ బాస్ ఇంట్లో పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడు. పృథ్వీ వెళ్లిపోవడంతో విష్ణు ఏడ్చింది. నువ్వు చాలా మంచి వాడివి.. గాడ్ బ్లెస్ యూ అంటూ అరిచింది.
Prithvi Eliminated in 13th Weekend: బిగ్ బాస్ ఇంట్లో సండే ఫండే సంగతి తెలిసిందే. సండే టాస్కుల్లో కంటెస్టెంట్లతో ఎంటర్టైన్ చేయించాడు హోస్ట్ నాగ్. హుక్ స్టెప్పులతో సాంగ్స్ కనిపెట్టే ఆట.. కళ్లకు గంతలు కట్టించి మ్యూజిక్ చైర్ ఆటలు ఫన్నీగా సాగాయి. ఇక ఫన్నీ బుక్స్ డెడికేట్ చేసే టాస్క్‌ని పెట్టాడు. చివరకు పృథ్వీ, విష్ణు డేంజర్ జోన్‌లోకి వచ్చారు. అలా పృథ్వీ ఎలిమినేట్ అయి స్టేజ్ మీదకు వచ్చాడు. మరి ఆదివారం నాటి ఎపిసోడ్ ఎలా సాగిందో ఓ సారి చూద్దాం.
సాంగ్స్‌ను హుక్ స్టెప్స్‌తో కనిపెట్టే ఈ టాస్కులో అవినాష్ నవ్వించాడు. డ్యాన్సులు వేసి మెప్పించాడు. నబిల్ మాత్రం దారుణాతి దారుణంగా బోల్తా పడ్డాడు. పూనకాలు లోడింగ్ అంటే.. మనోడికి పునుగులు అని అర్థమైంది. నబిల్, పృథ్వీ ఈ ఆటల్లో పూర్ పర్ఫామెన్స్ ఇచ్చారు. ఈ ఆట తరువాత ప్రేరణ, నిఖిల్ సేఫ్ అయినట్టుగా నాగ్ ప్రకటించాడు. సండే ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే గౌతమ్ సేఫ్ అయినట్టుగా ప్రకటించేశాడు.
ఆ తరువాత కళ్లకు గంతలు కట్టించి ఓ ఆట ఆడించాడు. అందులో పృథ్వీ విన్ అయ్యాడు. ఆ తరువాత ఒక్కో కంటెస్టెంట్ కోసం బిగ్ బాస్ ఓ పోస్టర్‌ను డెడికేట్ చేశాడు. నబిల్ డబుల్ ఇస్మార్ట్.., విష్ణు, పృథ్వీ.. నిన్ను కోరి.., పృథ్వీ.. యానిమల్, గౌతమ్.. ఏక్ నిరంజన్.., రోహిణి.. అరుంధతి, ప్రేరణ.. అందాలరాక్షసి, నిఖిల్.. ఫ్యామిలీ స్టార్, అవినాష్.. సుడిగాడు అని సినిమా టైటిల్స్‌తో డెడికేట్ చేశాడు. అనంతరం నబిల్ సేఫ్ అయినట్టుగా ప్రకటించాడు.
బుక్స్ డెడికేషన్ అనే టాస్క్ పెట్టాడు. ఎక్స్ ట్రా చేయకుండా ఉండటం ఎలా అనే బుక్‌ని అవినాష్‌కు ప్రేరణ ఇచ్చింది. నామినేషన్స్‌లో సరైన కారణాలు చెప్పడం అనే బుక్‌ని నిఖిల్‌కు గౌతమ్ ఇచ్చాడు. బ్రెయిన్ వాడి ఆడటం ఎలా అనే బుక్‌ను విష్ణుకి అవినాష్ ఇచ్చాడు. సపోర్ట్ ఆడగకుండా ఆఢటం ఎలా అనే బుక్‌ని రోహిణికి నబిల్ ఇచ్చాడు. సేఫ్ గేమ్ ఆడకుండా ఉండటం ఎలా? అనే బుక్‌ను అవినాష్‌కు పృథ్వీ ఇచ్చాడు. నిజాయితీగా ఉండటం ఎలా? అనే బుక్‌ను అవినాష్‌కు విష్ణు ఇచ్చింది.
ఆపై మిగిలిన ఇద్దరిలో విష్ణు సేఫ్, పృథ్వీ ఎలిమినేట్ అని ప్రకటించేశాడు నాగ్. పృథ్వీ వెళ్లిపోవడంతో విష్ణు ఏడ్చింది. నువ్వు చాలా మంచి వాడివి.. గాడ్ బ్లెస్ యూ అంటూ లోపల నుంచి విష్ణు గట్టిగా మొత్తుకుంది. మరి అది బయట ఉన్న పృథ్వీకి వినిపించిందో లేదో. స్టేజ్ మీదకు వచ్చిన పృథ్వీ తన జర్నీ వీడియోని చూసి ఎమోషనల్ అయ్యాడు. ఆ తరువాత సూపర్ ఫ్లాప్, సూపర్ హిట్ అనే టాస్క్‌ని ఇచ్చాడు నాగ్. ఓ ముగ్గురి కంటెస్టెంట్లను సూపర్ హిట్, ఓ ముగ్గురిని సూపర్ ఫ్లాప్‌గా చెప్పు అని పృథ్వీకి నాగ్ టాస్క్ ఇచ్చాడు.
అందులో తన స్నేహితులైన నిఖిల్, విష్ణు, నబిల్‌లకు సూపర్ హిట్ అని ఇచ్చాడు. రోహిణి, అవినాష్‌లు నామినేషన్‌లోకి వెళ్లలేదని సూపర్ ఫ్లాప్ ఇచ్చాడు. అవినాష్ ఒకసారి నామినేషన్‌లోకి వచ్చి ఎలిమినేట్ అయ్యాడని పృథ్వీ అన్నాడు. ఇక మిగిలింది ఒక వారమే నామినేషన్స్‌కి వెళ్లలేదు అని రోహిణి గురించి పృథ్వీ అన్నాడు. ఎవరు గెలిచినా ఓకే అన్నాడు.. కానీ తాను మాత్రం నిఖిల్, విష్ణు, ప్రేరణ, నబిల్‌లకు ఓటు వేస్తానని అన్నాడు. పది వారాలు తనను సేఫ్ చేసిన ఆడియెన్స్‌కు థాంక్స్ చెప్పి వెళ్లాడు. క్యాష్ ప్రైజ్ మనీతో పాటు కారు కూడా వస్తుందని నాగ్ తెలిపాడు.
Also Read : కాంతార, దమ్ము To ప్రేమించుకుందాం రా, చక్రం - ఈ సోమవారం టీవీలో ఏయే సినిమాలు వస్తున్నాయంటే?