అన్వేషించండి

Bigg Boss Telugu Season 8: కష్టపడ్డాడు... మెగా చీఫ్ అయ్యాడు - రూల్స్ మార్చేసిన గౌతమ్, ‘బొచ్చు’తో ప్రైజ్ మనీ పెంపు

Bigg Boss Telugu Season 8 : : బిగ్ బాస్ ఇంట్లో ఏడో వారం ఓవర్ స్మార్ట్ ఫోన్స్, ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్ లో ఆట ఆడి గౌతమ్ మెగా చీఫ్ అయ్యాడు. వచ్చీ రాగానే ఇంట్లో రూల్స్ మార్చే ప్రయత్నం చేశాడు .

Bigg Boss 8 Telugu Gautham Become Mega Chief : బిగ్ బాస్ ఇంట్లో ఏడో వారం మెగా చీఫ్‌గా గౌతమ్ గెలిచాడు. ఓవర్ స్మార్ట్ ఫోన్స్, ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్ అంటూ టాస్కు పెట్టాడు. అందులో నబిల్, పృథ్వీ, నిఖిల్‌ను మధ్యలోనే అవుట్ చేసేశారు. ఇక ఛార్జింగ్ పాయింట్లు సంపాదించుకుని రాయల్ క్లాన్ నుంచి అందరూ చీఫ్ కంటెండర్లు అయ్యారు. ఓజీ క్లాన్ నుంచి లేడీ కంటెస్టెంట్లంతా కూడా ఆటల్లో ఉండి చీఫ్ కంటెండర్లు అయ్యారు. అలా చివరకు అందరితో ఆట ఆడి.. రాకెట్ వేగంతో దూసుకుపోయి గౌతమ్ మెగా చీఫ్ అయ్యాడు. వచ్చీ రాగానే ఇంట్లో రూల్స్ మార్చే ప్రయత్నం చేశాడు గౌతమ్.

శుక్రవారం నాటి ఎపిసోడ్ ఎలా సాగిందంటే.. కుషన్ టాస్క్ పెట్టి ఆట ఆడించాడు బిగ్ బాస్. ఆ ఆటకి పృథ్వీ సంచాలక్‌గా ఉన్నాడు. ఈ టాస్కులో ఒక్కొక్కరు.. ఇద్దరిద్దర్ని.. ముగ్గురముగ్గుర్ని పంపిస్తూ ఆట ఆడించాడు. ఈ ఆటలో రాయల్ క్లాన్ చివరకు విన్ అయింది. ఇలా టాస్క్ విన్ అవ్వడంతో ఓజీ క్లాన్ నుంచి ఇద్దర్నీ టాస్కు నుంచి పీకేసే ఛాన్స్ వచ్చింది. దీంతో నబిల్, నిఖిల్‌ను టాస్కు నుంచి తీసేశారు. అలా ఆట ముగిసిందని బిగ్ బాస్ తెలిపాడు.

ఆ తరువాత పృథ్వీ గడ్డం గురించి అంతా చర్చించుకున్నారు. ఈ క్రమంలో అవినాష్, పృథ్వీలకు బిగ్ బాస్ బొచ్చు టాస్క్ ఇచ్చాడు. జుట్టు ఎవరు కత్తిరించుకుంటారు.. ఏ స్టైల్లో ఎంత డబ్బు కోసం కట్ చేసుకుంటారో ఆప్షన్స్ ఇచ్చాడు. పృథ్వీ మాత్రం తన గడ్డాన్ని తీయలేనని అన్నాడు. అనినాష్ యాభై వేల ఆప్షన్‌ను ఎంచుకున్నాడు. అవినాష్ హెయిర్ కట్ వల్ల అలా బొచ్చుతో యాభై వేలు ప్రైజ్ మనీకి యాడ్ అయ్యాడు. అవినాష్ త్యాగానికి మెచ్చుకున్న బిగ్ బాస్.. కిచెన్ టైంకి రెండు గంటలు యాడ్ చేశాడు.

ఆ తరువాత ఫ్రీడం ఆయిల్ టాస్క్ ఇచ్చాడు. ఈ ప్రమోషనల్ యాడ్‌లో ఓజీ క్లాన్ విన్ అయింది. ఇక మెగా చీఫ్ కంటెండర్ టాస్కు కోసం పట్టుకో లేదా తప్పుకో అని ఆట పెట్టాడు. ఆ సర్కిల్ గీశాడు.. మధ్యలో ఓ బోన్ లాంటి దాన్ని పెట్టాడు. అందరూ ఆ సర్కిల్ చుట్టూ ఉండాలని అన్నాడు. ఎవరు అయితే ఆ బోన్‌ను పట్టుకుంటారో.. పట్టుకున్న ప్రతీసారి మిగతా కంటెస్టెంట్లను ఈ టాస్కు నుంచి తప్పించే ఛాన్స్ వస్తుందని అన్నాడు. అలా ప్రతీ సారి గౌతమ్ ఆ బోన్‌ను చేజిక్కించుకున్నాడు. అలా కంటిన్యూగా మెహబూబ్, అవినాష్‌లను అవుట్ చేశాడు. రెండో రౌండ్‌లో విష్ణు, ప్రేరణని తప్పించాడు. మూడో రౌండ్‌లో యష్మీ, నయనిలను అవుట్ చేశాడు.

Also Read: బిగ్ బాస్ తెలుగు 8 ఎపిసోడ్ 47 రివ్యూ: నయని నస... టాస్కుల్లో మణి ప్రయాస - ఛార్జింగ్ కొట్టేసిన తేజ అండ్ మెహబూబ్

నాలుగో రౌండ్‌లో ఆ బోన్‌ను మణికంఠ పట్టుకుంటాడు. అయితే ముందుగా తేజ, హరితేజల పేర్లు చెప్పాడు. ఆ తరువాత మాట మార్చి తేజ, గౌతమ్‌ల పేర్లు చెప్పాడు. దీంతో నిర్ణయాన్ని సంచాలక్‌కి వదిలేశాడు బిగ్ బాస్. మణి ముందుగా చెప్పిన పేర్లనే సంచాలక్ నిఖిల్ పరిగణలోకి తీసుకున్నాడు. దీంతో చివరి వరకు ఆ ఆటలో నిలబడి.. గౌతమ్ మెగా చీఫ్ అయ్యాడు. మెగా చీఫ్ అయ్యాక.. ఇంట్లోని లేడీ కంటెస్టెంట్లందరికీ విరామం ఇస్తున్నట్టుగా ప్రకటించాడు. పనులన్నీ మగ కంటెస్టెంట్లే చేస్తారని అన్నాడు. మరి ఈ నిర్ణయం పట్ల ఇంట్లో ఎలాంటి గొడవలు జరుగుతాయో మున్ముందు చూడాలి.

Also Readబిగ్ బాస్ తెలుగు 8 ఎపిసోడ్ 46 రివ్యూ: ‘హరి’కథతో మణికంఠ ఫిదా.. పాత పద్దతినే ఫాలో అయిన అవినాష్... ఈ రోజు హౌస్‌లో ఏం జరిగిందంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Musi  Politics : రేవంత్‌ సవాల్‌పై స్పష్టత ఇవ్వని బీఆర్ఎస్ - మూసీపై అసెంబ్లీ చర్చకు సిద్ధం కాదా ?
రేవంత్‌ సవాల్‌పై స్పష్టత ఇవ్వని బీఆర్ఎస్ - మూసీపై అసెంబ్లీ చర్చకు సిద్ధం కాదా ?
Amaravati Drone Summit 2024: అమరావతి డ్రోన్ సమ్మిట్‌ 2024 లక్ష్యం ఇదే-  కీలకాంశాలతో పాలసీ సిద్ధం చేసిన ప్రభుత్వం
అమరావతి డ్రోన్ సమ్మిట్‌ 2024 లక్ష్యం ఇదే- కీలకాంశాలతో పాలసీ సిద్ధం చేసిన ప్రభుత్వం
India Pakistan Relations: పాకిస్థాన్‌ ప్రధానితో భారత్‌ విదేశాంగ మంత్రి డిన్నర్- వెయిటింగ్ హాల్‌లో చర్చలు- కొత్త అధ్యాయం ప్రారంభమైనట్టేనా? 
పాకిస్థాన్‌ ప్రధానితో భారత్‌ విదేశాంగ మంత్రి డిన్నర్- వెయిటింగ్ హాల్‌లో చర్చలు- కొత్త అధ్యాయం ప్రారంభమైనట్టేనా? 
YSRCP : వైఎస్ఆర్‌సీపీలో మళ్లీ ఆ సీనియర్లకే జిల్లాలను రాసిచ్చిన జగన్  - ఓటమికి బాధ్యుల్ని చేయకుండా పెత్తనం ఎందుకిస్తున్నారు ?
వైఎస్ఆర్‌సీపీలో మళ్లీ ఆ సీనియర్లకే జిల్లాలను రాసిచ్చిన జగన్ - ఓటమికి బాధ్యుల్ని చేయకుండా పెత్తనం ఎందుకిస్తున్నారు ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వీడియో: రూ.50కే కిలో చికెన్, ఇక్కడ అస్సలు తినకండి!!Hamas Chief Yahya Sinwar Killed | హమాస్ చీఫ్‌ సిన్వర్‌ని ఇజ్రాయేల్ ఎలా చంపింది | ABP Desamనటి తమన్నాని ప్రశ్నించిన ఈడీ, మనీ లాండరింగ్ కేసులో విచారణహమాస్ చీఫ్ సిన్వర్ హతం, కీలక ప్రకటన చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Musi  Politics : రేవంత్‌ సవాల్‌పై స్పష్టత ఇవ్వని బీఆర్ఎస్ - మూసీపై అసెంబ్లీ చర్చకు సిద్ధం కాదా ?
రేవంత్‌ సవాల్‌పై స్పష్టత ఇవ్వని బీఆర్ఎస్ - మూసీపై అసెంబ్లీ చర్చకు సిద్ధం కాదా ?
Amaravati Drone Summit 2024: అమరావతి డ్రోన్ సమ్మిట్‌ 2024 లక్ష్యం ఇదే-  కీలకాంశాలతో పాలసీ సిద్ధం చేసిన ప్రభుత్వం
అమరావతి డ్రోన్ సమ్మిట్‌ 2024 లక్ష్యం ఇదే- కీలకాంశాలతో పాలసీ సిద్ధం చేసిన ప్రభుత్వం
India Pakistan Relations: పాకిస్థాన్‌ ప్రధానితో భారత్‌ విదేశాంగ మంత్రి డిన్నర్- వెయిటింగ్ హాల్‌లో చర్చలు- కొత్త అధ్యాయం ప్రారంభమైనట్టేనా? 
పాకిస్థాన్‌ ప్రధానితో భారత్‌ విదేశాంగ మంత్రి డిన్నర్- వెయిటింగ్ హాల్‌లో చర్చలు- కొత్త అధ్యాయం ప్రారంభమైనట్టేనా? 
YSRCP : వైఎస్ఆర్‌సీపీలో మళ్లీ ఆ సీనియర్లకే జిల్లాలను రాసిచ్చిన జగన్  - ఓటమికి బాధ్యుల్ని చేయకుండా పెత్తనం ఎందుకిస్తున్నారు ?
వైఎస్ఆర్‌సీపీలో మళ్లీ ఆ సీనియర్లకే జిల్లాలను రాసిచ్చిన జగన్ - ఓటమికి బాధ్యుల్ని చేయకుండా పెత్తనం ఎందుకిస్తున్నారు ?
Skill University: స్కిల్ యూనివర్శిటీకి అదానీ గ్రూప్ రూ.100 కోట్ల విరాళం - సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు అందజేత
స్కిల్ యూనివర్శిటీకి అదానీ గ్రూప్ రూ.100 కోట్ల విరాళం - సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు అందజేత
Andhra News: ఉచిత ఇసుక విధానంలో మార్పులు - ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఉచిత ఇసుక విధానంలో మార్పులు - ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
Indian Army: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ - ఏపీలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ, ఎక్కడంటే?
నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ - ఏపీలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ, ఎక్కడంటే?
KTR : అది బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్  ప్రాజెక్ట్ - రేవంత్‌ కు కేటీఆర్ కౌంటర్ ప్రజెంటేషన్ !
అది బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ ప్రాజెక్ట్ - రేవంత్‌ కు కేటీఆర్ కౌంటర్ ప్రజెంటేషన్ !
Embed widget