అన్వేషించండి

Bigg Boss 8 Telugu: పృథ్వీకి దూరంగా ఉంటేనే మెగా చీఫ్ అయ్యావ్, విష్ణుప్రియకి హింట్ ఇచ్చిన నాగ్... మెహబూబ్ అవుట్, యష్మీకి చురకలు

Bigg Boss Telugu Season 8 : బిగ్ బాస్ ఇంట్లో నాగార్జున కంటెస్టెంట్ల తప్పుల్ని సరి చేసే ప్రయత్నం చేశాడు. కంటెస్టెంట్లందరికీ ఈ వారంలో చేసిన తప్పుల గురించి వివరించాడు.

Nagarjuna Hints Mega Chief Vishnupriya About Prithvi: 

బిగ్ బాస్ ఇంట్లో ఎనిమిదో వారం గడిచిపోయేందుకు టైం వచ్చింది. వీకెండ్ ఎపిసోడ్‌కు నాగార్జున వచ్చి కంటెస్టెంట్ల తప్పుల్ని సరి చేసే ప్రయత్నం చేశాడు. మెగా చీఫ్‌గా విష్ణు ప్రియ గెలవడంపై అభినందించాడు. భ కంటెస్టెంట్లందరికీ ఈ వారంలో చేసిన తప్పుల గురించి వివరించాడు. ఇక సినిమా ప్రమోషన్స్‌‌లో భాగంగా కంగువా టీం, క యూనిట్, లక్కీ భాస్కర్ టీం ఇలా అందరూ బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చారు. వారి ప్రమోషన్స్‌లను పక్కన పెడితే.. శనివారం నాటి ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లకు నాగ్ ఇచ్చిన వార్నింగ్‌లు, సలహాలు, సూచనలు ఏంటో చూద్దాం..

కంటెస్టెంట్లు ఆడిన ఆటలు, వారు చేసిన తప్పుల గురించి నాగార్జున చెప్పి కరెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. కన్‌ఫెషన్ రూంలోకి గంగవ్వని పిలిచి.. అందరినీ భలే భయపెట్టావ్ అని నాగ్ మెచ్చుకున్నాడు. ఆ తరువాత మెగా చీఫ్‌ అయిన విష్ణుని అభినందించాడు. నువ్వు చెప్పినట్టుగానే నీ లక్కీ నంబర్ ప్రకారం తొమ్మిదో వారానికి మెగా చీఫ్ అయ్యావ్ అని అన్నాడు. ఒకరికి దూరంగా ఉన్న తరువాతే ఇలా చీఫ్ అయ్యావ్ చూసుకో అని హింట్ ఇచ్చాడు. పృథ్వీ ప్రాణం పెట్టి ఆట ఆడావ్.. అద్భుతంగా అనిపించిందని అన్నాడు. కానీ రోహిణిని చూసిన విధానం తప్పు అని, అలా ఆమె హర్ట్ అయిందని తెలిసిన తరువాత సారీ చెప్పాలి కదా? అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.

పృథ్వీతో కలిసి అద్భుతంగా ఆడావ్.. మీ ఇద్దరి కాంబో అదిరిపోయిందని నిఖిల్‌ ఆటను పొగిడేశాడు. క్విజ్ టాస్కులో సంచాలక్‌గా తడబడ్డావ్ అని నాగ్ అన్నాడు. మాటలు, ఆటలు బాగానే ఉన్నాయ్.. సంచాలక్‌గా బాగా నిర్ణయాలు తీసుకో.. యష్మీలా ఉండకు అంటూ కౌంటర్లు వేశాడు. హరితేజను నామినేట్ చేస్తే ప్రైజ్ మనీ తగ్గుతుందని తెలిసినా నామినేట్ చేశావ్.. మళ్లీ తిరిగి ఆ యాభై వేలు సంపాదించాలని అన్నాడు. గౌతమ్, మెహబూబ్ ఆట బాగా  ఆడారని మెచ్చుకున్నాడు. కానీ గౌతమ్ అలా యష్మీ మీద ఫైర్ అవ్వడం బాగా లేదని, లేడీస్ వీక్ అని చెప్పడం.. లేడీస్ అంటే గౌరవం అని చెప్పడం.. కానీ అలా యష్మీ మీద ఫైర్ అవ్వడం కరెక్ట్‌గా లేదని గౌతమ్‌కు కౌంటర్లు వేశాడు.

హరితేజ, నయని మీ ఇద్దరూ ఏ క్లాన్‌లో ఉన్నారు? అంటూ నిలదీశాడు నాగ్. మాది మినీ క్లాన్.. మా క్లాన్ వాళ్లు ఏదైనా సరే మెజార్టీ అని అంటారు.. అందులో మా ఇద్దరినీ సెలెక్ట్ చేసుకోరని నాకు తెలుసు అంటూ తన క్లాన్ మీద నిందలు వేసింది హరితేజ. ఏదైనా సమస్య ఉంటే.. మీలో మీరు మాట్లాడుకోవాలి.. ఓజీ క్లాన్ అంతా ఒక్కటిగా ఆడుతున్నారు.. వాళ్లలో వాళ్లకి ఎన్ని తేడాలున్నా ఆట కోసం ఒక్కటి అవుతున్నారు అంటూ హరితేజ, నయనిలకి కౌంటర్ వేశాడు నాగ్.

నిఖిల్, యష్మీ టీ షర్ట్ కథను పృథ్వీ చేతే చెప్పించాడు నాగ్. నిఖిల్ జెలసీ ఫీల్ అవుతున్నాడని, గౌతమ్ టీ షర్ట్ వేసుకోవాలని యష్మీ అనుకుందని.. యష్మీ, నిఖిల్ ట్రాక్ గురించి పృథ్వీ చెప్పేశాడు. ప్రేరణ నీకు ఎందుకు అంత ఆత్రుత అని, గౌతమ్ నీకు షీల్డ్ ఇవ్వలేదని ఎందుకు హర్ట్ అయ్యావ్ అని అన్నాడు. అది ఇమ్మెచ్యూర్ అని ప్రేరణ ఒప్పేసుకుంది. యష్మీ నీ ఆట నువ్వు ఆడుకో.. ఎవ్వరి చుట్టూ తిరగకు అంటూ కౌంటర్లు వేశాడు.సంచాలక్‌గా ఉన్నప్పుడు నీకంటూ స్ట్రాటజీలు ఉండకూడదు.. అలా మాట్లాడటం తప్పు అని సరి చేసే ప్రయత్నం చేశాడు నాగ్. ఆ తరువాత గంగవ్వ అర్దరాత్రి ఆడిన నాటకం, దాని వెనుకున్న అవినాష్, టేస్టీ తేజల వీడియోని వేసి చూపించాడు. గంగవ్వ అద్భుతంగా నటించిందని నాగ్ మెచ్చుకున్నాడు. ఇక ఈ ఎనిమిదో వారంలో మెహబూబ్ ఎలిమినేట్ అయినట్టుగా లీక్స్ వినిపిస్తున్నాయి. నయని ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ చివరకు మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడని అంటున్నారు. ఆదివారం నాటి ఎపిసోడ్‌‌లో ఏం జరుగుతుందో చూడాలి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఉద్యోగాల భర్తీ, ములుగు వర్శిటీకి భూకేటాయింపు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఉద్యోగాల భర్తీ, ములుగు వర్శిటీకి భూకేటాయింపు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Sabarimala Alert: ఇరుముడితో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు నిబంధనల సడలింపు
ఇరుముడితో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు నిబంధనల సడలింపు
ABP Southern Rising Summit:  కేసులు పెట్టి ఏం పీక్కుంటారో పీక్కోండి - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఘాటు విమర్శలు
కేసులు పెట్టి ఏం పీక్కుంటారో పీక్కోండి - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఘాటు విమర్శలు
Best CNG Car Under Rs 10 Lakh: హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ వర్సెస్ టాటా పంచ్ సీఎన్‌జీ - రెండిట్లో ఏది బెస్ట్ సీఎన్‌జీ కారు?
హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ వర్సెస్ టాటా పంచ్ సీఎన్‌జీ - రెండిట్లో ఏది బెస్ట్ సీఎన్‌జీ కారు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ind vs NZ Second Test Day 3 Highlights | మూడోరోజుల్లో భారత్ కథ ముగించేసిన న్యూజిలాండ్ | ABP DesamSai Durgha Tej On His Career | ABP Southern Rising Summit 2024 లో సాయి దుర్గ తేజ్ | ABP Desamనేనింకా ఎందుకు బతికున్నానని నా తల్లి వేదన, ప్రెస్ మీట్‌లో ఏడ్చేసిన షర్మిలసౌత్‌పై ఇంత చిన్న చూపా మోదీజీ, ఏబీపీ సదర్న్ రైజింగ్ ఈవెంట్‌లో సీఎం రేవంత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఉద్యోగాల భర్తీ, ములుగు వర్శిటీకి భూకేటాయింపు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఉద్యోగాల భర్తీ, ములుగు వర్శిటీకి భూకేటాయింపు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Sabarimala Alert: ఇరుముడితో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు నిబంధనల సడలింపు
ఇరుముడితో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు నిబంధనల సడలింపు
ABP Southern Rising Summit:  కేసులు పెట్టి ఏం పీక్కుంటారో పీక్కోండి - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఘాటు విమర్శలు
కేసులు పెట్టి ఏం పీక్కుంటారో పీక్కోండి - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఘాటు విమర్శలు
Best CNG Car Under Rs 10 Lakh: హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ వర్సెస్ టాటా పంచ్ సీఎన్‌జీ - రెండిట్లో ఏది బెస్ట్ సీఎన్‌జీ కారు?
హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ వర్సెస్ టాటా పంచ్ సీఎన్‌జీ - రెండిట్లో ఏది బెస్ట్ సీఎన్‌జీ కారు?
Anantapuram News: అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం - ఆరుగురు మృతి
అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం - ఆరుగురు మృతి
Jio Diwali Special Plan: జియో దీపావళి స్పెషల్ ప్లాన్ ఇదే - అన్‌లిమిటెడ్ 5జీ కూడా!
జియో దీపావళి స్పెషల్ ప్లాన్ ఇదే - అన్‌లిమిటెడ్ 5జీ కూడా!
Telangana News: స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటులో మరో ముందడుగు, మేఘా ఫౌండేషన్ రూ.200 కోట్ల విరాళం
స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటులో మరో ముందడుగు, మేఘా ఫౌండేషన్ రూ.200 కోట్ల విరాళం
ABP Southern Rising Summit: అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహం వెనుక రేవంత్ మాస్టర్ ప్లాన్ - జాతీయంగా బీజేపీని ఢీకొడుతున్నారా ?
అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహం వెనుక రేవంత్ మాస్టర్ ప్లాన్ - జాతీయంగా బీజేపీని ఢీకొడుతున్నారా ?
Embed widget