Bigg Boss 8 Telugu Episode 17 Day 16: మళ్లీ బయటపడ్డ సోనియా రంగు, ముద్దులతో ముంచెత్తిన పృథ్వీ
Bigg Boss Telugu Season 8 : మూడో వారంలో రేషన్ కోసం బిగ్ బాస్ టాస్కులు ఇచ్చాడు. మూడు ఛాలెంజ్‌లు ఇచ్చి.. కాంతార, శక్తి టీంల మధ్య పోటి పెట్టాడు. మూడు పోటీలతో ఈరోజు ఎపిసోడ్ సరదాగా సాగింది.
Bigg Boss 8 Telugu Episode 17 Day 16: బిగ్ బాస్ ఇంట్లో రేషన్ కోసం కంటెస్టెంట్లు పడుతున్న కష్టాలు అందరికీ తెలిసిందే. ప్రతీ వారం రేషన్ కోసం టాస్కులు ఆడుతూ కష్టపడుతున్నారు. ఇక ఈ మూడో వారంలో రేషన్ కోసం బిగ్ బాస్ టాస్కులు ఇచ్చాడు. మూడు ఛాలెంజ్‌లు ఇచ్చి.. కాంతార, శక్తి టీంల మధ్య పోటి పెట్టాడు. ఈ క్రమంలో ఫోటో పెట్టు.. ఆగేటట్టు అనే ఫస్ట్ ఛాలెంజ్‌లో నబిల్, పృథ్వీ ఆట ఆడారు. ఆ టాస్కుకి సీత సంచాలక్‌గా వ్యవహరించింది. ఇక పృథ్వీ అగ్రెసివ్‌గా ఆడటం.. ఫిజికల్ అవ్వొద్దని చెప్పినా పృథ్వీ వినకపోవడంతో చివరకు అతడ్ని డిస్ క్వాలిఫై చేసి నబిల్‌ను విజేతగా ప్రకటించింది.
ఆ తరువాత రెండో ఛాలెంజ్‌గా నత్తలా సాకు.. ఏ ఒక్కటీ వదలకు అని టాస్కు పెట్టాడు. ఇందులో ప్రేరణ, ఆదిత్య.. నిఖిల్, సోనియాలు ఆట ఆడారు. ఈ ఆటకు మణికంఠ సంచాలక్‌గా వ్యవహరించాడు. పాక్కుంటూ వెళ్లి తలతో క్యాబేజీలను అటు నుంచి ఇటు తోయాల్సి ఉంటుంది. ఆ ఆటలో సోనియా, నిఖిల్ చాలా వేగంగా ఆట ఆడారు. కానీ చివరకు క్యాబేజీ దొరకలేదని ప్రేరణ ఫైర్ అయింది. కానీ మణికంఠ మాత్రం తన నిర్ణయం మీద ధృడంగా నిలబడి ఉన్నాడు. ఎవరు వేగంగా వెళ్తే.. వాళ్లకి క్యాబేజీలు దొరుకుతాయని అన్నాడు. అదే అడ్వాంటేజ్ అని చెప్పుకొచ్చాడు. ఇక చివరకు తొక్కలో సంచాలక్ అని మణికంఠను తీసి పారేసింది ప్రేరణ. చివరకు మళ్లీ కూల్ అయింది ప్రేరణ. ఇక సోనియా ఆట గెలిచిన తరువాత పృథ్వీ వచ్చి ముద్దుల వర్షం కురిపించాడు. హగ్గులతో నలిపేశాడు.
ఇక మూడో ఛాలెంజ్‌లో భాగంగా బూర కొట్టు.. రేషన్ పట్టు అని టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్కుకి సోనియాని సంచాలక్‌గా పెట్టాడు. ఆట ఆడేందుకు అభయ్, నిఖిల్‌లు రంగంలోకి దిగారు. కానీ సోనియా ఈ ఆటలో తన టీం అయిన నిఖిల్‌కు సపోర్ట్‌గా ఆడినట్టు అనిపిస్తుంది. బెలూన్లు వేయడంలో సోనియా పక్షపాతం చూపించినట్టు అనిపిస్తుంది. అభయ్ ఒంటి మీద ఓ బెలూన్ ఉంది.. కానీ ఆ పాయింట్ కాకుండా.. ఇతర పాయింట్లన్నీ మాట్లాడి.. చివరకు తన టీంను గెలిపించుకుంది.
సంచాలక్‌గా.. నిఖిల్ విన్ అని ప్రకటించింది. దీంతో యష్మీ ఫైర్ అయింది.. నువ్వు ఇక్కడ కూడా మళ్లీ ఫేక్ చేశావ్.. చీట్ చేశావ్.. కావాలని నీకు నచ్చిట్టుగా రూల్స్ మార్చావ్.. నువ్వు ఫేక్ అంటూ యష్మీ మండిపడింది. కానీ సోనియా మాత్రం తన నిర్ణయం రైట్ అని పొగరుగానే ఉంది. యష్మి, సోనియాకు మంచి ఫైట్ అయితే మున్ముందు జరిగేలానే ఉంది.
Read Also: కొత్త లవ్ స్టోరీ, చిన్నోడికి యష్మి గౌడ - సీతతో నిఖిల్ పులిహోర... సోనియాతో ఇద్దరూ కటీఫ్ ?
టాస్కులను పక్కన పెడితే మంగళవారం నాటి ఎపిసోడ్‌లో కొన్ని ఫన్నీ ఘటనలు జరిగాయి. నిఖిల్ ఫ్లర్టింగ్ గురించి సీత కామెంట్ చేసింది. నువ్వు అందరితోనూ అలానే చేస్తావ్ కదా? అని నిఖిల్‌ను అంటే.. ఎవ్వరితోనూ ఫ్లర్ట్ చేయను. కేవలం నీతోనే చేస్తాను అని అంటాడు నిఖిల్. దీంతో యష్మీ, విష్ణు ప్రియ ఇలా అందరినీ పిలిచి సీత అడుగుతుంది. ఇది బయటకు ఎలా వెళ్తుందో తెలియదు.. అందరితో ఎలా ఉంటావో అలానే ఉండు.. ఈ ఫ్లర్ట్ లాంటిది వద్దు అని నిఖిల్‌తో సీత చెప్పింది.