Bigg Boss: కొట్టుకోవడం ఒకటే తక్కువ.. రెచ్చిపోయిన ఆవేశం స్టార్‌లు అవినాష్, పృథ్వీ.. పాపం హరితేజ
Bigg Boss Telugu Season 8 | కొట్టుకోవడం ఒకటే తక్కువ.. రెచ్చిపోయిన ఆవేశం స్టార్‌లు అవినాష్, పృథ్వీ.. పాపం హరితేజ
Bigg Boss 8 Telugu Episode 45 Day 44 written Updates| బిగ్ బాస్ ఇంట్లో ఏడో వారం నామినేషన్ ప్రక్రియ, అందులో జరిగిన గొడవలు టాప్ లేచిపోయినంత పని అయింది. బేబక్క, శేఖర్ బాషా, అభయ్, ఆదిత్య, నైనిక, సోనియా, సీత ఎలిమినేషన్లు జరిగాయి. ఇక ఏడో వారం ఇంటి నుంచి బయటకు పంపించే ప్రాసెస్ సోమవారం ఎపిసోడ్లో మొదలై.. మంగళవారం ఎపిసోడ్లో ముగిసింది. ఈ వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు గౌతమ్, పృథ్వీ, నికిల్, మణికంఠ, యష్మీ, తేజ, నబిల్, ప్రేరణ, హరితేజలు నామినేషన్లోకి వచ్చారు. మంగళవారం ఎపిసోడ్ ఎలా సాగిందంటే.
ప్రేరణను నామినేట్ చేయాలని ఓజీ క్లాన్‌లో మెజార్టీ సభ్యులు ఫిక్స్ అయ్యారు. ఇక యష్మీ అయితే ప్రేరణకు సపోర్ట్ చేయాలని ట్రై చేసింది. కానీ పృథ్వీ మాత్రం ప్రేరణ మీద పగతో ఉండిపోయాడు. దీంతో హ్యాట్‌ను ప్రతీ సారి ఆమెకు దొరకనివ్వకుండా అడ్డుకోగలిగాడు. దీంతో హరితేజకు హ్యాట్ ఎక్కువ సార్లు దొరికింది. ఈ క్రమంలో తేజ వచ్చి యష్మీని నామినేట్ చేశాడు. ఫ్రెండ్ అంటూ నామినేట్ చేయడం నాకు నచ్చలేదు.. ఫ్రెండ్ అనే వాళ్లు అలా చేయరు.. నామినేట్ చేస్తే ఒకవేళ బయటకు వెళ్తే ఎలా అంటూ ఫ్రెండ్‌ని మోసం చేయొద్దు అంటూ యష్మీకి కారణాలు చెబుతూ తేజ నామినేట్ చేశాడు. నయని అయితే విష్ణుని పదే పదే ఒకే కారణతో నామినేట్ చేస్తూ వచ్చింది. కానీ నయని పాయింట్లు సరైనవి కావు అంటూ ఆమె నామినేషన్స్‌ను పరిగణలోకి తీసుకోలేదు. అలా ఆ రౌండ్‌లో యష్మీని నామినేట్ చేసింది హరితేజ.
మళ్లీ నెక్ట్స్ రౌండ్‌కి.. హరితేజ హ్యాట్ పట్టుకుంటే.. నిఖిల్ వచ్చి తేజని నామినేట్ చేశాడు. తేజ చాలా డల్ అయ్యాడని, ఆటల్లో ఎక్కడా కనిపించలేదంటూ నామినేట్ చేశాడు. ఇక మరో వైపు విష్ణు వచ్చి నయనిని రివేంజ్ నామినేషన్ చేస్తున్నా అని చెప్పింది. దీంతో ఆమెకు బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు. సరైన కారణాలు చెప్పాలని మందలించాడు. నయనిలో ఫైర్ తగ్గిపోయిందంటూ మళ్లీ వేరే కారణాల్ని విష్ణు చెప్పింది. కానీ హరితేజ మాత్రం నిఖిల్ పాయింట్లను తీసుకుని.. తేజ కంటే నయని బాగా ఆడింది.. కాబట్టి తేజని నామినేట్ చేస్తున్నట్టుగా చెప్పింది.
ఆ తరువాత ప్రేరణ హ్యాట్ పట్టుకుంది. గౌతమ్, నయనిలు తమ తమ నామినేషన్ పాయింట్లను చెప్పారు. నబిల్ సేఫ్ గేమ్ ఆడాడు అని నాకు అనిపిస్తోంది.. అది నాకు నచ్చలేదు అని గౌతమ్ చెప్పాడు. విష్ణు సరిగ్గా ఆడలేదు.. నాకు వేరే వాళ్లు కూడా ఎవ్వరూ లేరు నామినేట్ చేయడానికి అంటూ నయని తన కారణాలు చెప్పింది. దీంతో నబిల్‌ని ప్రేరణ నామినేట్ చేసింది. ఎవరు ఫేక్.. ఎవరు సరిగ్గా ఆడటం లేదు అన్నది జనాలు చూస్తారు అంటూ గౌతమ్‌కి నబిల్ కౌంటర్ వేశాడు.
ఆపై మళ్లీ హరితేజ హ్యాట్ పట్టుకుంది. ఈ సారి పృథ్వీ, అవినాష్ మధ్య ఓ రేంజ్‌లో వాగ్వాదం జరిగింది. అవినాష్ తన భార్య విషయాన్ని మధ్యలోకి తీసుకొచ్చి.. అదే పాయింట్ మీద పృథ్వీ మాట్లాడితే.. మళ్లీ భార్య గురించి మాట్లాడొద్దు అని అంటున్నాడు. అవినాష్ గత సీజన్‌లోనూ ఇలానే ఆవేశం స్టార్‌లా ఊగిపోయాడు. సీజన్లు మారాయ్ కానీ అవినాష్ బిహేవియర్ మారలేదు. పృథ్వీ కూడా తన నోటికి ఎంతొస్తే అంత వాగేస్తున్నాడు. వాడు, వీడు, రా అని మాటలు దొర్లేస్తున్నాడు. దీంతో పృథ్వీ, అవినాష్ మధ్య పెద్ద మాటల యుద్దమే జరిగింది. కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అయింది.
మళ్లీ నయని వచ్చి విష్ణుని సేమ్ పాయింట్ చెప్పి నామినేట్ చేసింది. కానీ నయని పాయింట్లు సరిగ్గా లేవని హరితేజ చెప్పింది. అవినాష్ అలా తన భార్య చెప్పిన మాటల్ని పట్టుకుని నామినేట్ చేసి ఉండాల్సింది కాదని, అన్ని ఎపిసోడ్స్ చూసి రావాల్సిందని చెప్పింది. నేను అయితే అన్ని ఎపిసోడ్స్ చూసి వచ్చాను అంటూ నోరు జారింది హరితేజ. మాకు కొన్ని ఎపిసోడ్స్ చూశానని చెప్పావ్.. ఇక్కడేమో ఇలా చెబుతున్నావ్ ఏంటి? అని అవినాష్ అడిగాడు. దీంతో హరితేజ అక్కడ దొరికిపోయింది. బిజీగా ఉండటం వల్ల అన్ని ఎపిసోడ్స్ చూడలేకపోయాను అని అవినాష్ అంటే.. దాన్ని కూడా వెక్కిరించాడు పృథ్వీ. వచ్చిన 8 మంది వైల్డ్ కార్డుల్లో ఎవ్వరూ కూడా అన్ని ఎపిసోడ్స్ చూడలేదు అని అవినాష్ బయట పెట్టేశాడు.
చివరకు హరితేజ తన నిర్ణయాన్ని చెప్పి అవినాష్‌ని నామినేట్ చేసింది. దీంతో చివరకు ఈ వారం గౌతమ్, పృథ్వీ, నిఖిల్, మణికంఠ, యష్మీ, తేజ, నబిల్, అవినాష్, ప్రేరణలు నామినేట్ అయినట్టుగా బిగ్ బాస్ చెప్పాడు. రాయల్ క్లాన్.. ఇష్యూనిటీ షీల్డ్‌ని ఒకసారి వాడుకుని.. ఒకరిని సేవ్ చేసుకోవచ్చు.. అని దానికి బదులు మరొకర్ని స్వాప్ చేయాల్సి ఉంటుందని అన్నాడు. దీంతో అవినాష్ ఆ షీల్డ్‌ని వాడుకుని సేవ్ అయి హరితేజను నామినేట్ చేశాడు.. కొన్ని ఎపిసోడ్స్ చూశాను అని చెప్పింది..మళ్లీ మాటలు మార్చి అన్ని ఎపిసోడ్స్ చూశాను అని చెప్పింది. వేరే వాళ్లు సాయం చేస్తే హ్యాట్ తీసుకుంది.. అంటూ కారణాలు చెప్పాడు. అలా చివరకు ఈ ఏడో వారంలో గౌతమ్, పృథ్వీ, నికిల్, మణికంఠ, యష్మీ, తేజ, నబిల్, ప్రేరణ, హరితేజలు నామినేట్ అయ్యారు.